pizza

A New Cinematic World Begins: AA22 x A6 Unveils Its First Cryptic Visual
AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.. అంచనాలు రెట్టింపు చేసిన టీం

You are at idlebrain.com > news today >

07 April 2026
Hyderabad

In a move that has instantly set the internet buzzing, the makers of the much-anticipated film AA22 x A6 unveiled a striking teaser poster today at 11 AM — offering audiences their very first glimpse into this ambitious cinematic universe.

Backed by Sun Pictures and mounted on a massive scale, AA22 x A6 is being positioned as a genre-defining spectacle, blending scale, storytelling, and cinematic innovation.

The poster features an enigmatic visual — a creature’s hand caught mid-gesture, rugged, powerful, and otherworldly. With no context or explanation, the image has sparked widespread speculation:
What is this gesture? Who does this hand belong to? And what world does it come from?

The makers have deliberately chosen to reveal nothing further — letting intrigue and imagination take center stage.

The film marks a landmark collaboration between Sun Pictures, Icon Star Allu Arjun and blockbuster filmmaker Atlee, bringing together three of Indian cinema’s most influential creative forces for a project envisioned for a global stage.

With anticipation building, the makers are set to unveil more tomorrow, coinciding with Allu Arjun’s birthday — including the film’s title and the first look of his character.

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.. అంచనాలు రెట్టింపు చేసిన టీం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో సన్ పిక్చర్స్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ AA22 x A6 అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా అందరినీ ఆశ్చర్యపర్చబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా AA22 x A6 ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ఒక్క పోస్టర్‌తోనే మేకర్స్ ప్రేక్షకులు, సినీ లవర్స్‌లో ఎన్నో అనుమానాల్ని, ఉత్సుకతను రేకెత్తించారు. ఆ హ్యాండ్ ఎవరిది? ఆ ఆకారం ఏంటి? అది ఎందుకు అలా మారింది? కథ ఎలా ఉండబోతోంది? అని ఇలా అందరిలో రకరకాల ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ ఒక్క ప్రీ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు అసలు సిసలు అప్డేట్ రాబోతోందని మేకర్లు ప్రకటించారు. టైటిల్‌తో పాటుగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా రేపు రివీల్ చేయబోతోన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్, పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అభిమానుల్ని అలరించనున్నారు. సరికొత్త సినిమాటిక్ వరల్డ్‌లోకి తీసుకు వెళ్లేలా ఈ చిత్రం ఉండబోతోందని టీం చెబుతోంది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved