pizza

First Look of 'Annapurna Photo Studio' unveiled at the hands of popular producer D Suresh Babu
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

15 March 2023
Hyderabad

'Annapurna Photo Studio' is the sixth film coming under the banner of Big Ben Cinemas, the banner that made a name for itself with Pelli Choopulu, Dear Comrade, and Dorasaani. Chaitanya Rao of '30 Weds 21' fame is acting as the hero and Lavanya is the film's heroine. Previously, a concept poster of the film was released at the hands of director Harish Shankar. It received a unanimous response from the industry as well as the audience. And now, the first look poster of this movie was released at the hands of senior producer Suresh Babu

Speaking on the occasion, the respected producer conveyed his best wishes to the entire team of the movie. He hoped that 'Annapurna Photo Studio' draws the audience to theatres.

Director Chendu Muddu said, "We are happy to release the first look poster through Suresh Babu garu. Yash Rangineni, who has made a unique mark in Telugu with Pelli Choopulu, liked my story and gave me this opportunity. A young team has worked on the movie, which is a pure love story set in the rural backdrop of the 1980s. There will be some twists and thrilling elements. This is a rooted film that will make the audience nostalgic. In the past, a short film I had done brought me some fame. Hope this film will better that. Technically, this one has got the best output. Cinematographer Pankaj, Music director Prince Henry, Editor Venkat are young and enthusiastic. The producer gave us complete freedom. There is no typical hero or heroine in this film. All are just well-written characters with their own identity. After seeing the final copy, I am feeling very happy and confident. We are going to start promotions soon. After seeing the lyrical videos, teaser and trailer that are going to come up, the audience will definitely understand that this is a special movie. Films with good content are always appreciated by the audience."

Heroine Lavanya said, "Thanks to Suresh Babu garu for releasing the first look poster of our movie. We have been getting support since the beginning of the film. The movie is getting ready for release. I want the audience to support us. Big Ben Cinemas is an amazing banner. Producer Yash gave complete freedom to the director. The cinematographer has ensured awesome visuals. Our music director Prince Henry's songs will please everyone." He predicted that expectations from the movie will ratchet up with the release of songs. "The story mainly revolves around seven characters. With a good love story, fun, suspense, thrill, and good commercial elements, I can say that it will give a good feeling to every audience member," he added.

Hero Chaitanya Rao said, "On behalf of our movie team, we congratulate Keeravani garu and the entire RRR team on winning the Oscar award. Thanks to Suresh Babu for unveiling the first-look poster of our movie. We thank him for supporting us since the beginning. This is another beautiful movie coming from Big Ben Cinemas. I sincerely thank the director and producer who believed in me and gave me this opportunity. This is a pure film that will transport the audience to beautiful locations and to bygone times. The main asset of this movie is the cinematography. While taking care of the background of the story, extraordinary visuals have been provided. Each frame was carefully shot. Prince Henry's music is pristine. The songs will give a nostalgic feeling. Also, the movie has been taken to the next level with an excellent background score. Venkat has given the best output in terms of editing. He has brilliantly edited the screenplay-based movie. Special mention should be made about our producer."

Producer Yash Rangineni said, "I am proud as a Telugu about the Oscar glory of 'Naatu Naatu'. I would like to thank Suresh Babu for releasing the first-look poster of our movie. His support has been there since the beginning. This is a concept-based movie whose forte is its story. This is a fairy tale film filled with fun, crime and thriller elements. The screenplay is especially very good. Apart from this, the cinematography, music and editing are its stand-out features. At a time when even villages are acquiring the features of towns, the team has worked hard to make this film which is set in the 1980s. The team has done a lot of hard work to recreate the old-world village scene. We went from Amalapuram to Kerala and shot in authentic locations. In that sense, the whole movie is like a visual feast that brings back memories of our childhood. The scenes of playing in ponds and on the fields in the villages, the visuals of families and their bindings will impress the audience. Big Ben Cinemas needs no introduction. I have always been interested in making films with good content. Everyone knows how big a hit the first movie under our banner was. After Pelli Choopulu, Dear Comrade and Dorasaani, we are confident of yet another hit. The biggest asset of this film is the music. Music director Prince Henry is the backbone of the film in terms of songs and BGM. The cinematography is brilliant. The entire team worked hard to make the film a visual feast while working very hard in tough weather conditions. The two-hour movie doesn't feel long at all."

Cast:
Chaitanya Rao, Lavanya, Mihira, Uttara, Vaiva Raghava, Lalit Aditya and others.

Crew:
Music director: Prince Henry, Cinematography: Pankaj, Editor: D Venkat Prabhu, PRO - GSK Media, Banner: Big Ben Cinemas, Producer: Yash Rangineni, Written and Directed by Chendu Muddu.

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వైవిధ్యమైన సినిమాలతో అభిరుచిని చాటుకున్న బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’.ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును అనేది ఉపశీర్షిక. 30వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. గతంలో ఈ మూవీ నుంచి డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కు పరిశ్రమతో పాటు ప్రేక్షకల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబుగారి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భగా సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ పేరుతో వస్తోన్న ఈ మూవీ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెబుతున్నాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ ‘సురేష్ బాబు గారి చేతుల మీదుగా మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతగా తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను కలిగి పెళ్ళి చూపులు లాంటి నేషనల్ అవార్డ్ విన్నర్ సినిమా తీసిన యష్ రంగినేని గారు నా కథ నచ్చి ఈ అవకాశం ఇచ్చారు. ఆల్మోస్ట్ అంతా యంగ్ అండ్ న్యూ టీమ్ తో పనిచేశాం. ఈ చిత్రం 1980స్ బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ. దీంతో పాటు కొన్ని ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సహజమైన నేటివిటీతో ఉండటం వల్ల చాలామందికి వారి పాత జ్ఞాపకాలను గుర్తుకు చేస్తుంది. గతంలో నేను చేసిన ఓ పిట్టకథ చిత్రం నాకు మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రం అంతకు మించిన పేరును తెస్తుందని ఆశిస్తున్నాను. టెక్నీకల్ గా ఈ మూవీ నుంచి ది బెస్ట్ అవుట్ పుట్ ఉంటుంది. డివోపి పంకజ్, మ్యూజిక్ ప్రిన్స హెన్రీ, ఎడిటర్ వెంకట్ అంతా యంగ్ టీమ్. మా అందరికీ నిర్మాత మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ అంటూ రెగ్యులర్ గా ఏం ఉండదు. అన్నీ మంచి పాత్రలే ఉంటాయి. ప్రతి పాత్రకూ ఓ గుర్తింపు ఉంటుంది. సినిమా పూర్తయి.. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఫైనల్ కాపీ చూసిన తర్వాత నాతో పాటు నిర్మాతగారు కూడా చాలా హ్యాపీగానూ, కాన్ఫిడెంట్ గానూ ఫీలవుతున్నాము. త్వరలోనే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయబోతున్నాం. లిరికల్ రిలీజ్ లు, టీజర్, ట్రైలర్ ఇవన్నీ చూస్తే ప్రేక్షకులకు ఖచ్చితంగా ఇదో స్పెషల్ మూవీ అని అర్థం అవుతుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో కూడా మంచి నేటివిటీతో కూడిన ఫీల్ ఉన్న సినిమాగా అందరికీ గుర్తుంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత యష్ రంగినేని గారికి మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాను..’ అన్నారు.

హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినందుకు సురేష్ బాబుగారికి చాలా థ్యాంక్స్. సినిమా ప్రారంభం నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ రాబోతోంది. అలాగే సినిమా కూడా విడుదలకు రెడీ అవుతోంది. ప్రేక్షకులందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై గతంలో పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి మంచి చిత్రాలను నిర్మించిన ఈ బ్యానర్ నుంచి వస్తోన్న అన్నపూర్ణ స్టూడియో కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రొడ్యూసర్ యష్ గారు డైరెక్టర్ గారికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాడు. 1980స్ బ్యాక్ డ్రాప్ కావడంతో అందుకు తగ్గట్టుగానే, మంచి మంచి లొకేషన్స్ లో బ్యూటీఫుల్ విజువల్స్ తో పాటు మమ్మల్ని కూడా అందంగా చూపించిన డివోపి గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ పాటలు ప్రతి ఒక్కరినీ మెప్పిస్తాయి. త్వరలోనే రిలీజ్ కాబోతోన్న లిరికల్స్ సాంగ్స్ తో అంచనాలు పెరుగుతాయి. కంటెంట్ పరంగా కథ ప్రధానంగా ఏడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. మంచి లవ్ స్టోరీతో పాటు ఫన్, సస్పెన్స్, థ్రిల్ తో పాటు మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూసిన ప్రతి ఒక్కరికీ మంచి ఫీల్ ను ఇస్తుందని చెప్పగలను’ అన్నారు.

హీరో చైతన్యరావు మాట్లాడుతూ.. ‘ముందుగా ఆస్కార్ అవార్డ్ సాధించిన సందర్భంగా మా మూవీ టీమ్ తరఫు నుంచి కీరవాణిగారితో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు చెబుతున్నాము. ఇక మా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సురేష్ బాబు గారికి థ్యాంక్యూ. మూవీ ఓపెనింగ్ కూడా వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేశారు. షూటింగ్ తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసి మాకు అద్భతమైన సపోర్ట్ గా నిలుస్తున్నందుకు థ్యాంక్యూ సురేష్ బాబు సర్. ఇది బిగ్ బెన్ సినిమాస్ నుంచి వస్తోన్న మరో అందమైన సినిమా మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇదో స్వచ్ఛమైన సినిమా. ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్ స్టైల్ నుంచి దూరంగా ప్రేక్షకులందరినీ 80ల నేపథ్యంలో అందమైన లొకేషన్స్ లోకి తీసుకువెళుతుంది. ఓ రెండు గంటల పాటల పాటు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ మూవీకి మెయిన్ ఎసెట్ సినిమాటోగ్రఫీ. కథ నేపథ్యానికి తగ్గట్టుగా చూసుకుంటూనే.. ఎక్స్ ట్రార్డినరీ విజువల్స్ ను అందించారు. ప్రతి ఫ్రేమ్ నూ జాగ్రత్తగా షూట్ చేశారు. ఈ సందర్భంగా పంకజ్ -తిరులకు కంగ్రాట్స్ చెబుతున్నాను. ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్ స్వచ్ఛంగా ఉంటుంది. పాటలైతే నోస్టాల్జిక్ ఫీలింగ్ ను ఇస్తాయి. అలాగే అద్భుతమైన ఆర్ఆర్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లారు. మీకు ఈ సినిమా చాలా గొప్ప పేరు తెస్తుందని కోరుకుంటున్నాను. ఎడిటింగ్ పరంగానూ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు వెంకట్. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ కు కావాల్సినంత ఎగ్జైట్మెంట్ ను అద్బుతంగా ఎడిటింగ్ చేశాడు వెంట్. ఇక మా ప్రొడ్యూసర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఓ కొత్త కంటెంట్ తో పాటు కొత్త టీమ్ ను నమ్మి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓ సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలుంటాయో వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉండబోతోంది. దర్శకుడి కథను నమ్మి యష్ రంగినేని గారు మాకో అద్భుతమైన సినిమాను ఇచ్చారు అని చెప్పగలను. ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. కొత్తగా వస్తోన్న మా టీమ్ ను నమ్మి ఇంత రెప్యూటేషన్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ చేయడం చాలా గర్వంగా ఉంది. బిగ్ బెన్ బ్యానర్ లో ఇది మరో అద్భుతమైన సినిమా అవుతుందని నమ్ముతున్నాను. మీ అందరికీ ఓ మంచి సినిమా చూసిన ఎక్స్ పీరియన్స్ ఈ చిత్రం ప్రేక్షకులకు ఇస్తుంది. మీ అందరూ థియేటర్ లో మా సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.. ’ అన్నారు.

నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ.. ‘ముందుగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నందుకు గానూ ఒక తెలుగువాడిగా గర్విస్తున్నాను. ఇక మన అన్నపూర్ణ స్టూడియో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన సురేష్ బాబుగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. వారు మొదట్నుంచీ మన సినిమాకు సపోర్ట్ గా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. అందరూ కొత్తవాళ్లే. ఈ సినిమాకు ప్రధాన బలం కథ. ఓ పిట్టకథ చిత్రంతో మెప్పించిన చెందు ముద్దు ఈ కథను బాగా రాసుకున్నారు. ఫన్ తో పాటు క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా బాగా కుదిరాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. వీటితో పాటు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఇప్పుడు పల్లెటూళ్లు కూడా ఇప్పుడు టౌన్స్ లాగా మారుతున్నాయి. అలాంటిది 1980ల నేపథ్యంలో సాగే ఈ కథను తీయడానికి చాలా కష్టపడింది టీమ్. అలాంటి గ్రామాలను రీ క్రియేట్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేసింది టీమ్. అమలా పురం ప్రాంతం నుంచి కేరళ వరకూ వెళ్లి అద్భుతమైన గ్రామీణ లొకేషన్స్ లో చిత్రీకరణ చేశాము. అందువల్ల సినిమా అంతా ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్ ను కలిగిస్తూనే విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. ఎంతోమందికి వారి వారి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపుతుంది. ఊర్లలో పొలాల పక్కన, చెరువుల్లో ఆడుకున్న గుర్తులు, కుటుంబం అంతా ఎలా కలిసి ఉండేది అనే సీన్స్ ఆకట్టుకుంటాయి. చూసేవారిని మరోసారి వారి చిన్న తనానికి తీసుకువెళుతుంది. అలాంటి మంచి కథతోనే మేము వస్తున్నాము. బిగ్ బెన్ సినిమాస్ గురించి మీ అందరికీ తెలుసు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలే తీయాలనేది నాకు ముందు నుంచీ ఉన్న ఆసక్తి. మా బ్యానర్ లో వచ్చిన ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్, దొరసాని వంటి మంచి కాన్సెప్ట్ బేస్డ్ గా సాగే సినిమానే ఈ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా. ఈ చిత్రానికి మీ అందరి సహకారం ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎసెట్ మ్యూజిక్. అద్భుతమైన ఆర్ఆర్ తో చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలిచాడు మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ. పాటలు కూడా 80ల కాలం నాటి సౌండింగ్ తో బాగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ సినిమాను విజువల్ ఫీస్ట్ గా మార్చేందుకు టీమ్ అంతా కష్టపడింది. మంచి కంటెంట్ తో వస్తోన్న ఈ చిత్రం చూసిన తర్వాత ఓ గొప్ప ఫీలింగ్ తో బయటకు వస్తారు. అప్పుడే రెండు గంటల సినిమా అయిపోయిందా అనిపిస్తుంది.. ’ అన్నారు.

షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రంలో

నటీనటులు : చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు.

సాంకేతిక నిపుణులు : సంగీతం - ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ - పంకజ్ తొట్టాడ, ఎడిటర్ - డి వెంకట్ ప్రభు, పీఆర్వో - జీఎస్కే మీడియా, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత - యష్ రంగినేని, రచన దర్శకత్వం - చెందు ముద్దు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved