pizza
Ambajipeta Marriage Band Trailer Launch
”Ambajipeta Marriage Band" has all the content needed for a super hit film - Movie Team at trailer release event
సూపర్ హిట్ సినిమాకు కావాల్సిన కంటెంట్ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"లో ఉంది - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


24 January 2024
Hyderabad

 

 

Suhas, the promising young actor of Telugu cinema, has been making waves with his performances in films like 'Colour Photo' and 'Writer Padmabhushan'. He is now ready to entertain the audience with his upcoming film "Ambajipeta Marriage Band." The film produced jointly by GA2 Pictures and director Venkatesh Maha's Mahayana motion pictures, the film is coming also under the banner of Dheeraj Mogilineni Entertainment. Jagadeesh Pratap Bandari of Pushpa fame and Goparaju Ramana playing key roles. Music is scored by Sekhar Chandra. Wajid Baig and Kodati Pawan Kalyan are handling the cinematography and editing departments.

The film is directed by newcomer Dushyanth Katikineni, and it is creating quite a buzz among movie lovers with the promotional content. Today makers unveiled the intense trailer in a grand launch event. On this occasion,

Editor Kodati Pawan Kalyan said - Our film will be more impressive than the trailer that you just watched. The editor is called the first audience of the film. With that confidence, I can say that thr movie will be a great success. We worked hard for three years for the movie "Ambajipeta Marriage Band". It is your responsibility to make this movie a cult classic. See you in the theaters on the 2nd of next month.

Cinematographer Wajid Baig said - Our movie teaser was a big hit. Now the trailer is also getting a good response. We shot the movie "Ambajipeta Marriage Band" in real locations Amalapuram and Ambajipet. Suhas suggested to do so. What you see in the trailer is just a small sample. Suhas will be seen in an intense role.

Actor Kittaiah said - In the movie "Ambajipeta Marriage Band" I played the role of Suhas father. Thanks to the director and Suhas for giving me such a good character. Suhas performance in this movie will impress you. We hope you will watch the movie on February 2nd.

Actress Saranya Pradeep said - Our entire "Ambajipeta Marriage Band" movie team needs your love and support. Your response shows how much you liked the teaser and trailer. Similarly, the movie will impress you You will feel the vibe of Ambajipeta after watching the movie.

Director Dushyant Katikaneni said - Seeing your response, it is clear that you liked the trailer of "Ambajipeta Marriage Band". We made this movie based on some realistic incidents. There is intense drama along with the love story. As the story takes place in a village, castes are mentioned. But the movie does not contain any offensive elements. We are putting in your hands the movie "Ambajipeta Marriage Band" which will hit the theaters on February 2. You have to super hit yourself. I would like to thank all the cast and crew who supported me in the making of the film. Said.

Actor Nithin said - Films that are realistic and have commercial elements are very few. I can proudly say that such a rare movie is "Ambajipeta Marriage Band". As long as you are watching the movie in theaters, you will get the feeling of seeing the life of Maa Malli, the environment of Konaseema and Ambajipet. Said.

Heroine Shivani Nagaram said - I am happy with the response you are showing on the movie "Ambajipeta Marriage Band". I can promise that our movie will be like a double dhamaka in the theatres. "Ambajipet Marriage Band" is coming to the theaters in 9 days. The entire team is very excited about the film. Two songs, teaser and trailer were out from our film. Also it is your responsibility to make the movie a super hit. Watch the film on February 2nd with your gang.

Producer Dhiraj Mogileni said - The reason why I stand before you is because of producer Allu Aravind garu and Bunny Vas. We never thought that we will make a film in our banner. We thought that if we make a film, we must make a good film. When we heard the story of "Ambajipeta Marriage Band", Bunny Vas and I got very excited. Suhas was also very involved and made the movie. He already has good hit movies like Color Photo and Writer Padmabushan. We've seen the passion to maake it a hit film. He shaved his head twice for this film. Along with Suhas, heroine Shivani, Sharanya Pradeep and all the cast performed amazingly. Cinematographer Wajid has shot the Amalapuram area beautifully. Our music director Shekhar Chandra gave superb music. He is still working on the film. You have given a blockbuster film for our banner Baby. We hope you will give another super hit with this movie. Dushyant worked for movies with Venkatesh Maha. The story of this movie was first narrated to Venkatesh Maha. Both of them together narrated to Suhas. Venkatesh Maha wanted to produce the film. We have also heard this story. We liked it very much. Venkatesh Maha has projects as a director so we said we will produce and he said ok. We have produced this movie with Venkatesh Maha as the presenter. To attract audience to small films, big banners should support them. So we have the support of Geetha Arts bannet. Don't compare Baby movie with "Ambajipeta Marriage Band". These are two different genre movies. Allu Arjun supports all our movies. Many movies are coming in our banner. We will work hard for every film to uphold Aravind garu's name.

Hero Suhas said - I was blessed with a baby yesterday. I am in that happiness. I am very happy to see your response to the trailer of "Ambajipeta Marriage Band". We are waiting for the release of our movie. This is a very special movie in my career. Ever since I heard the story, my entire team along with myself have been dedicated to this project. I shaved my head twice. I also learned to play a band. We worked with the belief in the story. While watching the movie you often relate the events of your life. We hope that our film will be a success on February 2.

సూపర్ హిట్ సినిమాకు కావాల్సిన కంటెంట్ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"లో ఉంది - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్

సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

ఎడిటర్ కొదాటి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - మా సినిమా ట్రైలర్ మీకు ఎంత నచ్చిందో అంతకంటే ఎక్కువగా మూవీ ఆకట్టుకుంటుంది. ఎడిటర్ ను సినిమాకు ఫస్ట్ ఆడియెన్ అంటారు. ఆ నమ్మకంతో చెబుతున్నా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది. అలా సాధించేలా మీరే చేయాలి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ఈ సినిమాను కల్ట్ క్లాసిక్ మూవీ చేసే బాధ్యత మీదే. వచ్చే నెల 2న థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్ మాట్లాడుతూ - మా మూవీ టీజర్ హిట్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అమలాపురం, అంబాజీపేటలో రియల్ లొకేషన్స్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా షూటింగ్ చేశాం. అలా చేయాలని సుహాస్ సజెషన్ ఇచ్చాడు. ట్రైలర్ లో మీరు చూస్తున్నవి చిన్న శాంపిల్స్ మాత్రమే. సుహాస్ ఇంటెన్స్ యాక్టింగ్ సినిమాలో చూస్తారు. అన్నారు.

యాక్టర్ కిట్టయ్య మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో నేను సుహాస్ ఫాదర్ రోల్ చేశాను. ఇలాంటి మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి, సుహాస్ కు థ్యాంక్స్. ఈ సినిమాలో సుహాస్ పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఫిబ్రవరి 2న సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ - మీ లవ్ అండ్ సపోర్ట్ మా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీ టీమ్ మొత్తానికీ కావాలి. మీకు టీజర్, ట్రైలర్ ఎంత నచ్చింది అనేది మీ రెస్పాన్స్ తోనే తెలుస్తోంది. ఇలాగే సినిమా కూడా డెఫనెట్ గా నచ్చుతుంది. సినిమా చూసి అంబాజీపేట వైబ్స్ ఫీల్ అవుతారు. అన్నారు.

డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా ట్రైలర్ మీకు బాగా నచ్చిందని మీ హ్యాపీనెస్, రెస్పాన్స్ చూస్తుంటే అర్థమవుతోంది. కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. లవ్ స్టోరీతో పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. ఊరిలో జరిగే కథ కాబట్టి కులాల ప్రస్తావన ఉంటుంది. అయితే ఎవరినీ కించపరిచే అంశాలు మూవీలో ఉండవు. ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి వస్తున్న "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాను మీ చేతుల్లో పెడుతున్నాం. మీరే సూపర్ హిట్ చేయాలి. సినిమా మేకింగ్ లో నాకు సపోర్ట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

యాక్టర్ నితిన్ మాట్లాడుతూ - రియలిస్టిక్ గా ఉంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి అరుదైన సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" అని గర్వంగా చెప్పగలను. థియేటర్స్ లో మీరు సినిమా చూస్తున్నంత సేపు మా మల్లి జీవితాన్ని, కోనసీమ, అంబాజీపేట వాతావరణాన్ని దగ్గరగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అన్నారు.

హీరోయిన్ శివాని నాగరం మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా మీద మీరు చూపిస్తున్న రెస్పాన్స్ కు హ్యాపీగా ఉంది. థియేటర్స్ లో డబుల్ ధమాకాలా మా మూవీ ఉంటుందని ప్రామిస్ చేసి చెప్పగలను. ఇంకా 9 రోజుల్లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" థియేటర్స్ లోకి వస్తోంది. టీమ్ అంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మా సినిమా నుంచి రెండు సాంగ్స్, టీజర్, ట్రైలర్ హిట్ చేశారు. అలాగే సినిమాను కూడా సూపర్ హిట్ చేయాల్సిన బాధ్యత మీదే. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లతో కలిసి థియేటర్స్ కు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - నేను నిర్మాతగా మీ ముందు నిలబడటానికి కారణం అల్లు అరవింద్ గారు, బన్నీ వాస్ గారు. మా సంస్థలో ఏదో ఒక సినిమా చేసేద్దాం అని ఎప్పుడూ అనుకోలేదు. సినిమా చేస్తే తప్పకుండా హిట్ మూవీనే చేయాలి అనుకున్నాం. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" కథ వినగానే బన్నీ వాస్ గారు నేను చాలా ఎగ్జైట్ అయ్యాం. సుహాస్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి మూవీ చేశాడు. ఆయనకు అప్పటికే కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి మంచి హిట్ మూవీస్ ఉన్నాయి. ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేయాలనే తపన సుహాస్ లో కనిపించింది. రెండు సార్లు ఈ సినిమా కోసం గుండు చేయించుకున్నారు. సుహాస్ తో పాటు హీరోయిన్ శివానీ, శరణ్య ప్రదీప్..ఇలా కాస్ట్ అంతా అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. సినిమాటోగ్రాఫర్ వాజిద్ అమలాపురం ప్రాంతాన్ని అందంగా తెరకెక్కించారు. మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు. మా సంస్థలో బేబి వంటి బ్లాక్ బస్టర్ ను మీరు అందించారు. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ ఇస్తారని ఆశిస్తున్నాం. దుశ్యంత్ వెంకటేష్ మహా దగ్గర మూవీస్ కు వర్క్ చేశాడు. ఈ సినిమా కథ దుశ్యంత్ వెంకటేష్ మహాకే చెప్పాడు. వాళ్లిద్దరు కలిసి సుహాస్ కు నెరేట్ చేశారు. వెంకటేష్ మహా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. ఈ కథ మేము కూడా విన్నాం. మాకు బాగా నచ్చింది. వెంకటేష్ మహాకు డైరెక్టర్ గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము ప్రొడ్యూస్ చేసుకుంటాం అని చెప్పాం. ఆయన సరేనన్నారు. వెంకటేష్ మహా ప్రెజెంటర్ గా ఈ మూవీ మేము ప్రొడ్యూస్ చేశాం. చిన్న సినిమాలకు ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే పెద్ద బ్యానర్స్ సపోర్ట్ ఉండాలి. అలా మాకు గీతా సంస్థ సపోర్ట్ ఉంది. బేబి సినిమాకు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" తో పోలికలు పెట్టుకోవద్దు. ఇవి రెండు వేర్వేరు జానర్ మూవీస్. ఏ మూవీ సక్సెస్ ఆ మూవీకే ఉంటుంది. మా ప్రతి సినిమాకు అల్లు అర్జున్ సపోర్ట్ ఉంటుంది. మా సంస్థలో చాలా మూవీస్ రాబోతున్నాయి. అరవింద్ గారి పేరు నిలబెట్టేలా ప్రతి సినిమాకు కష్టపడతాం. అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ - నాకు నిన్న బాబు పుట్టాడు. ఆ హ్యాపీనెస్ లోనే ఉన్నాను. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ట్రైలర్ కు మీ రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది నా కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ. కథ విన్నప్పటి నుంచి నాతో పాటు మా టీమ్ అంతా ఈ ప్రాజెక్ట్ కు డెడికేట్ అయ్యాం. రెండు సార్లు గుండు చేయించుకున్నా. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథ మీద నమ్మకంతోనే అంతగా కనెక్ట్ అయి వర్క్ చేశాం. సినిమా చూస్తున్నప్పుడు మీరు చాలా సందర్భాల్లో మీ లైఫ్ లో జరిగిన సందర్భాలను రిలేట్ చేసుకుంటారు. ఫిబ్రవరి 2న మా సినిమాకు మంచి సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు

 


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved