pizza

‘Baahubali – The Epic’ Set for Re-Release Combining Both Parts…
రెండు భాగాలూ కలిపి ఒకే సినిమాగా రాబోతున్న బాహుబలి - ది ఎపిక్

You are at idlebrain.com > news today >

10 July 2025
Hyderabad

The iconic Baahubali film, which hoisted the flag of Telugu cinema on the global stage, marks the completion of its ten-year journey today. On this occasion, director S.S. Rajamouli took to Twitter to share exciting news with fans.

That news is the announcement of ‘Baahubali – The Epic’, a re-release that combines Baahubali: The Beginning and Baahubali 2: The Conclusion into a single cinematic experience.

The film is set for a worldwide release on October 31, 2025. However, whether the makers plan to present both parts in their original full length or edit them into one seamless narrative with a new cut — is something audiences will have to wait until October 31, 2025, to find out.

రెండు భాగాలూ కలిపి ఒకే సినిమాగా రాబోతున్న బాహుబలి - ది ఎపిక్

ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమా పతాకాన్ని ఎగురవేసిన సినిమా 'బాహుబలి', తన పదేళ్ల ప్రస్థానాన్ని అతి కొన్ని రోజులో పూర్తిచేసుకోబోతుంది. ఆ చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ అభిమానులకు మరో శుభవార్త కూడా చెప్పారు. దాని పేరే 'బాహుబలి-ది ఎపిక్'. బాహుబలి 1 మరియు బాహుబలి 2 ల కలయికే ఈ 'బాహుబలి-ది ఎపిక్'. రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాలా మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 31, 2025 తేదీన ప్రపంచ వ్యాప్తంగా మరోమారు సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతుంది బాహుబలి- ది ఎపిక్. రెండు భాగాల్లోనూ ఉన్న మొత్తం నిడివిని కలిపి ఒక సినిమాగా కలిపి చూపిస్తారా, లేదా నిడివిని ఒక సినిమా రూపంలో కుదించి, ఒకే కథలా మలిచి చూపిస్తారా అన్న సంగతి తెలియాలంటే ఈ ఏడాది అక్టోబర్ 31 వరకూ ఎదురుచూడాల్సిందే.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved