pizza

Andhra King Taluka', Starring Ram Pothineni, Upendra, Bhagyashri Borse, Produced By Mythri Movie Makers, Arriving A Day Early, On November 27
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, మైత్రి మూవీ మేకర్స్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఒక రోజు ముందుగానే నవంబర్ 27న రిలీజ్

You are at idlebrain.com > news today >

16 November 2025
Hyderabad

The much-anticipated film Andhra King Taluka, starring Ram Pothineni and produced by Mythri Movie Makers, will now release worldwide on November 27, a day earlier than the originally scheduled November 28.

Billed as a biopic centered on a fan's story, the project has generated significant buzz since its announcement. Mythri Movie Makers, known for blockbusters such as Pushpa and RRR, is positioning the film as a unique cinematic experience that allows audiences to see aspects of themselves reflected on screen.

The soundtrack, composed by Vivek-Mervin, has gained strong traction on music charts. Songs highlight Ram Pothineni's writing, vocals, and dance performances, with his on-screen chemistry with debutante Bhagyashri Borse receiving positive early feedback.

The decision to advance the release by one day responds to growing audience demand and heightened anticipation.

Written and directed by Mahesh Babu P, the film introduces a concept described as unprecedented in Indian cinema. Actor Upendra plays a key supporting role.

The trailer is set to launch on November 18 in Kurnool, with organizers planning a large-scale public event—the first of its kind in Telugu film industry history.

Veteran actors Rao Ramesh, Murali Sharma, Satya, Rahul Ramakrishna, and VTV Ganesh feature in supporting roles.

Cinematography is handled by Siddhartha Nuni, with additional work by George C Williams. National Award-winning editor Sreekar Prasad has edited the film.

Cast: Ram Pothineni, Upendra, Bhagyashri Borse, Rao Ramesh, Murali Sharma, Satya, Rahul Ramakrishna, VTV Ganesh, and others.

Crew Details:
Story, Screenplay, Direction: Mahesh Babu P
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar
Presenters: Gulshan Kumar, Bhushan Kumar, T-Series Films
Banner: Mythri Movie Makers
Co-Producer: Shiv Chanana
President (T-Series): Neeraj Kalyan
CEO: Cherry
Music: Vivek & Mervin
DOP: Siddhartha Nuni
Additional DOP: George C Williams
Editor: Sreekar Prasad
Production Designer: Avinash Kolla
Executive Producer: Hari Tummala
Costume Designers: Deepali Noor, Ashwin Mawle
Art Director: Amalapuram Srinu
Fight Master: Pruthvi
Co-Director: Chukka Vijay Kumar
VFX Supervisor: Satish Krishna Yalamarthi, Raghav Tammareddy
Post Production and Visual:* Boppana Satyanarayana (Satya)
Controller: K. Umashankar Raju
Publicity Designer: Anil and Bhanu
DI: Annapurna Studios
Audio: T-Series Music

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, మైత్రి మూవీ మేకర్స్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఒక రోజు ముందుగానే నవంబర్ 27న రిలీజ్

రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు. నవంబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం, నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

ఫ్యాన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన బయోపిక్‌గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ నుంచే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ‘పుష్ప’, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన మైత్రీ మూవీ మేకర్స్, ఈ సినిమాను ప్రేక్షకుల జీవితాలను ప్రతిబింబించే యూనిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా అందించబోతున్నారు.

వివేక్–మెర్విన్ స్వరపరిచిన సౌండ్‌ట్రాక్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాంగ్స్ కోసం తొలిసారిగా రామ్ పోతినేని రైటింగ్‌, వోకల్స్‌ ఇవ్వడం అందరినీ అలరించింది. రామ్, భాగ్య శ్రీ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రేక్షకుల డిమాండ్, అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో విడుదలను ఒక రోజు ముందుకు జరపాలనే నిర్ణయం జరిగింది.

మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే కొత్త కాన్సెప్ట్‌తో వస్తోంది. ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.

ట్రైలర్‌ను నవంబర్ 18న కర్నూలులో భారీ పబ్లిక్ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ ఇదే తొలిసారిగా జరగనుంది.

రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమాటోగ్రఫీని సిద్ధార్థ నుని నిర్వహించగా, ఎడిషనల్ వర్క్ జార్జ్ సి విలియమ్స్ చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్.

తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్

సిబ్బంది:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, T-సిరీస్ ఫిల్మ్స్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సహ నిర్మాత: శివ చనన
ప్రెసిడెంట్ (టి-సిరీస్): నీరజ్ కళ్యాణ్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ & మెర్విన్
DOP: సిద్ధార్థ నుని
ఎడిషనల్ DOP: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
కాస్ట్యూమ్ డిజైనర్లు: దీపాలి నూర్, అశ్విన్ మావ్లే
ఆర్ట్ డైరెక్టర్: అమలాపురం శ్రీను
ఫైట్ మాస్టర్: పృథ్వీ
కో-డైరెక్టర్: చుక్కా విజయ్ కుమార్
VFX సూపర్‌వైజర్: సతీష్ కృష్ణ యలమర్తి, రాఘవ్ తమ్మారెడ్డి
పోస్ట్ ప్రొడక్షన్ అండ్ విజువల్: బొప్పన సత్యనారాయణ (సత్య)
కంట్రోలర్: కె. ఉమాశంకర్ రాజు
పబ్లిసిటీ డిజైనర్: అనిల్, భాను
DI: అన్నపూర్ణ స్టూడియోస్
ఆడియో: T-సిరీస్ మ్యూజిక్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved