pizza
Pelliki Mundu Premakatha trailer launch
`పెళ్ళికి ముందు ప్రేమ‌క‌థ` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 April 2017
Hyderabad

ప్రేమ్‌కుమార్ పాట్ర‌, మాస్ట‌ర్ అవినాష్ స‌లండ్ స‌మ‌ర్ప‌ణ‌లో గ‌ణ‌ప‌తి ఎంటర్‌టైన్మెంట్స్‌, ప‌ట్నం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై చేత‌న్ శీను, సునైన హీరో హీరోయిన్లుగా మ‌ధు గోపు ద‌ర్శ‌క‌త్వంలో డి.ఎస్‌.కె, అవినాష్ స‌లండ్ర‌, సుధాక‌ర్ ప‌ట్నం నిర్మాత‌లుగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ `పెళ్ళికి ముందు ప్రేమ‌క‌థ‌`. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా..

డి.ఎస్‌.రావు మాట్లాడుతూ - ``సినిమా చూడ‌టానికి చిన్న సినిమాలా ఉన్నా నేను ఒంట‌రి సైనికుడిలా పోరాటం చేశాను. మ‌ధు క‌థ చెప్పిన‌ప్పుడు క‌థ న‌చ్చింది. అయితే సినిమాను తీయ‌గ‌లుగుతామా అని ఆలోచిస్తున్న స‌మ‌యంలో సుధాక‌ర్ న‌న్ను క‌లిశాడు. అలా న‌లుగురుగా క‌లిసి నా ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొత్త ద‌ర్శకుడిని ప‌రిచ‌యం చేస్తూ, ఛాలెంజింగ్ తీసుకుని చేశాను. రొమాన్స్, ఎంట‌ర్‌టైన్మెంట్ అన్నీ స‌మ‌పాళ్ళ‌లో ఉండేలా చూసుకుని సినిమా తీశాం. ప్రేక్ష‌కుల ఆశీస్సులు కావాలి`` అన్నారు.

ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ - ``డి.ఎస్‌.రావుగారు సినిమా అంటే ప్రాణం పెట్టి చేసే వ్య‌క్తి. ఆయ‌న చేసిన పిల్ల జ‌మీందార్ నాకు ఎంతో ఇష్టం. త్వ‌ర‌లోనే ఆయ‌న‌తో ఓ సినిమా కూడా చేయ‌బోతున్నాను. పెళ్ళికి ముందు ప్రేమ‌క‌థ టైటిల్ బావుంది. యూత్‌ఫుల్‌గా ఉంది. కెమెరా వ‌ర్క్‌, ట్రైల‌ర్‌, పాట‌లు అన్నీ బావున్నాయి. హీరో చేత‌న్‌, హీరోయిన్‌, విల‌న్ స‌హా అంద‌రూ బావున్నారు. యూనిట్‌కు పెద్ద స‌క్సెస్ మూవీగా ఇది నిల‌బ‌డాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Glam gallery from the event

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - ``డిఎస్‌.రావుగారు ఎంతో ఎఫ‌ర్ట్ పెట్టి సినిమా చేశారు. మిత్రులంద‌రినీ క‌లుపుకుని ఓ మంచి సినిమా తీయాల‌నే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది`` అన్నారు.

చేత‌న్ శీను మాట్లాడుతూ - ``రాజుగారి గ‌ది త‌ర‌హాలో ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. డిఎస్‌.రావుగారు ప్ర‌తి విష‌యంలో ఎంతో కేర్ తీసుకుని చేశారు. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

ద‌ర్శ‌కుడు మ‌ధు గోపు మాట్లాడుతూ - ``ఏదో ఒక సినిమా చేద్దామ‌ని కాకుండా మంచి సినిమా చేసి నిల‌బ‌డాల‌నే కోరిక‌తో చేసిన సినిమా ఇది. నిర్మాత‌లు ఎంతో స‌పోర్ట్ చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌, చేత‌న్ శీను అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved