pizza

“Akhanda 2” Will Be a Spectacular Experience in 3D. From kids to parents - everyone will enjoy it in theatres: Blockbuster Director Boyapati Srinu at the Press Meet
'అఖండ 2' 3Dలో అద్భుతమైన అనుభూతి ఇస్తుంది. చిన్నపిల్లల నుంచి అమ్మానాన్నల వరకు థియేటర్స్ లో గొప్పగా ఎంజాయ్ చేస్తారు: ప్రెస్ మీట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను

You are at idlebrain.com > news today >

16 November 2025
Hyderabad

The highly anticipated divine action extravaganza “Akhanda 2: Thandavam”, starring God of the Masses Nandamuri Balakrishna and directed by Blockbuster filmmaker Boyapati Srinu, is currently one of the most awaited films. Produced prestigiously by Ram Achanta and Gopichand Achanta, the film is presented by M. Tejaswini Nandamuri. With the teaser and the first single “Thandavam” receiving an overwhelming response, expectations have skyrocketed. The film is set for a worldwide release on December 5, 2025.

Today, the makers gave a major update, officially announcing that Akhanda 2 will also release in 3D. A special press meet was held for this purpose.

Director Boyapati Srinu at the Press Meet: “Thank you to the media friends, Nandamuri fans, and the audience who came to experience the 3D trailer. We are bringing this film in 3D format to give Balakrishna garu’s fans and all viewers a truly grand experience. You will feel something extraordinary after watching this film in 3D.

This film represents the soul and divinity of India. Across the world, people follow different religions, but only our country follows Sanatana Dharma. This film is based on that philosophy. From the youngest child in your home to your parents—everyone will enjoy watching it in theatres. That is my responsibility, and my promise to you.

We want the entire nation to watch this film, which is why we started promotions from Mumbai itself.
The Bhagavad Gita, Ramayana, and Mahabharata are the soul of India—and the same soul is present in Akhanda 2. That’s why I said this film represents the soul and supreme spirit of our nation.”

Producer Gopi Achanta: “For this story, scale, and locations, we felt 3D would elevate the experience. We also had the time to execute it perfectly. The 3D output is extraordinary—you will experience stunning visuals. This is our promise.”

Racha Ravi: “After watching the film, audiences will walk out shouting: Jai Balayya! Har Har Mahadev! Jai Boyapati! This movie will be remembered for a lifetime.”

DOP Santosh: “This is an amazing film. Working with Balakrishna garu and Boyapati garu has been a wonderful experience.”

Race 3D Raju: “Thanks to director Boyapati Srinu, the producers, and our hero Balakrishna garu for this opportunity. Akhanda 2 in 3D will be historic. It will feature world-class visual effects.”

Editor Tammiraju: “Akhanda 2 will have ten times the energy of the first film. You will enjoy it thoroughly—now with the added boost of a new 3D experience.”

'అఖండ 2' 3Dలో అద్భుతమైన అనుభూతి ఇస్తుంది. చిన్నపిల్లల నుంచి అమ్మానాన్నల వరకు థియేటర్స్ లో గొప్పగా ఎంజాయ్ చేస్తారు: ప్రెస్ మీట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ అంచనాలు సృష్టించాయి. ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 3డీలోనూ రిలీజ్‌ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా బిగ్ రివిల్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన మీడియా మిత్రులకు, నందమూరి అభిమానులకు, త్రీడీ ఎక్స్పీరియన్స్ ని అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులకి, అందరికీ ధన్యవాదాలు. బాలకృష్ణ గారి అభిమానులు, ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సినిమాని 3డీ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నాం. త్రీడీలో ఈ సినిమా చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. ఈ చిత్రం.. భారతదేశ ఆత్మ, పరమాత్మ. ఈ సినిమా మన దేశ ధర్మం, ధైర్యం. ప్రపంచ దేశాల్లో మతం కనిపిస్తుంది. కానీ, మన దేశంలో మాత్రమే సనాతన ధర్మం కనిపిస్తుంది. దాని ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లల నుంచి అమ్మానాన్నల వరకు థియేటర్స్ లో అద్భుతంగా చూస్తారు. అది నా బాధ్యత. నేను మీకు ఇస్తున్న హామీ. ఈ సినిమాని దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ప్రచారాన్ని ముంబయి నుంచి ప్రారంభించాం. భగవద్గీత, రామాయణం, భారతం. ఇవి మన దేశం ఆత్మ. ఈ మూడిటికి ఉన్న ఆత్మే అఖండ2. అందుకే ఈ సినిమా ఈ దేశ ఆత్మ పరమాత్మ అని చెప్పాను.

నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ కథ, కాన్వాస్, లొకేషన్ కి త్రీడీలో చేస్తే బాగుంటుందని అనుకున్నాం. అలాగే మాకు సమయం కూడా దొరికింది. 3D ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. విజువల్ గా మీకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది మా ప్రామిస్.

రచ్చ రవి మాట్లాడుతూ... సినిమా చూసిన తర్వాత జై బాలయ్య.. హర హర మహాదేవ.. జై బోయపాటి అంటూ ఆడియన్స్ సినిమా థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. ఈ సినిమా మన అందరికీ బ్రతికినంత కాలం గుర్తుంటుంది.

డిఓపి సంతోష్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఇది అద్భుతమైన సినిమా. బాలకృష్ణ గారితో బోయపాటి గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.

రేస్ త్రీడీ రాజు మాట్లాడుతూ.. మా డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి నిర్మాతలకు మా హీరో బాలకృష్ణ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అఖండ2 త్రీడీలో హిస్టారికల్ గా ఉండబోతుంది. వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందరికి థాంక్యు

ఎడిటర్ తమ్మి రాజు మాట్లాడుతూ.. అఖండ 2 అఖండ కన్నా పదింతలు ఎనర్జీతో ఉంటుంది. మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ 3d లో కూడా చూడబోతున్నారు.

‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
DOP: C రాంప్రసాద్, సంతోష్ D Detakae
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved