pizza
Banthi Poola Janaki trailer launch
"బంతిపూల జానకి" ట్రైలర్ విడుదల !!
ou are at idlebrain.com > News > Functions
Follow Us

22 May 2016
Hyderabad

ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "బంతిపూల జానకి" పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవల విడుదల చేసారు. ధన్ రాజ్-దీక్షాపంత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో "కళ్యాణి-రామ్-తేజ" సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, రాకెట్ రాఘవ, చమక్ చంద్ర, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుదీర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. "హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందుతున్న మా "బంతిపూల జానకి" ట్రైలర్ కు మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో ఆడియోను విడుదల చేసి.. జూన్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటింగ్: డా. శివ వై. ప్రసాద్, కెమెరామెన్: జి.ఎల్.బాబు, పాటలు: కాసర్ల శ్యాం, సంగీతం: బోలె, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, నిర్మాతలు: కళ్యాణి-రామ్-తేజ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved