pizza
Kirrak Party trailer launch
`కిరాక్ పార్టీ` టీజింగ్ ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

31 January 2018
Hyderabad

ఏటీవీ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం `కిరాక్ పార్టీ`. ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. నిఖిల్ సిద్ధార్థ్‌, సిమ్ర‌న్ ప‌రీన్జా, సంయుక్తా హెగ్డే, బ్ర‌హ్మాజీ, సిజ్జు, ర‌ఘు కారుమంచి, సాయాజీ షిండే, హ‌నుమంత గౌడ‌, రాఘ‌వ‌, ప్ర‌మోదిని, రాకేందు మౌళి, రాఘ‌వేంద్ర‌, ఆర్‌.జె. హేమంత్‌, స‌మీర్‌, న‌వీన్‌, కార్తిక్‌, మౌర్య కీల‌క పాత్ర‌ధారులు. ష‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌కుడు. రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌. ఈ చిత్రం టీజింగ్ ట్రైల‌ర్ బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్ లో విడుద‌లైంది. తేజ విడుద‌ల చేశారు.

తేజ మాట్లాడుతూ ``అనిల్‌, కిశోర్‌, అభిషేక్‌గారు రమ్మంటే వ‌చ్చాను. మామూలుగా ఇలాంటి వేడుక‌ల‌కు చివ‌రి నిమిషంలో ఎగ్గొడుతుంటాను. కానీ నా త‌దుప‌రి చిత్రం అనిల్‌తో కాబ‌ట్టి వ‌చ్చాను. ఇక్క‌డికి వ‌చ్చాక టీజ‌ర్ చూస్తే చాలా బావుంది. ఇంకో సారి చూడాల‌నిపించింది. గ‌డ్డంతోనూ, మామూలుగానూ నిఖిల్ బావున్నాడు. ఇందులో నిఖిల్ ఫ్రెండ్స్ అంద‌రూ నేచుర‌ల్‌గా క‌నిపించారు. మిర్చి హేమంత్ త‌ప్ప మిగిలిన వాళ్లంద‌రూ కొత్త‌గానే ఉన్నారు. ఈ సినిమాకు మంచి ఫ్యూచ‌ర్ ఉంది`` అని తెలిపారు.

నిఖిల్ మాట్లాడుతూ ```నువ్వు నేను`, `జ‌యం` సినిమాల‌ను నేను క్లాస్‌ల‌కు బంక్ కొట్టి మ‌రీ వెళ్లి చూశాను. కాలేజీ నేప‌థ్యంలో `హ్యాపీడేస్‌` చేశాను. ఆ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇదే. ఇందులో నేను హీరో కాదు. కాలేజీలో ఒక కుర్రాడిగా క‌నిపిస్తాను. నాతో పాటు తొమ్మిది మంది ఉంటారు. ఇది ప్ర‌తి ఒక్క‌రికి త‌మ కాలేజీ రోజుల‌ను గుర్తుచేస్తుంది. మా సినిమా షూటింగ్ పూర్త‌యిన చివ‌రి రోజు ఏడ్చాం. సినిమాను అతి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తాం`` అని అన్నారు.

రాకేందుమౌళి మాట్లాడుతూ ``ఇందులో నాలుగు పాట‌లు కూడా రాశాను. నిఖిల్ కృష్ణ‌గా క‌నిపిస్తే, నేను అర్జునుడిగా క‌నిపించాను`` అని అన్నారు.

సుధీర్ వ‌ర్మ మాట్లాడుతూ ``ఈ సినిమా ద‌ర్శ‌కుడు నా ద‌గ్గ‌ర‌, చందు మొండేటి ద‌గ్గ‌ర స‌హాయ‌కుడిగా ప‌నిచేశాడు.క‌ష్ట‌ప‌డే వ్య‌క్తి. చాలా బాగా తెర‌కెక్కించాడు ఈ సినిమాను`` అని చెప్పారు.

సిమ్ర‌న్ మాట్లాడుతూ ``కాలేజీ బ్యాక్‌గ్రౌండ్ అన‌గానే చాలా బాగా క‌నెక్ట్ అయ్యాను`` అని అన్నారు.

సంయుక్త మాట్లాడుతూ ``క‌న్న‌డ‌లో ఈ సినిమా చేశాను. తెలుగులోనూ చేయ‌డం ఆనందంగా ఉంది. అంద‌రూ స‌పోర్ట్ చేశారు. డ‌బ్బింగ్ కూడా చెప్పాను`` అని తెలిపారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``క‌న్న‌డ‌లో పెద్ద హిట్ అయిన సినిమా ఇది. మ‌న‌కు త‌గ్గ‌ట్టు క‌థ‌ను మౌల్డ్ చేశాం. బాగా ఆడుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని అన్నారు.

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: కిర‌ణ్ గ‌రికిపాటి, స‌హ నిర్మాత‌లు: అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, స్క్రీన్‌ప్లే: సుధీర్ వ‌ర్మ‌, మాట‌లు: చందు మొండేటి, కెమెరా: అద్వైత గురుమూర్తి, సంగీతం: అజ‌నీష్ లోక్‌నాథ్‌, ఎడిట‌ర్‌: ఎం.ఆర్‌.వ‌ర్మ‌, ఆర్ట్: అవినాష్ కొల్ల‌, ఫైట్స్: వెంక‌ట్‌, కొరియోగ్ర‌ఫీ: అని, విజ‌య్‌, అవినాష్‌.


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved