Allari Naresh about 12A Railway Colony
'12A రైల్వే కాలనీ' స్క్రీన్ ప్లే అదిరిపోతుంది. మైండ్ గేమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆడియన్స్ ఖచ్చితంగా థ్రిల్ అవుతారు: హీరో అల్లరి నరేష్
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నరేష్ గారు 12A రైల్వే కాలనీ కోసం ఎంత ఎక్సయిటెడ్ గా ఉన్నారు ?
-ఇది నాకు 63వ రిలీజ్. ప్రతి సినిమాకి టెన్షన్ ఉంటుంది. ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. చాలా మంచి టీం తో పనిచేశాం. టుమారో ఈజ్ మై డే అనే పాజిటివ్ ఫీలింగ్ ఉంది.
ఈ కథలో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి?
-ఒక కొత్త జానర్ చేద్దామని ఉద్దేశంతో ఉన్నాను. ఇప్పటివరకూ సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. ఇందులో పారానార్మల్ టింజ్ చాలా బాగుంటుంది. యదార్థంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. హైదరాబాదులో ఆ సంఘటన జరిగింది. దాన్ని సినిమాకు తగ్గట్టుగా చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో చేయడం జరిగింది.
అనిల్ కథ చెప్పినప్పుడు ఇంటర్వ్యూలో షాక్ అయ్యాను. సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో అనిపించింది. మహారాజా సినిమా తీసుకుంటే అందులో స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కడో మొదలైన సీన్ కి చివర్లో కనెక్షన్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఒక మూడు నాలుగు కథలు సమాంతరంగా జరుగుతుంటాయి. చాలా మైండ్ గేమ్ ఉంటుంది.
ఇలాంటి స్క్రీన్ ప్లే తో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా సక్సెస్ అయితే తప్పకుండా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా గురించి చర్చిస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత నా కెరీర్లో ఒక మంచి సినిమా అనే రెస్పాన్స్ ని ఆడియన్స్ ఇస్తారనే నమ్మకం ఉంది.
ఈ సినిమాకి ఇదే టైటిల్ అనుకున్నారా?
ఇది 12A అనే ఇంట్లో జరిగే కథ. 12A అనేది ముందే ఫిక్స్ అయ్యాం. తర్వాత ఏ కాలనీ పెట్టాలి అనుకున్నప్పుడు అనిల్ గారు రైల్వే కాలనీ పెడితే అందరికీ కనెక్టింగ్ గా ఉంటుంది అని చెప్పారు. ఇది ఒక రైల్వే కాలనీ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది. ఈ కథకి టైటిల్ పర్ఫెక్ట్.
హీరోయిన్ కామాక్షి గురించి?
కామాక్షి గారి నాన్నగారు మా నాన్నగారి దగ్గర వర్క్ చేశారు. తను ఇంటర్ చదువుతున్న ఇంటర్ చదివేటప్పుడు నా సినిమాల షూటింగ్ కి వచ్చి వారు. ఇంతకుముందు నా మారేడుమిల్లి సినిమాలో చేసింది. ఈ సినిమాకి ఒక మిడిల్ క్లాస్, పక్కింటి అమ్మాయిలా కనిపించే హీరోయిన్ కావాలి. అనిల్ గారితో కామాక్షి పొలిమేర సినిమా చేసినప్పటికీ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్ చేశాము. ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత తీసుకోవడం జరిగింది.
తను తెలుగమ్మాయి.భాష పరంగా ఎలాంటి అడ్డంకి ఉండదు. చాలా మంచి ఆర్టిస్టు. తను యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేసింది అనిల్ గారు కామాక్షి నాని వీళ్లంతా మంచి ఫ్రెండ్స్. తను రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటుంది. మల్టీ టాలెంటెడ్.
అనిల్ గారు చాలా ఫాస్ట్ రైటర్ ఏ మార్పులు చెప్పినా చాలా తొందరగా చేస్తారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ కూడా చేశాం.
నరేష్ గారు మీరు డైరెక్షన్ చేస్తారని మేము ఎప్పటినుంచో వింటున్నాం?
-నాకు డైరెక్షన్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. కానీ దానికి చాలా సమయం కావాలి. ఒక సినిమా డైరెక్షన్ చేస్తాను. అది డిడిఎల్జి లాగా గుర్తుండిపోయే సినిమా కావాలనేది నా కోరిక.
నరేష్ గారు సీరియస్ క్యారెక్టర్స్ చేయడం చాలెంజింగ్ గా కామెడీ చేయడం కష్టమా?
-నా వరకు కామెడీ చేయడమే కష్టం. కామెడీ కి చాలా టైమింగ్ కావాలి. అలాగే సీన్ చేస్తున్నప్పుడు కూడా మనం సీరియస్ గా ఉండాలి. చూస్తున్న ఆడియన్స్ కి నవ్వు రావాలి. ఆ టైమింగ్ బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్.
నాన్నగారు ఎక్కువగా కామెడీ సినిమాలు చేయడంతో నాకు చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. అలాగే మన ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. వాళ్ళ అందరితో ట్రావెల్ చేయడం నాకు చాలా హెల్ప్ అయింది.
మీరు ఈ సినిమాలో తెలంగాణ యాస మాట్లాడడం ఎలా అనిపించింది?
-ఇది వరంగల్లో జరిగే కథ. తెలంగాణ యాస కోసం అజయ్ అనే ఒక వ్యక్తి వచ్చారు. తనతో వర్క్స్ షాప్ చేశాను. ఫస్ట్ టైం తెలంగాణ యాస మాట్లాడుతున్నాను. దానిపై చాలా శ్రద్ధ తీసుకున్నాను. నేను ప్రతి సినిమాకి దాదాపు ఒక రోజులో డబ్బింగ్ చెప్పేస్తాను. కానీ ఈ సినిమాకి నాలుగు రోజులు పట్టింది. ప్రతి డైలాగ్ చెక్ చేసుకుంటూ యాస సరిగ్గా పలికేలా కేర్ తీసుకున్నాను.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
-ఈ సినిమాలో కార్తీక్ అనే క్యారెక్టర్ లో కనిపిస్తాను. అక్కడ ఒక లోకల్ ఎమెల్యే దగ్గర పని చేస్తుంటాను. తన తలలో నాలుగు లాంటివాడు కార్తీక్. అక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది. సరదాగా జరిగిపోతున్నప్పుడు ఒక సంఘటన ఎదురవుతుంది. ఆ సంఘటన తన జీవితంలో ఎలాంటి మలుపు తీసుకుంది అనేది మిగతా కథ.
బీమ్స్ గారు మీది సూపర్ హిట్ కాంబినేషన్ కదా.. ఆయన ఈ సినిమాకి వర్క్ చేయడం ఎలా అనిపించింది?
భీమ్స్ చాలా ట్యాలెంటెడ్. ఐతే చాలా రోజులు తర్వాత తనకి మంచి బ్రేక్ వచ్చింది. మా ఇద్దరి కి థ్రిల్లర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు. చాలా ప్యాషన్ తో చేశాడు.
మీరు ఫ్యూచర్లో ఇంకెలాంటి జోన్స్ చేయాలనుకుంటున్నారు?
నాకు ఒక హారర్ సినిమా చేయాలనుంది. అలాగే ఒక మూకీ సినిమా చేయాలనుంది. డైలాగ్ లేకుండా నవ్వించాలి అలాంటి స్టోరీ ఎప్పటికైనా ఒకటి చేయాలని ఉంది.
బచ్చలమల్లి ఫలితం మీకు నిరాశపరిచిందా?
-లేదండి. చాలా మంచి సినిమా. ఆ క్యారెక్టర్ అటువంటిది. తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా మారని క్యారెక్టర్ అది. ఆ సినిమాకి నాకు చాలా మంచి అప్లాజ్ వచ్చింది. నేను గర్వపడే సినిమా అది.
వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఉందా?
-నా దగ్గరికి రెండు మూడు కథలు వచ్చాయి కానీ నచ్చలేదు. ఒక కామెడీ వెబ్ సిరీస్ ఏదైనా వస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. అలాంటిది వస్తే ఖచ్చితంగా చేస్తాను.
నాన్నగారి తర్వాత అలా మంచి కామెడీ సినిమాలు రాసే రచయితలు దర్శకులు తగ్గిపోయారని భావిస్తున్నారా?
కామెడీ రాయడం తీయడం రెండు కష్టం. కామెడీ చేయడం కూడా కష్టమే. నవ్వించడం చాలా కష్టమైన ఆర్ట్. అప్పటికి ఇప్పటికీ జనాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అన్ని కూడా సెన్సిటివ్ అయిపోయింది. ఈరోజుల్లో సీమశాస్త్రి తీస్తే అది రిలీజ్ అవ్వదు. (నవ్వుతూ) ఇప్పుడంతా ఆర్గానిక్ కామెడీ. ప్రత్యేకంగా జోకులంటూ వర్కౌట్ అవ్వవు. విన్న జోక్ చెప్పకూడదు. ఏదో కొత్త జోక్ చెప్పాలి.
నేను వరుసగా సీరియస్ సినిమాలు చేశాను. కానీ నేను నెక్స్ట్ చేయబోతున్న రెండు సినిమాలు కూడా కామెడీ సినిమాలు.
నిర్మాతల గురించి?
శ్రీనివాస చిట్టూరి గారితో నా సామిరంగా సినిమా చేశాను. చాలా మంచి ప్రొడ్యూసర్స్. చాలా తక్కువ మాట్లాడుతారు. కానీ ముక్కు సూటిగా మాట్లాడుతారు. ఏదైనా సరే మొహం మీద చెప్తారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. నా సామి రంగా రిలీజ్ అయిన రోజునే మనం సినిమా చేద్దామని చెప్పారు. తర్వాత మేము కథలు విన్నాము. ఒకరోజు అనిల్ గారు ఈ కథ చెప్పారు. నచ్చి మొదలుపెట్టాం. ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఆయన మరో సినిమా చేస్తాం అని చెప్పారు.
కొత్తగా రాబోతున్న సినిమాలు గురించి?
-ఆల్కహాల్ జనవరిలో రిలీజ్ ఉంటుంది. హాస్య, అన్నపూర్ణ బ్యానర్లో ఒక సినిమా ఈ నెల ప్రారంభం కాబోతోంది. జనవరి నుంచి మరో కొత్త సినిమా స్టార్ట్ కాబోతుంది. ఈ రెండు కూడా మంచి కామెడీ సినిమాలు.