"With the honor of the National Awards, we’ll take on good films with even greater responsibility": Baby team
నేషనల్ అవార్డ్స్ ఇచ్చిన గౌరవంతో మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం - "బేబి" మూవీ టీమ్
At the prestigious 71st National Film Awards, the movie Baby was honored with two national awards. Sai Rajesh won for Best Screenplay, and PVNS Rohith received the Best Playback Singer award for the song Premistunna. In this context, the Baby team today held a press meet in Hyderabad. Members of the film unit joined to share their joy at winning national honors. During the event:
Editor Viplav said, "We’re delighted that Baby received two National Awards. This is Sai Rajesh’s second consecutive national award. Congratulations to Rohith and Sai Rajesh. During the shoot, Sai Rajesh told me ‘Baby has strong potential for a National Award. We must work diligently.’ The moment the National Awards were announced yesterday, his words came to mind. I’m happy to have been part of such a wonderful project."
Lyricist Suresh Banishetti, "Baby has won numerous awards. I hoped one of my songs might also receive recognition. So getting a National Award is immensely satisfying. I wrote five songs and two bit songs for this film. All the awards went to Sai Rajesh. I sincerely hope he wins an Oscar too."
Singer PVNS Rohith said, "Until Baby, my career wasn’t going as I’d hoped. My songs were often replaced by others. Nothing matched my expectations. When I was offered the chance to sing ‘Premistunna’ in Baby, I treated it as a do-or-die opportunity. Today, winning the Best Singer National Award is deeply gratifying. I thank our director Sai Rajesh, producer SKN, and music director Vijay Bulganin for trusting me with this opportunity.”
Heroine Vaishnavi Chaitanya said, "I’m very happy to have been part of Baby. Sai Rajesh proved that if you set a goal and work towards it, you will succeed. Even two years after its release, people are still talking about Baby - that’s the impact of Sai Rajesh’s creation. And SKN believed in the project deeply. While filming, all of us were in the same mood, listening to ‘Premistunna’. They even painted nearly 100 footsteps for the song. Just like the film, this song has also become etched in our hearts."
Producer SKN said, "When the National Awards were announced earlier, Telugu cinema didn’t receive many such honors. This year, nearly ten National Awards went to Tollywood - it’s a moment of pride for Telugu cinema. Congratulations to all the Telugu films, artists, and technicians who received national recognition. A tree, when nurtured, not only bears fruit but also provides timber to build homes. A good film brings not just money, but honor too. Baby has won Filmfare, SIIMA, GAMA, and many other awards - now adding National Awards makes us even happier. My friend Sai Rajesh believed in Baby. He polished the story over several years. That’s why this film connected with everyone. After Colour Photo, Baby earned him another National Award. And ‘Premistunnaa’ was beautifully sung by Rohith. We filmed the lyrical version for three days - when you shoot around a full song, it’s immersive. Rachmika Mandanna released it, and from there Baby began connecting with audiences. We had over a hundred premieres thanks to media support. Winning the National Award increases our responsibility to make even better films."
Hero Anand Devarakonda said, "The Baby team gave their all, so even after two years people still talk about the film. Seeing the ‘National Award Winner’ label on my movie poster feels like a dream come true. Sai Rajesh, following Color Photo, won another National Award for Baby. He is now respected as a director with two National Awards. For every film he does next, we’ll say it’s by a National Award–winning director. It’s a tremendous honor. SKN believed deeply in this film. The way the film was promoted became a classic example for many films. No matter which college we went to, even though we weren’t stars, the response to Baby was superb. SKN called it a cult blockbuster after the premieres. He wasn’t wrong - this film brought recognition to us all. We’re missing Viraj and Vijay Bulganin today. Thanks to everyone who supported us."
Producer Dheeraj Mogilineni said, "It’s wonderful for our whole team to be here today at the Baby event. Though I’ve produced many films in my career, Baby holds a special place. I thank SKN and Sai Rajesh for making me part of this project. This is Sai Rajesh’s second National Award, and I hope he wins even more. ‘Premistunna’ is a beloved song from Baby, and hearing it won a National Award made us very happy."
Director Sai Rajesh said, "I’m happy that the Baby team is all here today. When I wrote the script, I’d immerse myself in the mindset of Anand or Viraj. This story lived in my mind for two years, and I refined each scene. When I learned we’d won the National Award for Best Screenplay, I felt elated. Even more so, knowing that ‘Premistunna’ won the Best Singer Award made me proud. I told music director Vijay Bulganin that I wanted the song to be the last one composed - it’s melancholic in mood but played over happy scenes. Vijay chose to create this song first. When lyricist Banishetti read the line saying there’s another story within our story, I was inspired. When Rohith sang it, I just felt - it’s going to be a super hit. With that spark, I shaped Baby into a truly heartfelt film. Anand deeply felt the lyrical song during performance. I envisioned these shots in the film. Everyone in this project feels like a hero - they all gave their lives to it. Dheeraj D and SKN bridged the gaps for me. Vaishnavi deserves many more great films as a heroine. Anand’s look for his new film is very strong. The Best Screenplay Award should equally go to editor Viplav. When no one believed in me, SKN did. Thank you. And thanks to the media for all their support."
నేషనల్ అవార్డ్స్ ఇచ్చిన గౌరవంతో మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం - "బేబి" మూవీ టీమ్
ప్రతిష్టాత్మక 71 జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో "బేబి" మూవీ టీమ్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని జాతీయ అవార్డ్స్ పొందిన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో
ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ - "బేబి" సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడం సంతోషంగా ఉంది. సాయి రాజేశ్ గారికి వరుసగా రెండోసారి జాతీయ పురస్కారం వచ్చింది. రోహిత్, సాయి రాజేశ్ గారికి కంగ్రాట్స్ చెబుతున్నా. ఈ సినిమా చిత్రీకరణ టైమ్ లో సాయి రాజేశ్ గారు నాతో చెప్పారు "బేబి" సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చే స్కోప్ చాలా ఉంది. అంత బాగా మనం వర్క్ చేయాలి అనేవారు. నిన్న నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేయగానే ఆయన చెప్పిన మాటలే గుర్తొచ్చాయి. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. అన్నారు.
లిరిక్ రైటర్ సురేష్ బనిశెట్టి మాట్లాడుతూ - "బేబి" సినిమాకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. నా పాటకు కూడా ఏదైనా అవార్డ్ వస్తే బాగుండేది అనిపించింది. అలాంటిది నేషనల్ అవార్డ్ దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఐదు సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ రాశాను. సాయి రాజేశ్ గారికి అన్ని అవార్డ్స్ వచ్చాయి. ఆస్కార్ అవార్డ్ కూడా ఆయన గెల్చుకుంటారని కోరుకుంటున్నా. అన్నారు.
సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ మాట్లాడుతూ - ఈ సినిమాకు ముందు నేను ఆశించినట్లుగా కెరీర్ ఉండేది కాదు. నా పాటలు వేరే సింగర్స్ తో రీప్లేస్ అయ్యేవి. అనుకున్నది ఏదీ సరిగ్గా కలిసొచ్చేది కాదు. "బేబి" సినిమాలో ప్రేమిస్తున్నా పాట పాడే అవకాశం నాకు వచ్చినప్పుడు ఇది డూ ఆర్ డై అనేలా తీసుకున్నా. ఈ రోజు బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డ్ పొందడం చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సాయి రాజేశ్ గారికి, నిర్మాత ఎస్ కేఎన్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ గారికి థ్యాంక్స్. అన్నారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ - "బేబి" సినిమాలో నేనూ భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. మనం ఏదైనా గోల్ పెట్టుకుని ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతామని సాయి రాజేశ్ గారు ప్రూవ్ చేశారు. సినిమా రిలీజై రెండేళ్లు దాటినా ఇంకా బేబి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అంతా సాయి రాజేశ్ గారి క్రియేషన్ వల్లే. అలాగే ఎస్ కేఎన్ గారు ఈ ప్రాజెక్ట్ ను ఎంతో నమ్మి ప్రొడ్యూస్ చేశారు. ప్రేమిస్తున్నా పాట వింటూనే మేమంతా ఒక మూడ్ లో ఉండి సినిమా షూటింగ్ చేశాం. ఈ సినిమా కోసం దాదాపు 100 అడుగుల పెయింటింగ్ వేయించారు. "బేబి" సినిమాలాగే ఈ పాట కూడా మా మనసుల్లో ఉండిపోయింది. అన్నారు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ - నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తే ఒకప్పుడు మన తెలుగు సినిమాకుకు పురస్కారాలు కనిపించేవి కావు. ఈ ఏడాది దాదాపు పది నేషనల్ అవార్డ్స్ టాలీవుడ్ కు దక్కాయి. ఇది తెలుగు సినిమా గర్వించాల్సిన సందర్భం. నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న తెలుగు మూవీస్, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ అందిరకీ కంగ్రాంట్స్ చెబుతున్నాం. ఒక చెట్టు పెంచితే అది పండ్లు ఇవ్వడమే కాదు ఎండిపోయాక కూడా ఇళ్లు కట్టుకునేందుకు కలప ఇస్తుంది. అలా ఒక మంచి మూవీ చేస్తే అది మనకు డబ్బుతో పాటు గౌరవాన్ని కూడా ఇస్తుంది. బేబి సినిమా మాకు డబ్బుతో పాటు ఫిలింఫేర్, సైమా, గామా వంటి ఎన్నో పురస్కారాలు తీసుకొచ్చింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ దక్కడం మరింత హ్యాపీగా ఉంది. నా మిత్రుడు సాయి రాజేశ్ బేబి సినిమాను ఎంతో నమ్మాడు. కొన్నేళ్లు కథపై కసరత్తు చేశాడు. అందుకే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంది. సాయి రాజేశ్ కలర్ ఫొటో తర్వాత మళ్లీ బేబి సినిమాకు నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. ప్రేమిస్తున్నా పాటను రోహిత్ చాలా బాగా పాడాడు. ఈ పాట లిరికల్ సాంగ్ ను మూడు రోజులు చిత్రీకరించాం. మనం మూవీలో ఫుల్ సాంగ్ చేసే టైమ్ అది. రశ్మిక మందన్న ఈ పాటను రిలీజ్ చేశారు. అక్కడి నుంచి బేబి సినిమా ఆడియెన్స్ తో కనెక్ట్ కావడం ప్రారంభమైంది. వంద ప్రీమియర్స్ వేశామంటే అందుకు మీడియా సపోర్ట్ కారణం. నేషనల్ అవార్డ్ మాపై మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే బాధ్యత పెంచింది. అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - బేబి సినిమాకు టీమ్ మొత్తం ప్రాణం పెట్టి పనిచేశారు. అందుకే రెండేళ్లయినా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. నా సినిమా పోస్టర్ మీద నేషనల్ అవార్డ్ విన్నర్ అనే పేరు చూడటం కల నెరవేరిన ఫీలింగ్ కలిగిస్తోంది. డైరెక్టర్ సాయి రాజేశ్ గారు కలర్ ఫొటో తర్వాత మళ్లీ బేబి మూవీకి నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న డైరెక్టర్ గా గౌరవం పొందారు. ఆయన నెక్ట్స్ చేయబోయే ప్రతి సినిమాకు ఈ మూవీ చేస్తున్నది నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి. ఇది గొప్ప గౌరవం. బేబి సినిమాను ఎంతగానో నమ్మారు నిర్మాత ఎస్ కేఎన్. ఈ మూవీని ప్రమోషన్ చేసిన విధానం ఎన్నో సినిమాలకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అయ్యింది. మేము స్టార్స్ కాకున్నా బేబి సినిమా ప్రమోషన్ కు ఏ కాలేజ్ కు వెళ్లినా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చేది. బేబి మూవీని అద్భుతంగా మార్కెటింగ్ చేశారు. బేబి ప్రీమియర్స్ తర్వాత ఇది కల్ట్ బ్లాక్ బస్టర్ అని ఎస్ కేఎన్ అన్న మైక్ విసిరేశారు. ఆయన అన్నట్లే ఈ సినిమా మా అందరికీ పేరు తీసుకొచ్చింది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు దేశంలోనే పెద్ద అవార్డ్ నేషనల్ అవార్డ్ గెల్చుకోవడం ఆనందంగా ఉంది. బేబి సినిమా ఫస్ట్ క్లైమాక్స్ షూటింగ్ చేశాం. మాకు ఆ క్యారెక్టర్స్ ప్లే చేసే ఇన్సిపిరేషన్ ప్రేమిస్తున్నా పాటతో కలిగింది. ఈ పాట విన్న తర్వాత మేమంతా కథ మూడ్ లోకి వెళ్లిపోయి నటించాం. రోహిత్ టాలెంటెడ్ సింగర్. అతనికి సరైన గుర్తింపు దక్కింది. మా సినిమాటోగ్రాఫర్ బాల్ రెడ్డి ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అందంగా రూపొందించారు. ఈరోజు విరాజ్, విజయ్ బుల్గానిన్ ను మిస్ అవుతున్నాం. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - ఈ రోజు బేబి సినిమా ఈవెంట్ లో మా టీమ్ అందరితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది. నేను కెరీర్ లో ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసినా బేబి మూవీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ చిత్రంలో నేను భాగమయ్యేందుకు కారణమైన ఎస్ కేఎన్, సాయి రాజేశ్ గారికి థ్యాంక్స్. సాయి రాజేశ్ కు ఇది రెండో నేషనల్ అవార్డ్, మరిన్ని నేషనల్ అవార్డ్స్ ఆయన గెల్చుకోవాలని కోరుకుంటున్నా. ప్రేమిస్తున్నా సాంగ్ బేబి సినిమాలో చాలా మందికి ఇష్టమైన పాట. ఈ పాటకు నేషనల్ అవార్డ్ వచ్చిందని తెలిసినప్పుడు హ్యాపీగా ఫీలయ్యాం. అన్నారు
డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ - బేబి సినిమా టీమ్ అంతా ఈ రోజు ఇక్కడ మీట్ అవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ రాసేప్పడు ఒక మూడ్ లో ఉండిపోయేవాడిని. నేనే ఆనంద్ అయితే, విరాజ్ అయితే ఎలా ఉంటానో ఆ మూడ్ లో ఉండి స్క్రిప్ట్ రాశాను. రెండేళ్లు ఈ కథ నా మైండ్ లో ఉండిపోయింది. ప్రతి సీన్ ను బెటర్ చేసుకుంటూ స్క్రిప్ట్ చేశాను. స్క్రీన్ ప్లేకు నేషనల్ అవార్డ్ వచ్చిందని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా సాంగ్ కు బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డ్ వచ్చినందుకు ఆనందపడ్డాను. ఈ పాట లాస్ట్ లో కంపోజ్ చేద్దామని మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ తో చెప్పాను. ఈ పాట విషాధకరమై మూడ్ లో ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ లో వాళ్లు హ్యాపీగా ఉన్న మూవ్ మెంట్స్ ఉంటాయి. విజయ్ బుల్గానిన్ ఫస్ట్ ఈ సాంగ్ చేద్దామని మొదలుపెట్టాడు. సురేష్ బనిశెట్టి ప్రేమిస్తున్నా పాటలో మన కథలాంటి మరో కథ చరితలో ఉండదంటనే అని రాశాడు. ఈ లైన్ చదవగానే చాలా ఇన్స్ పైర్ అయ్యాను. రోహిత్ పాడిన పాట వినగానే ఈ సినిమా సూపర్ హిట్ అనే ఫీలింగ్ కలిగింది. ప్రేమిస్తున్నా పాట ఇచ్చిన స్ఫూర్తితో బేబి సినిమాను మరింత హార్ట్ టచింగ్ గా రూపొందించాను. ప్రేమిస్తున్నా లిరికల్ సాంగ్ లో ఆనంద్ ఎంతో ఫీల్ అయి నటించారు. ఆ షాట్స్ సినిమాలో ఉంటే బాగుండేది కదా అనిపించింది. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ హీరోనే. అంత ప్రాణం పెట్టి పనిచేశారు. ధీరజ్ నాకూ, ఎస్ కేఎన్ కు మధ్య వారధిలా ఉంటారు. వైష్ణవి హీరోయిన్ గా మరిన్ని మంచి మూవీస్ చేయాలి. ఆనంద్ కొత్త సినిమా లుక్ చాలా బాగుంది. బేబి సినిమాకు వచ్చిన బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ మా ఎడిటర్ విప్లవ్ గారికి కూడా చెందాలి. నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్ కేఎన్ నమ్మాడు. థ్యాంక్ యూ. మాకు ఎంతో సపోర్ట్ అందిస్తున్న మీడియాకు థ్యాంక్స్. అన్నారు