Naveen Polishetty’s Anaganaga Oka Raju Diwali Blast Promo Sets the Stage for a Sankranti Laugh Riot, First Song Coming Soon! 🎶
ఆకట్టుకుంటున్న నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' దీపావళి ప్రత్యేక ప్రోమో
Naveen Polishetty is back, and this Diwali, he’s bringing the fireworks early! The Diwali special promo of Anaganaga Oka Raju has lit up social media, promising audiences a laughter-packed festive season leading into Sankranti.
Packed with Naveen’s signature wit, spot-on timing, and effortless charm, the promo is pure entertainer energy. Every frame bursts with his trademark humor and lively screen presence. A reminder of why audiences love his brand of fun.
In just over a minute, the Diwali promo does what few manage. it sets the hype sky-high. Fans are calling it “a laugh riot,” “massively entertaining,” and “the perfect festival mood-setter.” Naveen once again proves his flair for choosing stories that balance humor, freshness, and crowd-pleasing appeal.
Adding to the excitement, the FIRST SONG from this highly anticipated film is all set to drop soon.
Produced by Suryadevara Naga Vamsi & Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas and presented by Srikara Studios, Anaganaga Oka Raju marks the directorial debut of Maari. The film co-stars Meenakshi Chaudhary in a vibrant pairing that promises both spark and laughter. The film’s music is composed by Mickey J Meyer, with cinematography by J Yuvraj.
As Sankranti nears, this promo has done exactly what it set out to amplify the buzz and cement Anaganaga Oka Raju as one of the most awaited family entertainers of the season.
A festival of fun begins! The Diwali promo hits all the right notes and with the first song on its way, Anaganaga Oka Raju is all set to make this Sankranti one to remember! 💥🎶
ఆకట్టుకుంటున్న నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' దీపావళి ప్రత్యేక ప్రోమో
సంక్రాంతికి వినోదాల విందుని హామీ ఇస్తున్న ప్రోమో
త్వరలో 'అనగనగా ఒక రాజు' మొదటి గీతం విడుదల
తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి దీపావళి ప్రత్యేక ప్రోమో విడుదలైంది. నవ్వుల టపాసులను తలపిస్తున్న ఈ ప్రోమో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2026 సంక్రాంతికి ప్రేక్షకులకు నవ్వులతో నిండిన అసలైన పండుగకు హామీ ఇచ్చేలా ఈ ప్రోమో ఉంది.
నవీన్ యొక్క అద్భుతమైన హాస్య చతురత, అప్రయత్నమైన ఆకర్షణ ప్రతి ఫ్రేమ్ లో ప్రకాశించింది. తెరపై నవీన్ ఉత్సాహంగా కనిపించిన తీరు కట్టిపడేసింది. ఈ దీపావళి ప్రోమో వినోదాల విందులా ఉంది. నవీన్ పొలిశెట్టి శైలి హాస్యాన్ని ప్రేక్షకులు ఎందుకు అంతలా ఇష్టపడతారో ఈ ప్రోమో మరోసారి గుర్తుచేసింది.
కేవలం నిమిషం నిడివితో రూపొందిన ఈ దీపావళి ప్రోమో, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అతి కొద్దిమంది మాత్రమే నిమిషంలో ఇంతటి వినోదాన్ని పంచగలరు. అభిమానులు దీనిని "ఒక నవ్వుల అల్లరి", "వినోదాల విందు", "అసలైన పండుగ సినిమా" అని పిలుస్తున్నారు. హాస్యం, తాజాదనంతో నిండి, ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకోవడంలో నవీన్ మరోసారి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.
ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ.. ఈ భారీ అంచనాలున్న చిత్రం నుండి మొదటి గీతం త్వరలో విడుదల కానుంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య 'అనగనగా ఒక రాజు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. నవీన్ పోలిశెట్టితో కలిసి ఆమె సరికొత్త వినోదాన్ని పంచనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి, జె యువరాజ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానున్న 'అనగనగా ఒక రాజు'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన దీపావళి ప్రోమో, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా 'అనగనగ ఒక రాజు' చిత్రాన్ని నిలిపింది.
సరదాల పండుగ మొదలవుతుంది. దీపావళి ప్రోమో ఆకట్టుకుంది. మొదటి గీతం రాబోతుంది. 'అనగనగా ఒక రాజు' ఈ సంక్రాంతిని గుర్తుండిపోయేలా చేయడానికి సిద్ధమవుతోంది.
చిత్రం: అనగనగా ఒక రాజు
తారాగణం: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి
ఛాయాగ్రహణం: జె. యువరాజ్
సంగీతం: మిక్కీ జె. మేయర్
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్
Latest fancy okati vachindi… (Naga Vamsi)
It’s gotta be hilarious when Naveen Polishetty steps into promote. This Diwali promo of #AnaganagaOkaRaju is entertaining 🤣