pizza
Lanka trailer & music launch
`లంక‌` ప్ర‌చార చిత్రం విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 March 2017
Hyderaba
d

నిన్నటితరం అందాల భామ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ `లంక`. రాశి, సాయిరోన‌క్‌, ఇన‌సాహా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్ర‌చార చిత్ర విడుద‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం శనివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ సినిమా ప్ర‌చార చిత్రాన్ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌లు సి.ఎం.ప్ర‌వీణ్‌కుమార్‌, జ‌నార్ధ‌న్ రెడ్డి, సాయిర‌మేష్‌, భూష‌ణ్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు శ్రీముని మాట్లాడుతూ - ``మైండ్ గేమ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ లంక‌. ముగ్గురు ప్ర‌దాన పాత్ర‌ల మ‌ధ్య సాగే చిత్రం. ఈ సినిమాలో ఒక పాట మాత్ర‌మే ఉంటుంది. సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``మంచి క‌థ ఉంటే చిన్నా, పెద్ద అనే సంబంధం లేకుండా ఏ సినిమా అయినా స‌క్సెస్ సాధిస్తుంది. ఇక లంక అనే టైటిల్ చాలా బావుంది. క‌ళ్యాణ్ వైభోగ‌మే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన రాశికి ఈ లంక సినిమా మంచి బ్రేక్ అవుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో స‌త్యం రాజేష్‌. ముత్యాల రాందాస్‌, ర‌వికుమార్ త‌దిత‌రులు పాల్గొని చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved