pizza

‘NARAYANAMMA’ SETS THE VIBE FOR ‘AADARSHA KUTUMBAM - AK47’
‘ఆదర్శ కుటుంబం - AK47’కు జోష్ తీసుకొచ్చిన ‘నారాయణమ్మ’

You are at idlebrain.com > news today >

27 September 2026
Hyderabad

The much-awaited first single, ‘Narayanamma’, from Victory Venkatesh and Trivikram Srinivas’ upcoming entertainer ‘Aadarsha Kutumbam - AK47’, is out now. Composed by Thaman S, the peppy and infectious track is sung by Prabha and Ram Miriyala, with lyrics penned by Saraswati Putra Ramajogayya Sastry.

Dimple Hayati takes centre stage in ‘Narayanamma’, bringing her vibrant screen presence and energetic performance to the lively number. Alongside her, Victory Venkatesh, Srinidhi Shetty and Nivetha Pethuraj add to the song’s fun-filled visual appeal. Together, the song captures the celebratory spirit of ‘Aadarsha Kutumbam - AK47’ and offers a taste of the full-on family entertainment in store.

The recently released teaser of the film, which introduced audiences to Venkatesh’s middle-class family world filled with fun, emotions and action, received a strong response and has crossed 20 million+ digital views, while continuing to trend on YouTube.

Written and directed by Trivikram Srinivas, ‘Aadarsha Kutumbam - AK47’ stars Venkatesh, Srinidhi Shetty, Nara Rohith, Nivetha Pethuraj, Rao Ramesh, Satya, Brahmaji, Vennela Kishore and others.

Produced by S. Radha Krishna under Haarika & Hassine Creations, the film is set to release in theatres worldwide on October 9, 2026.

With ‘Narayanamma’ now out, the musical journey of ‘Aadarsha Kutumbam - AK47’ has begun, adding to the excitement around this much-awaited family entertainer.

‘ఆదర్శ కుటుంబం - AK47’కు జోష్ తీసుకొచ్చిన ‘నారాయణమ్మ’

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం - AK47’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ విడుదల

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం - AK47’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి పాట ‘నారాయణమ్మ’ విడుదలైంది. ఈ పాటకు థమన్ ఎస్ సంగీతం అందించగా, ప్రభ, రామ్ మిరియాల తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో అలరించారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

‘నారాయణమ్మ’ పాటలో డింపుల్ హయాతి తన వైబ్రెంట్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమెతో పాటు విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ తదితరులు పాటలోని సందడి, ఉత్సాహాన్ని మరింత పెంచారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా రూపొందిన ఈ పాట ‘ఆదర్శ కుటుంబం - AK47’లో ప్రేక్షకులను అలరించనున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మంచి టేస్ట్‌ను అందిస్తోంది.

ఇటీవల విడుదలైన ‘ఆదర్శ కుటుంబం - AK47’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వెంకటేష్ పోషించిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి జీవితంలో చోటుచేసుకునే వినోదం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. విడుదలైనప్పటి నుంచి టీజర్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడంతో పాటు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు నటిస్తున్నారు.

హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘ఆదర్శ కుటుంబం - AK47’ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

‘నారాయణమ్మ’ పాట విడుదలతో ‘ఆదర్శ కుటుంబం - AK47’ మ్యూజికల్ జర్నీ ప్రారంభమైంది. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం, తాజా సాంగ్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved