pizza

We are confident about the success of "Ambajipeta Marriage Band" - Hero Suhas
"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా విజయం మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం - హీరో సుహాస్

You are at idlebrain.com > news today >

30 January 2024
Hyderabad

Suhas, the promising young actor of Telugu cinema, has been making waves with his performances in films like 'Colour Photo' and 'Writer Padmabhushan'. He is now ready to entertain the audience with his upcoming film "Ambajipeta Marriage Band." The film produced jointly by GA2 Pictures and director Venkatesh Maha's Mahayana motion pictures, the film is coming also under the banner of Dheeraj Mogilineni Entertainment. The film is directed by Dushyanth Katikineni and stars Shivani Nagaram in female lead role. It also stars Saranya Pradeep, Nithin, Goparaju Ramana, Jagadeesh Prathap Bhandari in key roles. After completing all pre release programs, the film is releasing on February 2nd. Today hero Suhas interacted with media about the film and also shared his excitement.

"Writer Padmabhushan's release in February last year received good success. 'Ambajipeta Marriage Band' is hitting the theaters on February 2nd. We believe that this film will also be successful. My son was born recently. It looks like it's going well. We prepared for the movie 'Ambajipeta Marriage Band' for many days, learning to play in a band. We practiced the scenes that we wanted to connect well in the story, even shaving my head twice for it. We believed in this project for two years and worked hard. We believe and hope that two years of hard work will yield good results in the form of success. We shot in Amalapuram and Ambajipet, areas I am familiar with due to the atmosphere and the slang. I have friends there, and I visit those areas with them when I have time. Dushyanth's story moved me. During the lockdown, we read the script many times and discussed which points were good. Believing in the story, I agreed to shave my head. Our entire team worked on the script with confidence."

"I have not seen the incidents in this story in real life, but the incidents seen by our director make up half of the story. This story is inspired by what he saw and some situations that happened in his life, with the rest being a result of cinematic liberty. 'Ambajipeta Marriage Band' is set in 2007. The story of this movie is fun until twenty minutes before the interval, after which it intensifies. After watching until the interval, you will feel that the movie is well made. After that, the movie continues with an emotional tone. The films I have done so far are fun, and there is also emotion in 'Color Photo'. But this movie runs on high emotions. When you watch the movie tomorrow, you will wonder how I managed to act so emotionally. I have known director Dushyanth since I was acting in short films. He worked as an assistant director for 'Dear Comrade' and 'Uma Maheswara Ugra Roopasya' movies. He had always said he would do a movie with me. My career as a comedian is good. I used to worry that my career would be ruined because I am not a traditional hero. He said, 'I have always thought that once the 'Color Photo' movie comes out, you will be the hero with them.' Then we immediately started on this movie."

- Color photo movie has no similarity or relation with "Ambajipeta Marriage Band" movie. Both are different stories. The background of the village makes you feel similar.

- "Although caste is mentioned in 'Ambajipeta Marriage Band', the actual theme of the movie is not about caste. The main point is the barriers created by ego between people. Sharanya and I are twins in the movie, and how events on our birthdays turn our lives around is a key aspect of this story. The audience will likely connect with most of the scenes, as some may feel like they have happened in their own lives too. My excitement for this script increased during production. Now, with Shekhar Chandra's BGM, it has reached another level. After seeing the final copy, I felt very satisfied. As the lead actor, I feel pressure during the release, especially when it's said that I carry the film on my shoulders. It's scary to hear that. The movie's title includes 'marriage band', and though we considered different names for the town, we added 'Ambajipeta as it sounded good. Dushyanth and Venkatesh Maha are great friends. Dushyanth liked the story and approached Venkatesh, Dheeraj, and Geetha Arts to initiate the project."

- "When we were shooting in Amalapuram, the local people treated us with incredible warmth. They refused to let us eat in a hotel even when we offered to pay, asking if they should charge us for shooting in their village. Their love left us speechless. Allu Aravind praised 'Ambajipeta Marriage Band' as a good movie. When we met at the SIIMA celebrations, he appreciated my performance. His compliments made me very happy."

- "Heroine Shivani Nagaram is set to earn a good name after this movie. Her performance was impressive. Shivani, a dancer and singer, and Sharanya, who played the role of the elder sister, along with Nitin, who portrayed the villain, will also gain significant recognition from this movie. Nitin is from Malayalam. He learned Telugu and adapted to the Amalapuram dialect so well that those who met him couldn't believe he was Malayali. I am shy about doing romantic scenes. Our directors often reprimand me. During this movie, when we were about to shoot a romantic scene, directors like Sandeep called Dushyanth, warning him that I might not perform well. 'Bro, when will you start doing romantic scenes properly in your career?' Dushyanth asked. The premiere of 'Writer Padmabhushan' received positive feedback. Premieres are crucial for my movies. If early viewers like it, others will book tickets and go to the theaters. For actors like me, the response to premieres is very important. 'Writer Padmabhushan' collected 400k in the US, marking my first US release. Now, 'Ambajipeta Marriage Band' is releasing in 200 locations, and we are expecting good collections. I have known producer Dheeraj for a long time. He supported 'Color Photo' and 'Writer Padmabhushan' in time by providing theaters. My parents couldn't believe I was doing a film with Geetha Arts until they saw my name on the poster. Everyone dreams of acting under big banners for the good release and hype it brings. 'Ambajipeta Marriage Band' is loved by all of us, and we are confident about it. Please watch it in theaters on February 2."

- "I am selecting concepts that are new and different from the types of stories I've done before. I prefer to be known as an actor rather than just a hero. After my role as a villain in 'Hit 2', I received many similar offers, but I want to continue as a hero. It seems that when I get a bit older, I'll fit into more diverse characters. Right now, my youthful appearance limits the variety of roles I can take on."

- "My friends say that 'Color Photo' would have done better if it was released in theaters. But what happened, happened. It seems we gained good recognition even though it was an OTT release. We were thrilled when the film won a National Award. There was apprehension about how 'Writer Padmabhushan' would be received in theaters, but the movie was profitable. I am satisfied that our movies are being watched. We need toproduce even better content and make careful selections. Sandeep is planning a movie for 'Color Photo', and the story he told me is next level. Discussions for that movie are ongoing. I did a movie called 'Prasannavadanam' with Sukumar's associate, which already completed. I am also working on another movie called 'Cable Reddy'. A film under the banner of Dil Raju with Salaar dialogue writer and it is in the works."

"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా విజయం మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం - హీరో సుహాస్

"కలర్ ఫొటో", "రైటర్ పద్మభూషణ్" సినిమాలతో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. కంటెంట్ ఓరియెంటెడ్ గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ఫిబ్రవరి 2వ తేదీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీ హైలైట్స్ చెప్పారు హీరో సుహాస్.

- గతేడాది ఫిబ్రవరిలో రైటర్ పద్మభూషణ్ రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఈ ఫిబ్రవరికి "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్ముతున్నాం. ఈ మధ్యే బాబు పుట్టాడు. మంచి జరుగుతుందనే అనిపిస్తోంది. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు ఎక్కువ రోజులు ప్రిపేర్ అయ్యాం. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథలో బాగా కనెక్ట్ అవ్వాలని అనుకున్న సీన్స్ ప్రాక్టీస్ చేశాం. రెండు సార్లు గుండు గీయించుకున్నా. అలా రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి కష్టపడ్డాం. మా నమ్మకం, రెండేళ్ల కష్టం సక్సెస్ రూపంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. అమలాపురం, అంబాజీపేటలో షూటింగ్ చేశాం. నాకు అక్కడి వాతావరణం, స్లాంగ్ గురించి తెలుసు. ఆ ఏరియాల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. టైమ్ దొరికితే ఫ్రెండ్స్ తో అక్కడి ఏరియాలకు వెళ్తుంటాను. దుశ్యంత్ రాసిన కథ నన్ను కదిలించింది. అప్పుడు లాక్ డౌన్ టైమ్ కాబట్టి చాలాసార్లు స్క్రిప్ట్ చదువుకుని ఏ పాయింట్స్ బాగున్నాయో డిస్కస్ చేసేవాళ్లం. గుండు చేయించుకోవాలి అంటే కథ మీద నమ్మకంతో ఓకే అన్నాను. మా టీమ్ అంతా స్క్రిప్ట్ మీద నమ్మకంతో వర్క్ చేశాం.

- ఈ కథలో జరిగిన ఇన్సిడెంట్స్ నేను రియల్ లైఫ్ లో చూడలేదు గానీ మా డైరెక్టర్ చూసిన సంఘటనలు కథలో సగం వరకు ఉంటాయి. తను చూసినవి, తనకు లైఫ్ లో జరిగిన కొన్ని సందర్భాల స్ఫూర్తి ఈ కథలో ఉంది. మిగతాది సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేశాడు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" 2007 లో జరిగే కథ. ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ వరకు చూశాక సినిమా బాగా చేశారని ఫీల్ అవుతారు. ఆ తర్వాత మూవీ ఎమోషనల్ గా ఫీల్ తో సాగుతుంది. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు సరదాగా సాగుతుంటాయి. కలర్ ఫొటోలో ఎమోషన్ కూడా ఉంటుంది. కానీ ఈ సినిమాలో హై ఎమోషన్ ఉంటుంది. రేపు సినిమా చూశాక ఇంత ఎమోషనల్ గా ఎలా నటించారని మీరే అడుగుతారు. నేను షార్ట్ ఫిలింస్ లో నటిస్తున్నప్పటి నుంచి డైరెక్టర్ దుశ్యంత్ తెలుసు. డియర్ కామ్రేడ్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా తను వర్క్ చేశాడు. అప్పటి నుంచే నీతో సినిమా చేస్తా అనేవాడు. నేను కమెడియన్ గా బాగుంది నా కెరీర్ . నా కెరీర్ చెడగొడతావా నేను హీరో ఏంటి అని వద్దని చెప్పేవాడిని. కలర్ ఫొటో మూవీ వచ్చాక...మీ వాళ్లతోనే హీరోగా చేసుకుంటావా నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా కదా అన్నాడు. అప్పుడు వెంటనే ఈ మూవీ స్టార్ట్ చేశాం.

- కలర్ ఫొటో సినిమాకు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీకి ఎలాంటి పోలిక, సంబంధం లేదు. రెండూ వేటికవి భిన్నమైన కథలు. ఊరి నేపథ్యం వల్ల మీకు సిమిలర్ గా అనిపిస్తుంటాయి.

- "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. నేను, శరణ్య కవల పిల్లలం. మా పుట్టినరోజున జరిగిన సంఘటనలు జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయి అనేది ఈ మూవీలో కీలకంగా ఉండే అంశం. కథలోని చాలా సీన్స్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ సన్నివేశాల్లో కొన్ని మన జీవితాల్లో కూడా జరిగాయని అనిపిస్తుంది. ఈ స్క్రిప్ట్ చదివేప్పుడు ఉన్న ఎగ్జైట్ మెంట్ మేకింగ్ టైమ్ లో మరింత పెరిగింది. ఇప్పుడు శేఖర్ చంద్ర ఇచ్చిన బీజీఎంతో చూసుకున్నప్పుడు మరో లెవెల్ కు వెళ్లింది. ఫైనల్ కాపీ చూశాక చాలా సంతృప్తిగా అనిపించింది. మూవీకి హీరోను కాబట్టి రిలీజ్ టైమ్ లో ప్రెజర్ ఫీలవుతాం. నా భుజాల మీదే సినిమాను మోస్తానని అంటారు కదా. ఆ మాట వింటే భయమేస్తుంటుంది. టైటిలో మ్యారేజి బ్యాండు అనేది ఉంది. అయితే ఊరు పేర్లు వేరేవి అనుకున్నాం కానీ పలికేందుకు బాగుందని అంబాజీపేట యాడ్ చేశారు. దుశ్యంత్, వెంకటేష్ మహా ఫ్రెండ్స్. దుశ్యంత్ చెప్పిన కథ నచ్చి వెంకటేష్ ధీరజ్ కు, గీతా ఆర్ట్స్ వాళ్లకు వినిపించి ప్రాజెక్ట్ సెట్ చేశాడు.

- అమలాపురంలో షూటింగ్ చేసినప్పుడు అక్కడి వాళ్లు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. హోటల్ లో టిఫిన్ చేసి డబ్బులు ఇచ్చినా తీసుకునేవారు కాదు. మా ఊళ్లో షూటింగ్ చేస్తూ డబ్బులు ఇస్తారా అనేవారు. వాళ్ల ప్రేమతో మాకు మాటలు రాకుండా చేశారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా చూసి అల్లు అరవింద్ గారు బాగుందంటూ ప్రశంసించారు. ఆయన సైమా వేడుకల్లో కలిసినప్పుడు బాగా నటించావయ్యా అని అప్రిషియేట్ చేశారు. ఆయన పొగడ్తలతో హ్యాపీగా ఫీలయ్యా.

- హీరోయిన్ శివానికి ఈ సినిమా తర్వాత మంచి పేరొస్తుంది. ఆమె పర్ ఫార్మెన్స్ అంత బాగా చేసింది. శివాని డ్యాన్సర్, సింగర్ కూడా. అక్క క్యారెక్టర్ చేసిన శరణ్య గారు, విలన్ గా చేసిన నితిన్ కూడా ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. నితిన్ మలయాళీ, తెలుగు నేర్చుకుని, అమలాపురం వచ్చి అక్కడ యాస కూడా నేర్చుకున్నాడు. ఆయన మలయాళీ అంటే చూసేవాళ్లు నమ్మలేకపోయారు. నాకు రొమాంటిక్ సీన్స్ చేయాలంటే సిగ్గు. మా డైరెక్టర్స్ మందలిస్తుంటారు. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ చేసేప్పుడు డైరెక్టర్ సందీప్ లాంటి వాళ్లు ఫోన్ చేసి దుశ్యంత్ కు చెప్పారు ఈ సీన్స్ సరిగ్గా చేయడు జాగ్రత్త అని. నీ కెరీర్ లో ఇంకెప్పుడు చేస్తావ్ బ్రో రొమాంటిక్ సీన్స్.. చేయి అని దుశ్యంత్ అనేవాడు. రైటర్ పద్మభూషణ్ కు ప్రీమియర్స్ వేయడం వల్ల మంచి టాక్ వచ్చింది. నా సినిమాలకు ప్రీమియర్స్ పడాలి. చూసిన వాళ్లు బాగుందని చెబితే మిగతా వాళ్లు బుకింగ్ చేసుకుని థియేటర్స్ కు వెళ్తారు. నాలాంటి హీరోలకు ప్రీమియర్స్ కు వచ్చే రెస్పాన్స్ చాలా ముఖ్యం. యూఎస్ లో రైటర్ పద్మభూషణ్ సినిమాకు 400 కె కలెక్షన్స్ వచ్చాయి. నా ఫస్ట్ యూఎస్ రిలీజ్ అది. ఇప్పుడు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు 200 లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మంచి కలెక్షన్స్ వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా. ప్రొడ్యూసర్ ధీరజ్ గారు చాలా కాలంగా తెలుసు. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ టైమ్ లో బాగా సపోర్ట్ చేశారు. థియేటర్స్ ఇప్పించారు. గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తున్నా అంటే మా అమ్మా నాన్నే నమ్మలేదు. చూడండి పోస్టర్ మీద వేశారు కదా అని చూపిస్తే నమ్మారు. పెద్ద బ్యానర్స్ లో నటించాలి అనే డ్రీమ్ అందరికీ ఉంటుంది. మంచి రిలీజ్ ఉంటుంది. హైప్ వస్తుంది అని. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" అందరికీ నచ్చుతుంది. మేమంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఫిబ్రవరి 2న థియేటర్స్ లో చూడమని కోరుతున్నా.

- నేను చేసిన టైప్ కథలు కాకుండా కొత్తగా ఉండాలని కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు. వాటిలో నేను నాకు నప్పేవి సెలెక్ట్ చేసుకుంటున్నా. హీరోగా కంటే నటుడిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టం. హిట్ 2లో విలన్ గా నటించిన తర్వాత అలాంటివే చాలా ఆఫర్స్ వచ్చాయి. విలన్ రోల్స్ వద్దనుకుని మళ్లీ హీరోగా చేస్తున్నా. నాకు ఇంకొంత వయసు వచ్చాక మరికొన్ని భిన్నమైన క్యారెక్టర్స్ కు సెట్ అవుతా అనిపిస్తోంది. ఇప్పుడు చిన్నగా కనిపించడం వల్ల అన్ని రకాల క్యారెక్టర్స్ కు సెట్ కానేమో అనిపిస్తుంటుంది.

- కలర్ ఫొటో థియేటర్స్ లో రిలీజ్ అయితే బాగుండేది అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. కానీ అప్పుడు అలా జరిగిపోయింది. ఓటీటీ అయినా మనకు మంచి గుర్తింపు వచ్చింది కదా అనిపిస్తుంది. ఆ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు మాకు మంచి గుర్తింపు దక్కిందని సంతోషపడ్డాం. రైటర్ పద్మభూషణ్ థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో అని భయపడ్డాం. ఆ మూవీకి లాభాలు వచ్చాయి. ఫర్వాలేదు మన సినిమా కూడా చూస్తున్నారనే సంతృప్తి కలిగింది. ఇంకా మంచి కంటెంట్ చేయాలి, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా. కలర్ ఫొటో సందీప్ తో ఓ సినిమా చేయబోతున్నా. కథ చెప్పాడు. నెక్ట్ లెవెల్ లో ఉంది. ఆ మూవీకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సుకుమార్ గారి అసోసియేట్ తో ప్రసన్నవదనం అనే ఒక సినిమా చేశా. అది కంప్లీట్ అయ్యింది. కేబుల్ రెడ్డి అనే మరో మూవీ చేస్తున్నా. దిల్ రాజు గారి బ్యానర్ లో సలార్ రైటర్ తో ఒక మూవీ జరుగుతోంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved