pizza

‘AADARSHA KUTUMBAM - AK47’ will now release on OCTOBER 9TH Venkatesh & Trivikram Srinivas’ Entertainer To Arrive A Week Later
‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ వాయిదా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

You are at idlebrain.com > news today >

22 September 2026
Hyderabad

Victory Venkatesh and Trivikram Srinivas’ much-awaited entertainer ‘Aadarsha Kutumbam - AK47’ will now release worldwide on October 9, 2026.

The makers have decided to postpone the release by a week to bring the film to audiences with the complete entertainment experience it deserves.

The recently released teaser, which offers a glimpse into Venkatesh’s middle-class family world filled with fun, emotions and action, has received a strong response from audiences.

Written and directed by Trivikram Srinivas, the film stars Venkatesh, Srinidhi Shetty, Nara Rohith, Nivetha Pethuraj, Rao Ramesh, Satya, Brahmaji, Vennela Kishore and others.

Produced by S. Radha Krishna under Haarika & Hassine Creations, with Music by Thaman S, ‘Aadarsha Kutumbam - AK47’ is now set to arrive in theatres worldwide on October 9, 2026.

‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ వాయిదా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ఎంటర్‌టైనర్ మరో వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న భారీ వినోదాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ మారింది. తొలుత ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ప్రేక్షకులకు సంపూర్ణ వినోదానుభూతిని అందించాలనే ఉద్దేశంతో చిత్ర విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

వినోదం, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved