pizza
Yuva Kalavahini - Pride Of Indian Cinema award presented to K.Viswanath
You are at idlebrain.com > News > Functions
Follow Us

05 August 2015
Hyderabad

కె . విశ్వనాధ్ కు 'ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అవార్డు

'యువకళావాహిని' ఆధ్వర్యం లో రవీంద్రభారతి లో ఆగస్ట్ 4 న జరిగిన సభలో 'కళా తపస్వి' కె . విశ్వనాధ్ కు 'ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అవార్డు ప్రదానం చేసారు . సారిపల్లికొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ - 'తెలుగు సినీ పరిశ్రమకు కె . విశ్వనాధ్ ఒక వరం' అని అన్నారు . తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ -' కె . విశ్వనాధ్ సినీ పరిశ్రమకు గర్వకారణం' అని అన్నారు . కె .వి .రమణాచారి మాట్లాడుతూ -'భారతీయ సంస్కృతికి విశ్వనాధ్ ప్రతీక' అని అన్నారు .ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ - 'విశ్వనాధ్ తెలుగు జాతి గుండెల్లో కోవెల కట్టుకున్న మహాను భావుడ'ని అన్నారు . అమెరికా లోని 'అక్కినేని ఫౌండేషన్' కార్యదర్శి ఆకునూరి శారద మాట్లాడుతూ - 'తెలుగు సినీ ప్రపంచం లో విశ్వనాధ్ ది సువర్ణ అధ్యాయం' అని అన్నారు . విశ్వనాధ్ మాట్లాడుతూ - 'సినిమాకు ఎంత సేవ చెయ్యాలో అంతా చేసాను . నా సినిమా చూస్తున్న వారంతా ఆనందం గా వుండాలన్నదే నా లక్ష్యం' అని అన్నారు.

ఈ కార్యక్రమం లో గీతాంజలి , రోజా రమణి , రంగనాద్ , 'అమెరికన్ తెలుగు అసోసియేషన్' అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి , సంగీత దర్శకుడు కె .ఎం .రాధాకృష్ణ, వాసిరాజు ప్రకాశం , వై .కె .నాగేశ్వర రావు పాల్గొన్నారు . కార్యక్రమ ప్రారంభం లో ఆకునూరి శారద , మిత్రా, వినోద్ బాబు ఆలపించిన విశ్వనాధ్ చిత్ర గీతాలు అలరించాయి .

 

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved