Ari is being produced by Srinivas Rami Reddy and Seshu Maram Reddy under RV cienmas banner. RV Reddy is presenting the film which is directed by Paper Boy fame Jayshankarr. The trailer of the film was unveiled by Abhishek Agawal, the man behind pan Indian blockbusters Kashmir Files and Karthikeya 2.
On the occasion, Abhishek Agarwal said "I really loved the trailer and also the tagline My name is nobody. A new song from the film that was crooned by Mangili and was released recently is a favorite of mine. I like Jayshankarr's Paper Boy film and I really hope Ari also turns out to be a blockbuster. The producers did a great job with the film despite this being their first venture."
Seshu Maram Reddy, one of the producers said "I feel delighted that Abhishek Garu is releasing our film. We are coming with a new age and dynamic subject that will connect with all sections of the audience. I am congratulating the team in advance as I'm so confident about the output."
Director Jayshankarr said "I'd like to thank Abhishek garu for launching our trailer. The Sri Krishna anthem that we released last week has already fetched a great reception. The trailer will also appeal to everyone and I'm sure of it. Thanking the whole team for their efforts."
ప్యాన్ ఇండియా నిర్మాత అభిషేక్ అగర్వాల్ చేతుల మీదుగా అరి మూవీ ట్రైలర్ విడుదల
ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 చిత్రాలతో ప్యాన్ ఇండియన్ ప్రొడ్యూసర్ గా మారిన అభిషేక్ అగర్వాల్ గారి చేతుల మీదుగా ట్రైలర్ ను విడుదల చేశారు.
ఇక ట్రైలర్ గురించి చూస్తే ప్రతి షాట్ నెక్స్ట్ లెవెల్ అనేలా కనిపిస్తోంది. ట్రైలర్ లో కనిపించే సీన్ లే చాల క్యూరియాసిటీ ని కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి కథలను తెలుగులోనే కాదు వేరే భాషల్లోనూ ఎవరూ డీల్ చేసిన్నట్టుగా లేదు. వారి అరి షడ్వర్గాలను జయించిన వారే మహనీయులు అవుతారు అనే పాయింట్ ను దర్శకుడు ఒక్కో పాత్ర ద్వారా చెప్పినట్టు కనిపిస్తోంది. ఈ ట్రైలర్ తోనే సినిమా గొప్పగా ఉందనిపిస్తోంది. ప్రతి పాత్రా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది . మరోవైపు మంచి కమర్షియల్ ఎలెమెంట్స్ కూడా ఉన్నాయి. కామ క్రోధ మధ మాత్సర్యాలే మనిషి పతనానికి హేతువు అని ఎన్నో పురాణాల్లో ఉంది. ఆ విషయాన్ని కమర్షియల్ అంశాలతో కలిపి చక్కని కృష్ణ తత్వాన్ని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తుంది అని అనిపిస్తూంది
ఈ సందర్భంగా
అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ... ‘‘ఈ టైటిల్ నాకు బాగా నచ్చింది. అలాగే మై నేమ్ ఈజ్ నో బడీ అనేది బాగా అనిపించింది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందరూ తెలిసిన నటులే ఉన్నారు. మంచి ప్యాడింగ్ కనిపిస్తోంది. రీసెంట్ గా విడుదలైన మంగ్లీ పాడిన పాట నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ జయశంకర్ మెదటి మూవీ పేపర్ బాయ్ కూడా చాలా బాగా ఆడింది , ఈ మూవీ కూడా కుడా పెద్ద హిట్ కావాలి .ఇలాంటి కథలు చేయాలంటే ధైర్యం చేయాలి. నిర్మాతలకు ఫస్ట్ మూవీ అయినా వారి ప్రయత్నం మెచ్చుకోవాలి. వీరి నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్’’ చెప్పారు.
నిర్మాతల్లో ఓకరైన శేశూ మారం రెడ్డి మాట్లాడుతూ.... ‘మా అరి మూవీ ట్రైలర్ విడుదల చేయడానికి ఒప్పుకున్న అభిషేక్ అగర్వాల్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ అరి సినిమా అనేది వైవిధ్యమైన కథతో వస్తోంది. కథతో పాటు కథనం, సంగీతం హైలెట్ అవుతాయి. మంగ్లీ పాట చాలా పెద్ద హిట్ అయింది. అలాగే సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ మా డైరెక్టర్ గారికి కంగ్రాట్స్ చెబుతూ థ్యాంక్యూ.. ’ అన్నారు.
దర్శకుడు జయ శంకర్ మాట్లాడుతూ.... ‘ట్రైలర్ లాంచింగ్ కు ఒప్పుకున్న అభిషేక్ గారికి థ్యాంక్స్. ట్రైలర్ లాంచింగ్ కోసం రిక్వెస్ట్ చేయగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఇక గత వారం విడుదల చేసిన శ్రీ కృష్ణ ఆంథెమ్ పాట అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. అలాగే ఈ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. మా నిర్మాతలు శేషు గారు, ఆర్ వీ రెడ్డి గార్ల సపోర్ట్ మర్చిపోలేనిది ’ అన్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘అరి’చిత్రంలో నటీనటులు :
అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, తమిళ బిగ్ బాస్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్ తదితరులు నటించారు.
సాంకేతిక నిపుణులు
రచన –దర్శకత్వం :జయశంకర్, సమర్పణ : ఆర్ వీ రెడ్డి, నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి , శేషు మారం రెడ్డి , సంగీతం : అనుప్ రూబెన్స్ , ఎడిటర్ : జి. అవినాష్ , సాహిత్యం : కాసర్ల శ్యాం , వనమాలి, కొరియోగ్రఫీ - భాను, జీతు, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ , స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సినిమాటోగ్రఫీ : శివశంకర వరప్రసాద్