pizza
D. Suresh Babu launches Pelli Choopulu trailer
`
పెళ్ళిచూపులు` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 July 2016
Hyderabad

విజయ్ దేవరకొండరీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌వినూతన గీత బ్యానర్స్ పై  రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంరట్ టైనర్ 'పెళ్ళి చూపులు'.  ఎన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న టెస్ట్ ఫుల్ నిర్మాత రాజ్ కందుకూరియస్ రాగినేనితో కలిసి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా....

డి.సురేష్ బాబు మాట్లాడుతూ ``ట్రైల‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. మంచి ఎంట‌ర్‌టైనింగ్ మూవీలా క‌నిపిస్తుంది. సినిమా త‌ప్పుకుండా పెద్ద స‌క్సెస్ అయ్యి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు యూనిట్‌కు మంచి పేరు తీసుకు రావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Glam gallery from the event

ఈ చిత్రం గురించి నిర్మాతలు నిర్మాత రాజ్ కందుకూరియస్ రాగినేనిమాట్లాడుతూ `'ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌మోష‌న్ పోస్ట‌ర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. హీరోహీరోయిన్ల నటన,సినిమాటోగ్రఫీసంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. 'ఎవడే సుబ్రమణ్యంచిత్రంలో కీలక పాత్ర పోషించిన విజరు దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. ట్రైలర్ ను విడుదల చేసిన సురేష్ బాబుగారికి థాంక్స్. ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉందని అందరూ అంటున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేసి సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

విజయ్ దేవర కొండరీతూవర్మప్రియదర్శినిఅభయ్ బేతిగంటికేదార్ శంకర్గురురాజ్అనీష్ కురువిల్లా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నాగేష్ బానెల్మ్యూజిక్: వివేక్ సాగర్ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రంజిత్ కుమార్నిర్మాతలు: నిర్మాత రాజ్ కందుకూరియస్ రాగినేని దర్శకత్వం: భాస్కర్.  


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved