`
pizza

Upcoming Psychological Thriller 'ASVINS' FL induces Fear
శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై వెర్స‌టైల్ యాక్ట‌ర్ వ‌సంత్ ర‌వి హీరోగా రూపొందుతోన్న సైక‌లాజిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘అశ్విన్స్’.. ఫస్ట్ లుక్ రిలజ్ చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైెరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్

You are at idlebrain.com > news today >
Follow Us

9 March 2023
Hyderabad

The ace producer BVSN Prasad bringing another interesting and intriguing project under his banner Sri Venkateswara Cine Chitra. The film titled 'ASVINS' stars the versatile actor Vasanth Ravi, who is known for exceptional performances in Tamil films Taramani and Rocky. This film will be directed by filmmaker and screenwriter Tarun Teja.

This young filmmaker has gained acclaim for his thought-provoking short films, some of which have received international recognition at various European International Film Festivals and Independent Film Community in Europe. Now this brilliant filmmaker is all set to make his directorial debut with 'Asvins,' which is based on his 20-minute pilot film that stunned the critics and audiences.

Today makers released a striking poster that definitely gives the chills to everyone. The upcoming film features a talented ensemble cast that includes Vimala Raman, Muralidaran, Saras Menon, National Award Winning actor Udhaya Deep, and Simran Pareek in pivotal roles.

The movie is produced by BVSN Prasad of Sri Venkateswara Cine Chitra (SVCC), presented by Bapineedu B, and co-produced by Praveen Daniel. The music is being composed by Vijay Siddharth, the cinematography is being handled by Edwin Sakay, and Venkat Raajen is overseeing the editing work.

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై వెర్స‌టైల్ యాక్ట‌ర్ వ‌సంత్ ర‌వి హీరోగా రూపొందుతోన్న సైక‌లాజిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘అశ్విన్స్’.. ఫస్ట్ లుక్ రిలజ్ చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైెరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్

తరమణి (2017), రాకీ (2021) వంటి చిత్రాల్లో అద్భుతంగా న‌టించి వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా మెప్పించిన వ‌సంత్ ర‌వి లేటెస్ట్ మూవీ ‘అశ్విన్స్’. ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర (ఎస్‌.వి.సి.సి) అధినేతే, సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్.. బి.బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో ‘అశ్విన్స్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ డేనియల్ ఈ చిత్రానికి సహ నిర్మాత.

సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ జోనర్ మూవీ ‘అశ్విన్స్’ని ఉల్ఫ్స్ బ‌ర్గ్స్‌, జర్మీనీలో ఉన్న మ‌న ఇండియ‌న్ డైరెక్టర్ త‌రుణ్ తేజ తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే రైటర్, ఫిల్మ్ మేకర్‌గా త‌రుణ్ తేజ యూర‌ప్‌లోని ప‌లు యూర‌ప్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌, ఇండిపెండెంట్ ఫిల్మ్ క‌మ్యూనిటీల్లో, త‌న షార్ట్ ఫిలింస్ ద్వారా అంతర్జాతీయ స్తాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు. గురువారం రోజున ‘అశ్విన్స్‌’ మూవీ ఫస్ట్ లుక్ బ్లాక్ బ‌స్ట‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద్రన్ రిలీజ్ చేశారు.

ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన 20 నిమిషాల పైల‌ట్ ఫిల్మ్ ఆధారంగా ‘అశ్విన్స్’ను రూపొందించారు డైరెక్ట‌ర్ త‌రుణ్ తేజ‌. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌. చీక‌టి ప్ర‌పంచం నుంచి మాన‌వుల‌కు చెడును చేసే 1500 ఏళ్ల నాటి శాపం. దీని కార‌ణంగా అమాయ‌కులైన కొంత మంది యూ ట్యూబ‌ర్స్ బ‌ల‌మైపోతుంటారు.

వసంత్ రవితో పాటు విమలా రామన్, మురళీ ధరన్ (నంబీ ఎఫెక్ట్ ఫేమ్‌), సార‌స్ మీన‌న్‌, ఉద‌య దీప్ (‘నిలా కాల‌మ్‌’తో జాతీయ ఉత్త‌మ న‌టుడు అవార్డ్ విన్న‌ర్‌), సిమ్రాన్ ప‌రీక్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ సిద్ధార్థ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎడ్విన్ సాకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వెంక‌ట్ రాజీన్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

నటీనటులు:
వ‌సంత్ ర‌వి, విమ‌లా రామ‌న్, ముర‌ళీధ‌ర‌న్‌, సార‌స్ మీన‌న్‌, ఉద‌య దీప్‌, సిమ్రాన్ ప‌రీక్‌

సాంకేతిక నిపుణులు:
స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు.బి
బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర (ఎస్‌.వి.సి.సి)
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
స‌హ నిర్మాత‌: ప్ర‌వీణ్ డేనియ‌ల్‌
ద‌ర్శ‌క‌త్వం: త‌రుణ్ తేజ‌
సంగీతం: విజ‌య్ సిద్ధార్థ్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎడ్విన్ సాకే
ఎడిట‌ర్‌: వెంక‌ట్ రాజీన్‌

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved