pizza
Kushi trailer launched
'Kushi' is an amazing Love Story Will Impress Audience Across the country - Hero The Vijay Devarakonda at Trailer launch event
‘ఖుషి’ అమేజింగ్ లవ్ స్టోరి, ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది - ట్రైలర్ రిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ
You are at idlebrain.com > News > Functions
Follow Us


9 August 2023
Hyderabad

Vijay Devarakonda and Samantha's Khushi movie trailer release event was held in Hyderabad today. The film crew participated in this program. The colorful trailer with love and family emotions impressed everyone. This movie is directed by Siva Nirvana. Naveen Yerneni and Y Ravi Shankar are producing under Mythri Movie Makers banner. 'Kushi' is getting ready for pan India release on September 1. At the trailer release event

Mythri CEO Cherry said - Thanks to everyone who came here to participate in the 'Kushi' trailer release event. Thanks to the hero Vijay, the director Shiva Nirvana, and the rest of the team who came to this program. Our heroine Samantha was not able to come here today. Director Shiva Nirvana made this movie with Heart and Soul. When he told the story, it felt very new and interesting. Immediately we started the movie. This is Vijay's second film in our production after Dear Comrade. Hesham Abdul Wahab gave superb music. We are bringing you a good love story on September 1.

DOP G. Murali said - 'Kushi' is the second Telugu film I have done after Andala Rakshasi. This is a cute lovable film. After watching this movie, you will come out with a good feeling. Happy to work with director Shiva garu. Thanks to Mythri Movie Makers for giving me this opportunity. Ravi and Cherry treat me like a brother. I want to work for more films in Telugu after this film.

Music Director Hesham Abdul Wahab said - I got the opportunity to work for the movie 'Kushi' at a time when I was thinking that music should reach everyone. One day I got a call from Mythri. He asked me to come to Hyderabad immediately. When I came and heard the story, I went into an emotion. Director Siva Garu and I worked very hard to give music that will be remembered forever for this movie. We traveled for two years for this film. Today, music lovers are celebrating the songs of 'Kushi' like a magix. The applause and appreciation coming to the music of this film is not mine alone but the whole team's.

Producer Naveen Yerneni said - Thanks to all of you who are supporting the movie 'Kushi'. Director Siva and hero Vijay gave us an opportunity to make this film in our production. You heard how good the songs are. We are going to release the movie 'Kushi' on September 1. We will do a grand musical comcert on August 15. Thanks to all our team for making 'Kushi' so beautiful.

Director Shiva Nirvana said - I have been traveling with 'Kushi' for two years. I was exposed to many emotions during this process. We shot this movie in many beautiful places of the country. The shooting of the movie stopped once in the middle. In this entire journey I have not faced any problem with my team. From assistant directors to hero Vijay, everyone supported me. After watching Arjun Reddy's movie, I fell in love with Vijay. I have shown all that love in this movie. You will have seen some of that love in the trailer. Samantha is my favorite actress. I like her way of understanding the story and character. This is my fourth film. I haven't met audience through theater after Majili. That stayed with me a lot. I am going to show my love to the audience with this movie. Love and celebration are both happen in the film 'Kushi'. I love Mani Ratnam sir's movies. Every time I go to Kashmir, It feels like he'sin there in kashmir..

Hero Vijay Devarakonda said - Thanks to the media friends and fans of different states who came to participate in the trailer launch of the movie 'Kushi'. We want to share more about our movie with you. This is an amazing film. A cute love story. Audience across the country will connect with our story. This movie is related to our traditions, family ties and marriage system. Happy to be a part of such a film. Now we are getting a chance to show our stories across the country. I feel lucky and honored to be a hero in such a time. Mutual understanding and sharing of love, these two qualities a life partner should have. We should support each other in times of trouble. Only then will bonds stand. I have lost interest in love stories. I felt Kushi story was amazing after hearing the narration. It got me interested in acting in love stories again. We are all fans of Mani Ratnam sir. We love his movies very much. Once upon a time no one would talk to me about marriage. But lately, seeing my friends getting married and their lives, I have developed liking for marriage. Marriage is an important chapter in life. I will also enter that chapter. There are many directors I like in Tamil. Gautham Vasudev Menon, Captain Miller Director Arun, Vetri Maaran, Pa Ranjith. If I get a chance, I will definitely do a film with them. I want to do films in Malayalam as well. But after learning to speak Malayalam, I will make a movie there. I never thought I would become an actor. If I had known, I would have learned all the Pan India languages. I got busy now, there is no time to study. At the time of shooting half of 'Kushi', Samantha's health was not good. We thought we should wait for her not six months but a year. Even if it takes ten years for her to be cured, we wanted to change this story and make a film after ten years. We know Samantha's contribution to this movie. But no matter how many difficulties, she came and completed the film. Action movies are chosen for Pan India. Love is the same in everyone's life. We wanted to show that rooted love story pan India wise. I have no intention of doing web series. I don't like titles before names. That's why we put The Vijay Devarakonda in the titles of this movie.

‘ఖుషి’ అమేజింగ్ లవ్ స్టోరి, ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది - ట్రైలర్ రిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు. కలర్ ఫుల్ గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న ‘ఖుషి’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో

మైత్రీ సీఈవో చెర్రీ మాట్లాడుతూ - ‘ఖుషి’ ట్రైలర్ రిలీజ్ వేడుకలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరో విజయ్, దర్శకుడు శివ నిర్వాణ..ఇతర టీమ్ అందరికీ థాంక్స్. మా హీరోయిన్ సమంత ఇక్కడికి ఇవాళ రాలేకపోయింది. దర్శకుడు శివ నిర్వాణ హార్ట్ అండ్ సోల్ తో ఈ సినిమాను రూపొందించారు. ఆయన కథ చెప్పినప్పుడే చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. వెంటనే మేము మూవీని స్టార్ట్ చేశాం. డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ మా సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. సెప్టెంబర్ 1న ఒక మంచి లవ్ స్టోరిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అన్నారు.

డీవోపీ జి.మురళి మాట్లాడుతూ - అందాల రాక్షసి తర్వాత నేను చేసిన రెండో తెలుగు సినిమా ‘ఖుషి’. ఇదొక క్యూట్ లవబుల్ ఫిల్మ్. ఈ సినిమా చూశాక మంచి ఫీల్ తో బయటకు వస్తారు. దర్శకుడు శివ గారితో పనిచేయడం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు థాంక్స్. రవి గారు, చెర్రీ గారు నన్ను ఒక బ్రదర్ లా చూసుకుంటారు. ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని చిత్రాలకు పనిచేయాలని అనుకుంటున్నాను. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ - మంచి మ్యూజిక్ చేయాలి. ఆ మ్యూజిక్ అందరికీ రీచ్ అవ్వాలని అనుకుంటున్న టైమ్ లో ‘ఖుషి’ సినిమాకు పనిచేసే అవకాశం దక్కింది. ఒక రోజు మైత్రీ నుంచి కాల్ వచ్చింది. వెంటనే హైదరాబాద్ రమ్మన్నారు. వచ్చి కథ వినగానే ఒక ఎమోషన్ లోకి వెళ్లిపోయాను. ఈ సినిమాకు ఎప్పటికీ గుర్తుండే మ్యూజిక్ ఇచ్చేందుకు నేను డైరెక్టర్ శివ గారు ఎంతో కష్టపడ్డాం. రెండేళ్లపాటు ఈ సినిమా కోసం ట్రావెల్ చేశాం. ఇవాళ ‘ఖుషి’ పాటలను మ్యూజిక్ లవర్స్ ఒక సెలబ్రేషన్ లా జరుపుకుంటున్నారు. ఈ సినిమా మ్యూజిక్ కు వస్తున్న పేరు నా ఒక్కడిది కాదు మొత్తం టీమ్ ది. అని అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ - ‘ఖుషి’ సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థాంక్స్. దర్శకుడు శివ, హీరో విజయ్ మా సంస్థలో ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు. పాటలు ఎంతబాగున్నాయో మీరు విన్నారు. సెప్టెంబర్ 1న ‘ఖుషి’ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఆగస్టు 15న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తాం. ‘ఖుషి’ని ఇంత అందంగా తీర్చిదిద్దిన మా టీమ్ అందరికీ థాంక్స్. అన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ‘ఖుషి’తో రెండేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. ఈ క్రమంలో ఎన్నో ఎమోషన్స్ కు గురయ్యాను. దేశంలోని అనేక అందమైన ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. మధ్యలో సినిమా షూటింగ్ ఒకసారి ఆగిపోయింది. ఈ మొత్తం జర్నీలో నాకు ఏ ఇబ్బందీ రానిది నా టీమ్ తోనే. అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి హీరో విజయ్ వరకు అందరూ సపోర్ట్ చేశారు. అర్జున్ రెడ్డి సినిమా చూశాక విజయ్ అంటే విపరీతమైన లవ్ ఏర్పడింది. అదంతా ఈ సినిమాలో చూపించాను. ట్రైలర్ లో ఆ లవ్ కొంత చూసి ఉంటారు. సమంత నా అభిమాన నటి. ఆమె కథను, క్యారెక్టర్ ను అర్థం చేసుకునే విధానం నాకు బాగా నచ్చుతుంది. ఇది నా నాలుగో సినిమా. మజిలీ తర్వాత నేను థియేటర్ ద్వారా ప్రేక్షకుల్ని కలుసుకోలేదు. ఆ వెలితి నాలో చాలా ఉండిపోయింది. ఈ సినిమాతో ప్రేక్షకులపై నాకున్న ప్రేమను చూపించబోతున్నా. లవ్ అండ్ సెలబ్రేషన్ ఈ రెండు ‘ఖుషి’ సినిమాలో ఉంటాయి. మణిరత్నం సార్ సినిమాలు నాకు చాలా ఇష్టం. కాశ్మీర్ వెళ్లిన ప్రతిసారీ ఆయనే గుర్తుకు వస్తారు. అన్నారు.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ‘ఖుషి’ సినిమా ట్రైలర్ లాంఛ్ లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ రాష్ట్రాల మీడియా మిత్రులకు, అభిమానులకు థాంక్స్. మీతో మా సినిమా గురించి మరిన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఇదొక అమేజింగ్ ఫిల్మ్. క్యూట్ లవ్ ఫిల్మ్. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు మా కథకు కనెక్ట్ అవుతారు. మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇది. ఇలాంటి చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మన కథలను చూపించే అవకాశం దక్కుతోంది. ఇలాంటి టైమ్ లో నేను హీరోగా ఉండటం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. పరస్పరం అర్థం చేసుకోవడం, ప్రేమను పంచడం ..ఈ రెండు క్వాలిటీస్ జీవిత భాగస్వామికి ఉండాలి. కష్ట సుఖాల్లో ఒకరికి మరొకరు సపోర్ట్ గా నిలవాలి. అప్పుడే బంధాలు నిలుస్తాయి. నాకు ఆ మధ్య ప్రేమ కథల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఖుషి కథ విన్న తర్వాత బ్యూటిఫుల్ ఫీల్ కలిగింది. మళ్లీ ప్రేమ కథల్లో నటించాలనే ఆసక్తి కలిగింది. మేమంతా మణిరత్నం సార్ అభిమానులం. ఆయన సినిమాలను ఎంతో ఇష్టపడతాం. ఒకప్పుడు నా దగ్గర ఎవరూ పెళ్లి మాట ఎత్తేవారు కాదు. కానీ ఈ మధ్య నా స్నేహితులు పెళ్లి చేసుకోవడం , వాళ్ల జీవితాలు చూస్తుంటే నాకు పెళ్లి మీద అయిష్టం పోయింది. వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఛాప్టర్. నేనూ ఆ ఛాప్టర్ లోకి అడుగుపెడతా. తమిళంలో నాకు నచ్చిన దర్శకులు చాలా మంది ఉన్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిల్లర్ డైరెక్టర్ అరుణ్, వెట్రి మారన్, పా రంజిత్. అవకాశం వస్తే వాళ్లతో తప్పకుండా సినిమా చేస్తా. మలయాళంలోనూ నాకు సినిమాలు చేయాలని ఉంది. అయితే మలయాళం మాట్లాడటం వచ్చిన తర్వాత అక్కడ మూవీ చేస్తా. నేను యాక్టర్ అవుతానని అనుకోలేదు. తెలిస్తే పాన్ ఇండియా లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకునేవాడిని. ఇప్పుడు బిజీగా మారా. నేర్చుకునే టైమ్ దొరకడం లేదు. ‘ఖుషి’ హాఫ్ పార్ట్ షూట్ చేసే టైమ్ కు సమంతకు హెల్త్ బాగాలేదు. ఆమె కోసం ఆరు నెలలు కాదు సంవత్సరం అయినా వెయిట్ చేద్దామని అనుకున్నాం. సమంత కోలుకుంటే చాలనుకున్నాం. ఒకవేళ తను క్యూర్ అయ్యేందుకు పదేళ్లు పట్టినా..ఈ కథను మరోలా మార్చి ..పదేళ్ల తర్వాత సినిమా చేయాలనుకున్నాం. ఈ సినిమాకు సమంత చేసిన కాంట్రిబ్యూషన్ మాకు తెలుసు. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా..ఆమె వచ్చి సినిమా పూర్తి చేసింది. యాక్షన్ సినిమాలనే పాన్ ఇండియా కోసం ఎంచుకుంటారు. కానీ ఈ సినిమా మేము వివిధ రాష్ట్రాల్లో బాక్సాఫీస్ నెంబర్స్ చూపించేందుకు చేసింది కాదు. లవ్ అనేది అందరి లైఫ్ లో ఒకటే. ఆ రూటెడ్ లవ్ స్టోరిని పాన్ ఇండియా వైజ్ చూపించాలని అనుకున్నాం. నాకు వెబ్ సిరీస్ లు చేసే ఉద్దేశం లేదు. నాకు పేరు ముందు బిరుదులు పెట్టుకోవడం ఇష్టం లేదు. అందుకే ఈ సినిమాలో ద విజయ్ దేవరకొండ అని టైటిల్స్ లో పెట్టాం. అని చెప్పారు.

 


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved