pizza

Kona Film Corporation's Band Melam Second Single "Pallelloni Sandhallanni Meeve" out now; Releasing worldwide on March 13th, 2026
కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించిన ‘బ్యాండ్ మేళం’ నుంచి సెకండ్ సింగిల్ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ రిలీజ్.. మార్చి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా మూవీ గ్రాండ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

28 February 2026
Hyderabad

The young and talented Harsh Roshan won everyone’s appreciation for Court. The gorgeous Sridevi Apalla also impressed audiences. Now, this stunning Court duo is all set to enchant once again with a beautiful love story. Blockbuster writer Kona Venkat brings this much-awaited combo together. The film is bankrolled under the Kona Film Corporation banner, with Kavya and Shrvaya producing. The film is hitting theatres on March 13th, 2026.

The film is titled Band Melam, with the tagline “Every Beat Has an Emotion.” The recently released teaser raised curiosity. After beginning the musical promotions with a peppy chartbuster titled Thippukuntannav, today makers unveiled second single Pallelloni Sandhallanni Meeve. This beautiful melody with a groovy vibe was launched by Mass Maharaja Raviteja. The actor extended his best wishes to the entire team.

Vijai Bulganin proves once again why he is a master at composing beautiful songs. Pallelloni Sandhallanni Meeve truly connects with every heart. The magical tune and meaningful lyrics by Oscar-winning lyricist Chandrabose add immense value to the song. The song is energetically sung by Shwetha Mohan, complementing the tune perfectly.

The track beautifully showcases moments from Giri and Raji’s school and childhood life. Harsh Roshan and Sridevi share enchanting chemistry, and their graceful moves are a visual treat. Their energy, chemistry, and charm are off the charts. Suneel Sunnapu and Phalguni Bangera choreographed perfect steps that match the groovy vibe and their styles.

Sivaraju Pranav co-producing the film. Mango Mass Media is presenting the film. Satish Javvaji is helming this soulful tale that celebrates music, love, and emotions. Oscar-winning lyricist Chandrabose is penning the lyrics. Siva Mupparaju is handling the editing and also wrote the screenplay. Satish Mutyala is in charge of cinematography. Versatile actor Saikumar plays a key role in the film.

With a brilliant technical crew and a top-notch team, the film promises a rooted love story filled with music, emotions, and cultural richness.

Cast: Roshan, Sridevi, Sai Kumar & Others.

Technical Crew:
A Kona Venkat Production
Banner: Kona Film Corporation
Presented by Mango Mass Media
Producers: Kavya & Shravya
Co-Producer: Sivaraju Pranav
Writer & Director: Sathish Javvaji
Music: Vijai Bulganin
Screenplay and Editing: Siva Mupparaju
DOP: Satish Mutyala
Lyricist: Chadrabose
Art Director: Narni Srinivas

కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించిన ‘బ్యాండ్ మేళం’ నుంచి సెకండ్ సింగిల్ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ రిలీజ్.. మార్చి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా మూవీ గ్రాండ్ రిలీజ్

‘కోర్ట్’ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 13న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

‘బ్యాండ్ మేళం’ టీజర్, ‘తిప్పూ కుంటానవ్’ అనే పాట ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ అంటూ సాగే మెలోడీ పాటను మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. పాటను రిలీజ్ చేసిన అనంతరం రవితేజ ‘బ్యాండ్ మేళం’ టీంకి బెస్ట్ విషెస్‌ను తెలియజేశారు.

‘పల్లెలోని సందల్లన్ని మీవే’ అంటూ సాగే ఈ బ్యూటీఫుల్ మెలోడీ పాటకు విజయ్ బుల్గానిన్ ఎంతో క్యాచీ ట్యూన్‌ను అందించారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న గీత రచయిత చంద్రబోస్ సాహిత్యం ఎంతో అర్థవంతంగా ఉంది. ఈ పాటను శ్వేతా మోహన్ ఆలపించారు. లిరికల్ వీడియోని చూస్తుంటే.. గిరి, రాజిల స్కూల్, చైల్డ్ మోమరీస్‌కు సంబంధించినట్టుగా కనిపిస్తోంది. హర్ష్ రోషన్, శ్రీదేవి స్కూల్ యూనిఫాంలో కనిపించడం, స్కూల్లో చేసిన అల్లరి పనులు, కంపోజ్ చేసిన స్టెప్పులు, పాటను చిత్రీకరించిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేసేలా ఉంది. సునీల్ సున్నాపు, ఫాల్గుణి బంగేరా కంపోజ్ చేసిన హుక్ స్టెప్పులు నెట్టింట్లో వైరల్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

శివరాజు ప్రణవ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. శివ ముప్పరాజు ఎడిటింగ్, స్క్రీన్ ప్లే బాధ్యతల్ని నిర్వర్తించారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఇక ఈ మూవీలో సాయికుమార్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాను మార్చి 13న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.

తారాగణం: రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
కోన వెంకట్ ప్రొడక్షన్
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్
సమర్పణ : మ్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు: కావ్య, శ్రావ్య
సహ నిర్మాత: శివరాజు ప్రణవ్
రచయిత, దర్శకుడు: సతీష్ జవ్వాజి
సంగీతం: విజయ్ బుల్గానిన్
స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు
DOP: సతీష్ ముత్యాల
గీత రచయిత: చద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్: నార్ని శ్రీనివాస్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved