pizza

"Good Films Will Always Find Their Space, and Audiences Will Support Them" – Director Chidambaram at the Success Meet of Balan: The Boy
మంచి సినిమాకు ఎప్పుడూ స్పేస్ ఉంటుంది, ప్రేక్షకులు ఆదరిస్తారు అని "బాలన్ - ది బాయ్" సినిమా మరోసారి ప్రూవ్ చేసింది - మూవీ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ చిదంబరం

You are at idlebrain.com > news today >

20 June 2026
Hyderabad

Balan: The Boy, jointly produced by KVN Productions and Thespian Films, has emerged as a successful venture. The film is directed by Chidambaram, the filmmaker behind the acclaimed Manjummel Boys, and is based on a script written by Aavesham fame Jithu Madhavan. The movie is produced by Venkat K. Narayana and Shailaja Desai Fenn.

Released recently in Hindi, Malayalam, Telugu, Kannada, and Tamil, the film has received an excellent response from audiences and achieved notable success. Annapurna Studios distributed the film across the Telugu states. To celebrate the film’s successful theatrical run, the team organized a Success Meet in Hyderabad.

Speaking at the event, producer Shailaja Desai Fenn said, “Balan: The Boy is the first production from Thespian Films, which has collaborated with KVN Productions on this project. Although this was our first attempt as producers, director Chidambaram placed his trust in us. Our production house was established thanks to the encouragement and support of both Chidambaram and director Priyadarshan. We are also producing a Hindi film titled Haiwaan, directed by Priyadarshan. Venkat from KVN Productions extended immense support throughout this journey. He believed in our passion and stood by us every step of the way. I sincerely thank him for that.”

Child artist Muhammad Zinan said, “I would like to thank everyone who watched and encouraged our film. We hope audiences continue to support us. Balan – The Boy offers a unique cinematic experience, and I urge everyone to watch it in theatres.”

Actor Jean Paul Lal said, “Balan – The Boy has already achieved great success in Malayalam. We hope Telugu audiences will embrace it with the same enthusiasm. It is a wonderful film, and I feel fortunate to have been a part of it. I am grateful to our director and producers.”

Child artist Adhiseshan said, “I am very happy to have played an important role in this film. I thank director Chidambaram for giving me this opportunity. Everyone who has watched the movie has been appreciating it immensely. I hope more audiences come forward and support our film.”

Actress Farzana Palathingal said, “Thank you to everyone who came here to support our film. We are eagerly looking forward to hearing the audience’s feedback. The character I portrayed has been receiving a very positive response. The moment I heard the script, I was delighted that my debut film offered me such a strong role. I did not need any special preparation because the script itself had tremendous strength. Telugu audiences have always encouraged quality cinema, and we are confident they will support a unique film like Balan – The Boy.”

Director Chidambaram said, “Telugu audiences truly enjoy and celebrate cinema. For them, the language of a film is never a barrier. If the content is good, they wholeheartedly support it. The immense love you showed for Manjummel Boys gave us the confidence to bring a different concept film like Balan – The Boy to you. We believe you will make it a success as well. Good films will always find their space, and audiences will support them. This film has once again proved that.

Jithu and I developed this story based on several real-life experiences we witnessed. Many people like the characters portrayed in our film exist in the world around us, but we often fail to notice them. I would love to direct films in both Telugu and Tamil. I have great admiration for the Telugu film industry, and discussions are already underway for a Telugu project. As a filmmaker, I value the trust audiences place in me, and I will continue making films that live up to that trust.

I would also like to thank Annapurna Studios for distributing our film and Naga Chaitanya for promoting it. The story itself inspired me and motivated the entire team to work with passion and dedication. I believe the story is the film’s greatest strength.”

Cast: Adhiseshan, Farzana Palathingal, Muhammad Zinan, Tovino Thomas, Girish A.D., Jean Paul Lal, and others.

Technical Crew:
Editor: Vivek Harshan
Director of Photography: Shyju Khalid
Music: Sushin Shyam
Writer: Jithu Madhavan
Producers: Venkat K. Narayana, Shailaja Desai Fenn
Director: Chidambaram

మంచి సినిమాకు ఎప్పుడూ స్పేస్ ఉంటుంది, ప్రేక్షకులు ఆదరిస్తారు అని "బాలన్ - ది బాయ్" సినిమా మరోసారి ప్రూవ్ చేసింది - మూవీ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ చిదంబరం

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ "బాలన్ - ది బాయ్". ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో "మంజుమ్మెల్ బాయ్స్" చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహించారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇటీవలే ఈ సినిమా హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. "బాలన్ - ది బాయ్" సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్ శైలజా దేశాయి ఫెన్ మాట్లాడుతూ - కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. తేస్పియన్ ఫిలింస్ లో మొదటి చిత్రమిది. నిర్మాతలుగా మాకు తొలి ప్రయత్నమైనా మమ్మల్ని డైరెక్టర్ చిదంబరం నమ్మారు. చిదంబరంతో పాటు డైరెక్టర్ ప్రియదర్శన్ వల్లే మా తెస్పియన్ ఫిలింస్ సంస్థ ఏర్పాటైంది. ఈ చిత్రంతో పాటు మేము హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో హైవాన్ అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాము. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి ప్రొడ్యూసర్ వెంకట్ మాకు పూర్తి సహకారం అందించారు. మమ్మల్ని మా ప్యాషన్ ను నమ్మి వెన్నంటి నిలబడ్డారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాను. అన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ ముహమ్మద్ జినాన్ మాట్లాడుతూ - "బాలన్ - ది బాయ్" సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా సినిమాపై ఇలాగే మీ ఆదరణ కొనసాగుతుందని నమ్ముతున్నాం. ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఒక యూనిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా థియేటర్స్ లో చూడాలని కోరుతున్నా. అన్నారు.

యాక్టర్ జీన్ పాల్ లాల్ మాట్లాడుతూ - "బాలన్ - ది బాయ్" సినిమా మలయాళంలో మంచి విజయాన్ని సాధించింది. తెలుగులోనూ మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇదొక గొప్ప చిత్రం. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్స్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ ఆదిశేషన్ మాట్లాడుతూ - "బాలన్ - ది బాయ్" సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మా డైరెక్టర్ చిదంబరం గారికి థ్యాంక్స్. మా చిత్రాన్ని చూసిన వారంతా చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు కూడా మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్ట్రెస్ ఫర్జాన పాలతింగల్ మాట్లాడుతూ - మా మూవీని సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీరు మా సినిమా చూసి, ఇచ్చే ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ చిత్రంలో నేను చేసిన క్యారెక్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే నా ఫస్ట్ మూవీలో ఇలాంటి మంచి క్యారెక్టర్ వచ్చిందని సంతోషించాను. ఈ సినిమా కోసం నేను ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం రాలేదు. ఆ స్క్రిప్ట్ లోనే ఆ స్ట్రెంత్ ఉంది. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ గుడ్ మూవీస్ ను ఎంకరేజ్ చేస్తుంటారు. బాలన్ ది బాయ్ వంటి ఒక సరికొత్త తరహా చిత్రాన్ని మీరు విజయవంతం చేస్తారని నమ్ముతున్నాం. అన్నారు.

డైరెక్టర్ చిదంబరం మాట్లాడుతూ - తెలుగు ఆడియెన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తారు. సెలబ్రేట్ చేస్తారు. వారికి ఏ భాష సినిమా అనేది ఇంపార్టెంట్ కాదు. మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారు. అలాగే మా మంజుమ్మెల్ బాయ్స్ సినిమాపై మీరు ఎంతో ప్రేమ చూపించారు. ఇప్పుడు ఆ నమ్మకంతోనే బాలన్ ది బాయ్ వంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని మీ ముందుకు తీసుకొచ్చాం. మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. మంచి సినిమాలకు ఎప్పుడూ స్పేస్ ఉంటుంది, ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ విషయాన్ని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. నేను, జీతు చూసిన అనేక రియల్ లైఫ్స్ ఆధారంగా ఈ కథను రెడీ చేశాం. మా సినిమాలో చూపించినటువంటి వాళ్లు ఎంతోమంది ఈ ప్రపంచంలో ఉన్నారు. కానీ మనం వారిని చూడలేకపోతున్నాం. నేను తెలుగుతో పాటు తమిళంలో సినిమా చేయాలి. నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఇష్టం. తెలుగులో ఒక మూవీ చర్చల దశలో ఉంది. దర్శకుడిగా నాపై ప్రేక్షకులు ఒక నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని కాపాడేలా సినిమాలు రూపొందిస్తాను. మా మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన అన్నపూర్ణ సంస్థకు, ప్రమోట్ చేసిన నాగ చైతన్యకు థ్యాంక్స్. ఈ స్టోరీనే నన్ను ఇన్స్ పైర్ చేసింది. టీమ్ అంతా ఒక్కటిగా ప్యాషనేట్ గా పనిచేసేలా చేసింది. మా సినిమాకు స్టోరీనే పెద్ద స్ట్రెంత్ అని భావిస్తున్నా. అన్నారు.

నటీనటులు - ఆదిశేషన్, ఫర్జానా పాలతింగల్, ముహమ్మద్ జినాన్, టొవినో థామస్, గిరీష్ ఎ.డి., జీన్ పాల్ లాల్, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ - వివేక్ హర్షన్
డీపీవో - షైజు ఖాలిద్
మ్యూజిక్ - సుషిన్ శ్యామ్
పీఆర్ఓ - సురేష్ ( ఎస్ కె మీడియా )
రచన - జితూ మాధవన్
నిర్మాతలు - వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్
దర్శకత్వం - చిదంబరం

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved