Aswini Dutt tribute to Singeetham
సింగీతం శ్రీనివాసరావు గారు మరణం లేని మహనీయుడు. 'సింగ్ గీతం' వైజయంతీ పతాకం మీద శాశ్వతంగా వెలుగుతూనే ఉంటుంది: అశ్వినీదత్
దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మరణం పట్ల ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం శ్రీనివాసరావు గారి మృతికి సంతాపం తెలియజేస్తూ భావోద్వేగంతో నివాళులు అర్పించారు.
''తెలుగు సినిమాకే వెలుగులు పంచిన విజయా సంస్థ దర్శక వారసుడు సింగీతం శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయారు. గుండె కలచివేసింది. కళ్ళు చెమర్చాయి. కళాఖండాలను రూపొందించినా, నిరాడంబరుడిగానే చివరివరకూ మసలిన దార్శనిక ముని ఆయన.
ఒకప్పుడు ఆయనతో చేద్దామనుకున్నా కథ కలిసి రాలేదు. కానీ నా కల ఆగిపోలేదు. 'సింగ్ గీతం' రూపంలో వైజయంతీ పతాకం మీద శాశ్వతంగా వెలుగుతూనే ఉంటుంది.