pizza

Chinni Gundelo song from Andhra King Taluka in 31 October
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ ఆంధ్ర కింగ్ తాలూకా చిన్ని గుండెలో సాంగ్ అక్టోబర్ 31న రిలీజ్

You are at idlebrain.com > news today >

27 October 2025
Hyderabad

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్, యూనిక్ ఎంటర్‌టైనర్‌ ఆంధ్రా కింగ్ తాలూక. మహేష్ బాబు పి దర్శకత్వంలో, ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 28న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే ద్వారా రామ్ తన సింగింగ్ డెబ్యూ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాట ప్రేక్షకుల మనసులను దోచుకుని బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. రెండవ పాట పప్పీ షేమ్ డిఫరెంట్వైబ్‌ తో అదిరిపోయింది. ఈ సాంగ్ కి రామ్ స్వయంగా వాయిస్ ఇచ్చారు.

ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. చిన్ని గుండెలో సాంగ్ ని అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో రామ్, భాగ్యశ్రీ క్లాసిక్ లవ్ మూమెంట్ అదిరిపోయింది.

ఉపేంద్ర ఈ చిత్రంలో సూపర్ స్టార్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌,

తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్

సాంకేతిక సిబ్బంది:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ప్రొడక్షన్ హౌస్: మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ & T-సిరీస్ ఫిలిమ్స్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ & మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved