21 August 2024
Hyderabad
The film AAY presented by renowned producer Allu Aravind, is produced by Bunny Vas and Vidya Koppineedi and is set against the backdrop of the Godavari region. Anji K. Maniputhra made his directorial debut with this film, which was released on August 15th.
From the first screening, AAY has been generating positive buzz in theaters. The movie has received praise from audiences, critics, and film celebrities alike. Recently Man of Masses NTR and Thandel team congratulated the team.
Icon Star Allu Arjun recently met with the AAY team to celebrate the film's success. Hero Narne Nithiin, producers Bunny Vas and Vidya Koppineedi, director Anji K. Maniputhra, heroine Nayan Sarika, Ankith Koyya, Rajkumar Kasireddy, and others were personally met with Pushpa actor.
The film’s shows and screens are increasing consecutively due to strong word-of-mouth. Audiences are leaving theaters feeling satisfied with the film. The film unit is pleased with the support and positive response, and movie collections are rising daily.
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ను అభినందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆగస్ట్ 15న రిలీజైంది. తొలి ఆట నుంచే ఈ ఫన్ ఎంటర్ టైనర్ ‘ఆయ్’ ప్రేక్షకాదరణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్స్‌లో సందడి చేస్తోంది. సినీ ప్రేక్షులు, విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ‘ఆయ్’ సినిమాను చూసి అద్భుతమంటూ చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. ఇప్పటికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నాగ చైతన్య, సాయిపల్లవి చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా కలిసి విషెష్ అందించారు.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఆయ్’ చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా కలుసుకుని, సినిమా సాధించిన సక్సెస్‌పై ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హీరో నార్నే నితిన్, నిర్మాతలు బన్నీవాస్, విద్యా కొప్పినీడి, దర్శకుడు అంజి కె మణిపుత్ర, హీరోయిన్ నయన్ సారిక, అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తొలి ఆట నుంచి మంచి మౌత్ టాక్ తో వరుసగా షోలు, స్క్రీన్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా చూసి ఓ చక్కని సినిమాను చూశామనే ఫీలింగ్‌తో జనాలు బయటకు వస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ ఆధారణపై చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే రోజు రోజుకి సినిమా కలెక్షన్స్ పెరుగుతుంది.
|