pizza

Srinivasa Rao Chintalapudi about Bad Boy Karthik
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. సినిమా తప్పకుండా అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది: నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి

You are at idlebrain.com > news today >

15 April 2026
Hyderabad

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

నిర్మాతగా మీ జర్నీ గురించి?
-ఆది సాయి కుమార్ ‘శశి’ సినిమాకు ఒక భాగస్వామిగా చేశాను. నిర్మాతగా బ్యాడ్ బాయ్ కార్తీక్ మా ఫస్ట్ సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. రిలీజ్ కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం.

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఎలా ఉండబోతుంది?
-ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. శౌర్య గారిని ఇప్పటివరకు లవర్ బాయ్ క్యారెక్టర్స్‌లో చూశారు. ఇందులో పూర్తిగా యాక్షన్ టోన్‌తో చూస్తారు.

-ఈ సినిమాలో టాప్ నాచ్ టెక్నీషియన్స్ పనిచేశారు. యానిమల్ సినిమాకు పనిచేసిన సుప్రీం సుందర్ గారు, అలాగే పృథ్వి గారు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా పనిచేశారు. హరీష్ జయరాజ్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. శోభి మాస్టర్, రాజు సుందరం గారు మంచి కొరియోగ్రఫీ చేశారు. సినిమాలో మంచి తారాగణం ఉంది. సముద్రఖని, నరేష్ గారు, సాయికుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, శ్రీదేవి విజయ్ కుమార్ చాలా మంచి పాత్రలు చేశారు.

శ్రీదేవి విజయ్ కుమార్ గారి గురించి?
-శ్రీదేవి విజయ్ కుమార్ గారి పాత్ర ఒక హైలెట్‌గా ఉండబోతుంది. ఆమె పాత్ర చాలా సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె చాలా బిజీ అవుతారు.

జీ స్టూడియోస్ గురించి?
-జీ స్టూడియోస్ వారు సినిమా మొత్తం చూసి ఓటిటి తీసుకుంటామని చెప్పారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తామని ముందుకు వచ్చారు. డిస్ట్రిబ్యూషన్ అనేది ఎంతో నమ్మకం ఉంటేనే చేస్తారు. వారు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని అడిగారు. దాదాపు 400కి పైగా స్క్రీన్లలో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం.

ఈ సినిమా తర్వాత శౌర్య గారికి మాస్ యాక్షన్ హీరో ఇమేజ్ వస్తుందని భావిస్తున్నారా?
-రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చేలా ఉంటుంది.
ఈ సినిమాకు బెస్ట్ బడ్జెట్ పెట్టాము. శౌర్య గారి కెరీర్‌లో హయ్యెస్ట్ బడ్జెట్‌తో సినిమా తీశాము. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. ఎక్కడా రాజీ పడకుండా తీశాము. సింహ, రెబల్ లాంటి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌కు రీ-రికార్డింగ్ చేసిన చిన్న గారు ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ది బెస్ట్ టెక్నికల్ వాల్యూస్‌తో పని చేశాం.

ప్రీ రిలీజ్‌లో చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు కదా కారణం?
-ఎన్నారైలు అంటే ఒక సినిమా చేసి వెళ్తారనే అభిప్రాయం ఉంటుంది. కానీ నా వరకు నేను ఏ విషయం అయినా ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాను. సినిమా నిర్మాణంలో అన్ని విషయాలు తెలుసుకున్నాము. నాకు సినిమాలంటే చాలా పాషన్. మేము రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాము. జూన్‌లో ఒక సినిమా స్టార్ట్ కాబోతోంది. మాది కంబైన్డ్ ఫ్యామిలీ. నిర్మాతలుగా మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు ఉంటాయి.

17న చాలా పోటీ ఉంది కదా?
-అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను. మా సినిమాకు కిరణ్ అబ్బవరం గారు బెస్ట్ విషెస్ చెప్పారు. ఆయన నిర్మాతగా తొలి సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా చాలా చక్కగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

-బ్యాడ్ బాయ్ కార్తీక్‌ను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాము. నైజాంలో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తుంది. సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం.

కథ విన్నప్పుడు, ఫస్ట్ కాపీ చూసినప్పుడు మీ స్పందన ఏమిటి?
-ఈ సినిమా విషయంలో కొన్ని మార్పులు జరిగాయి. డైరెక్టర్ మారారు. మొదట చేసిన దాంట్లో మూల కథను తీసుకున్నాం. తర్వాత లక్ష్మీ భూపాల గారు కొంత వర్క్ చేశారు. కథ అదే అయినా ట్రీట్‌మెంట్ మారింది. రసూల్ ఎల్లోరా గారి విజువలైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. థియేటర్లలో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందరూ సినిమాను ఇష్టపడతారని కోరుకుంటున్నాను.

-సినిమా చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. సినిమా తొలి 15 నిమిషాల నుంచి చివరి వరకు ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి యాక్షన్ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మరో స్థాయిలో ఉంటుంది. దాదాపు 5 యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. కదిరి నరసింహస్వామి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఇప్పటివరకు సినిమా అందరూ చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. సినిమా చాలా రిచ్‌గా ఉంటుంది. అందరికీ కనెక్ట్ అవుతుంది.

ఇది మీ ఫస్ట్ సినిమా కదా నిర్మాతగా అనుభవం గురించి?
చాలా విషయాలు నేర్చుకున్నాను. 24 క్రాఫ్ట్స్‌లో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకున్నాను.

మీ నుంచి రాబోయే సినిమాల గురించి?
జూన్‌లో ఒక సినిమా స్టార్ట్ కాబోతోంది. అలాగే ఇంకో సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుంది. చిన్న, మీడియం సినిమాలు చర్చలో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తాం.

బ్యాడ్ బాయ్ కార్తీక్ ఆడియన్స్‌కు ఏం చెబుతారు?
బ్యాడ్ బాయ్ కార్తీక్‌లో చాలా మంచి విజువలైజేషన్ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. శౌర్య గారు అందరినీ సర్‌ప్రైజ్ చేస్తారు.

కిషోర్ గారి కామెడీ అందరికీ ఆకట్టుకుంటుంది. ఇది ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా వున్నాయి. తెలుగుతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశాలో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved