pizza

Trivikram Srinivas Expresses Gratitude for the Love and Appreciation Showered on ‘Aadarsha Kutumbam’
‘ఆదర్శ కుటుంబం’ చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందనకు, ప్రేమకు ధన్యవాదాలు : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

You are at idlebrain.com > news today >

30 October 2026
Hyderabad

The prestigious film ‘Aadarsha Kutumbam – House No. 47’, starring Victory Venkatesh and directed by the acclaimed filmmaker Trivikram Srinivas, has opened to an encouraging response from audiences. Produced by S. Radha Krishna (Chinababu) under the banner of Haarika & Hassine Creations, the film features Srinidhi Shetty as the female lead. Thaman S has composed the music, while Nara Rohith and Nivetha Pethuraj play pivotal roles.

Marking the reunion of Venkatesh and Trivikram after two decades, the film generated tremendous anticipation among Telugu movie lovers across the globe. Released on Friday, October 30, amid huge expectations, the film received a positive response from audiences across all sections right from its first show. With collections reportedly witnessing an upward trend with every show, the film is heading towards a successful theatrical run.

Following the encouraging response, the team of ‘Aadarsha Kutumbam – House No. 47’ organised a press meet to express their happiness and extend heartfelt gratitude to audiences for the love and appreciation showered on the film.

Victory Venkatesh said, “My heartfelt thanks to all the audiences. We sincerely attempted a film in a new genre, with the intention of giving viewers a wonderful cinematic experience. I am extremely happy that our effort, with Trivikram garu and Chinababu garu, has received such an overwhelming response. My thanks to everyone who was part of this film. Since morning, several people have been calling me and appreciating the film. I am also grateful to our media friends for supporting good cinema. I have always believed in giving quality films to family audiences, and I am delighted that they are enjoying this film.”

Trivikram Srinivas said, “My sincere thanks to audiences who have embraced our film right from the first show. On occasions like this, the less we speak, the better, because this is the time for audiences to speak and for us to listen. Thank you for your wonderful response and love. You have given us immense happiness, and I sincerely hope this joy continues. What more can I say other than thank you? My special thanks to our media friends as well. Many people called me this morning to congratulate us. I was particularly happy to hear so many people discussing the interval block. My heartfelt thanks to everyone who has been part of this film.”

Srinidhi Shetty, the female lead, said, “I am extremely happy today. I watched the film in Hyderabad along with the team, and the audience response made me very happy. I sincerely thank Trivikram garu for giving me such a wonderful role. Matching Venkatesh garu’s comic timing is no easy task. It was a great pleasure working alongside him. Trivikram garu’s dialogues and Thaman’s music are receiving a fantastic response in theatres. I hope I get more opportunities to work with Haarika & Hassine Creations.”

Music director Thaman S said, “Trivikram garu, Chinababu garu and Naga Vamsi garu are like family to me. I always wish them continued success. I realised the greatness of this film while working on the background score itself. Some films derive their strength from songs, while others derive it from their dialogues. This is a background score that gives prominence to the power of words. Trivikram garu has written a brilliant script. Every release of a Trivikram film feels like the launch of a new book. Audiences who came to theatres to experience his dialogues are now also discussing his screenplay. That makes me very happy. My journey with Venkatesh garu on this film is unforgettable. Chinababu garu has always been extremely supportive. I hope Trivikram garu continues to write many more wonderful scripts like this.”

Veteran actor Rao Ramesh said, “I have been associated with Trivikram garu’s films since ‘Khaleja’, but this film is particularly special. I am delighted to be part of a film featuring the combination of Venkatesh garu and Trivikram garu. My character is receiving a good response. Trivikram garu has penned several wonderful dialogues in this film. In particular, the line, ‘I am a great book that has never been printed’, connects deeply with everyone’s life. I thank Trivikram garu, Chinababu garu and Naga Vamsi garu for giving me this opportunity.”

Actor Satya said, “I am delighted to have got the opportunity to play such a good role in a Trivikram garu film. As we had expected, the film is receiving a fantastic response. Since morning, I have been receiving calls and messages from people congratulating us.”

Actress Nivetha Pethuraj said, “I watched the film sitting among the audience in a theatre, and it was a wonderful experience. I particularly loved the interval block. I wish Venkatesh garu does many more films like this. The response has been fantastic right from the first show, and I strongly believe that the film will emerge as a super-duper blockbuster. My sincere thanks to Trivikram garu and producer Chinababu garu for giving me this opportunity. Congratulations to everyone who was part of this film.”

Telugu film journalists who attended the event also appreciated ‘Aadarsha Kutumbam – House No. 47’, praising the film and expressing their admiration for the team’s efforts.

Cast : Venkatesh, Srinidhi Shetty, Nara Rohith, Nivetha Pethuraj, Yuvina, Raj Prajwal, Rao Ramesh, Satya, Brahmaji, Udaybeer Sandhu, Vennela Kishore, Raghu Babu and others.

Technical Crew
Writer & Director: Trivikram Srinivas
Music: Thaman S
Cinematography: Ravi K. Chandran
Editing: Naveen Nooli
Art Direction: A.S. Prakash
Fights: Kevin Kumar
Producer: S. Radha Krishna (Chinababu)
Presenter: Mrs. Mamatha
Banner: Haarika & Hassine Creations

‘ఆదర్శ కుటుంబం’ చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందనకు, ప్రేమకు ధన్యవాదాలు : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు.

రెండు దశాబ్దాల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులంతా ‘ఆదర్శ కుటుంబం’ కోసం ఎంతగానో ఎదురుచూశారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం(అక్టోబర్‌ 30) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని.. షో షోకి వసూళ్ళను పెంచుకుంటూ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. ‘ఆదర్శ కుటుంబం’కి వస్తున్న అద్భుతమైన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేయడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది.

ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. "ప్రేక్షకులందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ప్రేక్షకులను గొప్ప అనుభూతిని అందించాలని నిజాయితీతో కొత్త జానర్ లో సినిమా చేశాము. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి ఇంతటి స్పందన రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఉదయం నుంచి చాలా మంది ఫోన్ చేసి సినిమా బాగుందని ప్రశంసించారు. మంచి సినిమాకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. కుటుంబ ప్రేక్షకులకు ఎప్పుడూ మంచి సినిమా ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాను. వారికి సినిమా నచ్చడం చాలా సంతోషంగా ఉంది." అన్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "మొదటి షో నుంచే మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి సందర్భాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఇది ప్రేక్షకులు మాట్లాడాల్సిన సమయం. ప్రేక్షకులు మాట్లాడాలి.. మేం వినాలి. మీ స్పందనకు, మీ ప్రేమకు ధన్యవాదాలు. మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఈ ఆనందం మరింత కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ తప్ప ఏం చెప్పగలను మీ అందరికీ. ముఖ్యంగా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఉదయం చాలా మంది ఫోన్లు చేసి అభినందించారు. ప్రత్యేకంగా ఇంటర్వెల్ గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుతుంటే చాలా ఆనందమేసింది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా నా కృతఙ్ఞతలు." అన్నారు.

కథానాయిక శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. "నేను ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు టీంతో కలిసి హైదరాబాద్ లో సినిమా చూశాను. ప్రేక్షకుల స్పందన చూసి ఎంతో ఆనందించాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు. వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ ను మ్యాచ్ చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కి, తమన్ సంగీతానికి థియేటర్లలో అద్భుతమైన స్పందన వస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను." అన్నారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. "త్రివిక్రమ్ గారు, చినబాబు గారు, నాగవంశీ గారు నాకు కుటుంబ సభ్యులు లాంటివారు. వారెప్పుడూ సక్సెస్ లో ఉండాలని కోరుకుంటాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్న సమయంలోనే ఈ సినిమా గొప్పతనం అర్థమైంది. కొన్ని సినిమాలకు పాటలు విలువ, కొన్ని సినిమాలకు మాటలు విలువ. ఇది మాటలకు విలువ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్. త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ అద్భుతంగా రాశారు. త్రివిక్రమ్ గారి ప్రతి సినిమా రిలీజ్ అనేది ఒక బుక్ రిలీజ్ లాంటిదే. ఆయన మాటలు వినాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు, ఆయన స్క్రీన్ ప్లే గురించి కూడా మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్ గారితో ఈ జర్నీ మరిచిపోలేను. చినబాబు గారు మాకెంతో మద్దతుగా నిలిచారు. త్రివిక్రమ్ గారు ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ లు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను." అన్నారు.

ప్రముఖ నటుడు రావు రమేష్ మాట్లాడుతూ.. "ఖలేజా నుంచి త్రివిక్రమ్ గారి సినిమాల్లో నటిస్తున్నాను. ఈ సినిమా మరింత ప్రత్యేకం. వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. నా పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. త్రివిక్రమ్ గారు ఎన్నో అద్భుతమైన డైలాగ్ లు రాశాను. ముఖ్యంగా 'నేను ప్రింట్ అవ్వని ఒక గొప్ప పుస్తకం' అనే డైలాగ్ ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ గారికి, చినబాబు గారికి, నాగవంశీ గారికి ధన్యవాదాలు." అన్నారు.

నటుడు సత్య మాట్లాడుతూ.. "త్రివిక్రమ్ గారి సినిమాలో ఇంత మంచి పాత్ర చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మేము ఊహించినట్టుగానే సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఉదయం నుంచి అభినందనలు తెలుపుతూ ఫోన్లు, మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి." అన్నారు.

నటి నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. "ప్రేక్షకుల మధ్యలో కూర్చొని థియేటర్లో సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నాకు ఇంటర్వెల్ బ్లాక్ చాలా నచ్చింది. వెంకటేష్ గారు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. మొదటి షో నుంచే అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశమిచ్చిన త్రివిక్రమ్ గారికి, నిర్మాత చినబాబు గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు." అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు సినీ పాత్రికేయులు ఆదర్శ కుటుంబం చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపించారు.

నటీనటులు: వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు.

సాంకేతిక బృందం:
రచన – దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె. చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలి
కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాశ్
ఫైట్స్: కెవిన్ కుమార్
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ (చినబాబు)
సమర్పణ: శ్రీమతి మమత
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved