pizza
Srirastu Subhamastu theatrical trailer launch
`శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 July 2016
Hyderaba
d

అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, పరుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కత్వంలో అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గా, ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం 'శ్రీరస్తు శుభ‌మ‌స్తుస‌. ఆగ‌స్టు 5న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డైరెక్ట‌ర్ క్రిష్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

డైరెక్ట‌ర్ క్రిష్ మాట్లాడుతూ ``ప‌రుశురాం ఎప్పుడూ మంచి ఫ్యామిలీ చిత్రాల‌ను డైరెక్ట్ చేస్తుంటాడు. త‌న సినిమాల‌ను చూడ‌టానికి బాగా ఇష్ట‌ప‌డ‌తాను. ఈ క‌థ నాకు తెలుసు. మంచి ఎగ్జ‌యిటింగ్ స్టోరీ. ప‌రుశురాంలో మంచి ద‌ర్శ‌కుడే కాదు, మంచి ర‌చ‌యిత కూడా ఉన్నారు. నాకు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణితో ఒక పుష్ ఎలాగైతే వ‌చ్చిందో అలాంటి పుష్ త‌న‌కు కావాలి. శిరీష్‌, లావ‌ణ్య చ‌క్క‌గా క‌నిపిస్తున్నారు. సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ``యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్. ఇది మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న సినిమా అనో, మా అబ్బాయి న‌టించిన సినిమా అనో సినిమా బాగా వ‌చ్చింద‌ని చెప్ప‌డం లేదు. నిజంగానే సినిమా చాలా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు ప‌రుశురాం సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. ప్రేక్ష‌కులు ఏమాత్రం డిస‌ప్పాయింట్ కారు. ఈ నెల 31న ఓ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దానికి మెగాస్టార్ చిరంజీవిగారు ముఖ్య అతిథిగా హాజ‌రై శిరీష్‌ను ఆశీర్వ‌దిస్తారు`` అన్నారు.

Lavanya Tripathi Glam gallery from the event

ద‌ర్శ‌కుడు ప‌రుశురాం మాట్లాడుతూ ``ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక అబ్బాయి లావ‌ణ్య‌లాంటి గ‌ర్ల్‌ఫ్రెండ్ కావాల‌ని, ప్ర‌తి అమ్మాయి శిరీష్‌లాంటి బాయ్‌ఫ్రెండ్ కావాల‌నుకుంటారు`` అన్నారు.

లావ‌ణ్య మాట్లాడుతూ ``గీతాఆర్ట్స్ వంటి పెద్ద బ్యాన‌ర్‌లో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. శిరీష్ చాలా మంచి కోస్టార్‌. డైరెక్ట‌ర్ ప‌రుశురాంగారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. థ‌మ‌న్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ ``క‌థ‌తో పాటు ఎంట‌ర్‌టైన్మెంట్ ఉన్న సినిమా. థ‌మ‌న్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇవ్వ‌గా, మ‌ణికంఠ‌న్‌గారు మంచి సినిమాటోగ్ర‌ఫీని అందించారు. ప్ర‌తి ఒక్క‌రూ బాగా స‌పోర్ట్ చేయ‌డంతో మంచి అవుట్‌పుట్ రాబ‌ట్టుకోగ‌లిగాను. ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డుతుంది. సినిమా ఆగ‌స్టు 5న రిలీజ్ అవుతుంది`` అన్నారు.

అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్.య‌స్‌.య‌స్‌, యాక్షన్ - రామ్, లక్ష్మణ్, ఆర్ట్ – రామాంజనేయులు, డిఓపి - మని కంఠన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- నాగ‌రాజు, ఎడిటర్ - మార్తాడ్ కె.వెంకటేష్, నిర్మాత - అల్లు అరవింద్, దర్శకుడు – పరశురామ్.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved