pizza

Allu Arjun gets a visit from Insta team
గ్లోబల్ లెవెల్ లోనూ దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

You are at idlebrain.com > news today >
Follow Us

30 August 2023
Hyderabad

First Team Ever, for an Indian actor Instagram official comes down Hyderabad to shot a video on National Award winning actor and Icon Star Allu Arjun

Icon star Allu Arjun has scripted history by emerging as the very first Telugu actor to have won the national award. Allu Arjun was catapulted into the national spotlight thanks to Pushpa: The Rise, a film that transcended regional boundaries and captivated audiences all over the country. Throughout Telugu-speaking states and beyond, he continues to attract fans with his magnetic charisma, exceptional acting skills, and remarkable journey.

His epic cinematic journey from Gangotri to Pushpa was written by Allu Arjun himself with his own blood and sweat. His outstanding performances earned him several awards, including five Filmfare Awards, two Nandi Awards, and a Special Jury Award. This journey from a large number of people criticising to a whole nation appreciating was not easy.

Allu Arjun may come from a family of superstars, but it is only through his hard work and dedication every day that he has become a national superstar. Now, the actor has achieved yet another unique feat in his career. Instagram's official channel will post about an actor for the first time in India. Coming to specifics, an Instagram official crew from the United States recently flew down to Hyderabad and shot few clips of Allu Arjun. The video was uploaded around 9:00 a.m. today.

Instagram's team captures Allu Arjun's daily routine and behind-the-scenes videos of Pushpa 2 The Rule. The actor talked about his daily routine, family, fans and shares a common thing between him and Pushpa Raj, never give up attitude.

Allu Arjun continues to astound people around the country with his exceptional feats. He is all set to rule Indian cinema with many more Iconic performances. Having gained national recognition, fans are eager to see what magic he will weave within the cinematic realm.


గ్లోబల్ లెవెల్ లోనూ దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రాంతీయ సరిహద్దులను దాటి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించారు. గంగోత్రి నుండి పుష్ప వరకు తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. 'పుష్ప: ది' రైజ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా గుర్తింపును అందుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అల్లు అర్జున్ తో ఇన్‌స్టాగ్రామ్‌ చేసిన ఓ స్పెషల్

వీడియో అదుర్స్ అనిపించేలా ఉంది. ఒక రోజంతా ఇన్‌స్టాగ్రామ్ టీమ్ ఈ ఐకాన్ స్టార్ తోనే ఉంది. ఫస్ట్ టైం అమెరికాలో ఉన్న ఇన్స్టాగ్రామ్ టీం స్వయంగా హైదరాబాద్ వచ్చి ఓ రోజంతా అల్లు అర్జున్ గారితో గడపడం విశేషం .

ఈ వీడియోలు బన్నీ దినచర్యను వీరు చూపించారు. ఉదయం లేచినప్పటి నుంచీ షూటింగ్ ముగిసే వరకూ తాను ఏయే పనులు చేస్తారో ఆ వీడియోలో వివరించారు.

సెట్స్ లోకి తీసుకెళ్లే ముందు తన ఇంట్లోనూ అర్జున్ ఓ టూర్ వేసి చూపించారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కు తీసుకెళ్లడంతోపాటు అక్కడ మూవీ కోసం వేసిన సెట్స్, తన కాస్ట్యూమ్స్, డైరెక్టర్ సుకుమార్, మూవీ షూటింగ్.. ఇలా ఈ వీడియోలో చూపించారు.
"పుష్ప 2" సెట్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ ఉదయాన్నే కాస్త చిల్ అవుతారు" అంటూ ఈ వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ వీడియోలో బన్నీ చేసిన కామెంట్స్ ను కూడా క్యాప్షన్ రూపంలో చెప్పింది. "ఇండియాలో అభిమానులు చాలా భిన్నం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటిది కనిపించదు. మీరు చూడాల్సిందే. దీనిని వర్ణించలేం" అంటూ చెప్పడం అల్లు అర్జున్ గ్లోబల్ లెవెల్ లో ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారు అర్థమవుతుంది.

"హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇది. ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియోల్లో ఇదీ ఒకటి. పుష్ప 2: ది రూల్ షూటింగ్ ఇక్కడే జరుగుతుంది" అని ఫిల్మ్ సిటీ గురించి బన్నీ వివరించారు. అభిమానులే తనకు మోటివేషన్ అని, వాళ్ల ప్రేమే తాను తన సరిహద్దులను చెరిపేస్తూ ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తోందని అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved