Band Melam Thank You Meet
ప్రేక్షకుల వల్లే ‘బ్యాండ్ మేళం’ ఇంత పెద్ద విజయం సాధించింది.. జాయ్ ఫుల్ బ్లాక్ బస్టర్ థాంక్యూ మీట్‌లో స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్
హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘బ్యాండ్ మేళం’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమాకి మంచి విజయం దక్కింది. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 26న విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు బ్యాండ్ మేళం జాయ్ ఫుల్ బ్లాక్ బస్టర్ థాంక్యూ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘చెన్నై బీచ్‌లో ఓ సారి కాళ్లు, చేతులు లేని ఓ అమ్మాయి బెలూన్స్ అమ్ముకుంటూ కనిపించింది. ఆ టైంలో నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. అలాంటప్పుడే ఆ అమ్మాయిని చూశాను. కాళ్లు,చేతులు లేకపోయినా, రేపటి భవిష్యత్తు ఏంటో తెలియక పోయినా ఆ అమ్మాయి హాయిగా బతికేస్తోంది.. నేను ఎందుకు చనిపోవాలి? అని అనుకున్నాను. ఆ తరువాత రైటర్‌గా మారి ఎన్నో సినిమాలు రాశాను. నిర్మాతగా ఎంతో మందిని పరిచయం చేశాను. ఇదంతా కూడా ఆ అమ్మాయి వల్లే సాధ్యమైంది. పది మందిలో ఒకరికి నచ్చకపోవచ్చు. ఆ ఒక్కరి గురించి పట్టించుకోవద్దని టీంకు చెప్పాను. ఎన్నో కష్టాలు దాటుకుని ‘బ్యాండ్ మేళం’ హిట్టుగా నిలిచింది. ప్రేక్షకుల వల్లే ‘బ్యాండ్ మేళం’ ఇంత పెద్ద విజయం సాధించింది. థియేటర్లోకి వెళ్లినప్పుడు ఆడియెన్స్ మొహంలో ఓ సంతృప్తిని చూశాను. రోషన్, శ్రీదేవీ ఇలా ఎంతో మంది లైఫ్ ఈ చిత్రంతో ముడి పడి ఉంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సూరత్‌లో కూడా మన సినిమాని ఏసియన్, సురేష్ గారు రిలీజ్ చేశారు. నేను వారిని నమ్మే ఈ చిత్రాన్ని వారి చేతిలో పెట్టాను. మా ప్రమోషన్స్ కోసం వచ్చిన వినాయక్, విజయేంద్ర ప్రసాద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, చిరంజీవి గారు ఇలా అందరికీ థాంక్స్. ఎడిటర్ శివ ఈ మూవీ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. రోషన్, శ్రీదేవీ క్లైమాక్స్‌లో కంటతడి పెట్టించేశారు. ఈ సినిమాలోని ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ ఇకపై ఆడిషన్స్ అవసరం లేదు.. ‘బ్యాండ్ మేళం’ విజిటింగ్ కార్డ్‌లా ఉంటుంది. ఈ మూవీని మరాఠీలోనూ రిలీజ్ చేయబోతోన్నాం. మరి కొంత షూటింగ్ చేసిన తరువాత అక్టోబర్ 16న మరాఠీలో సినిమాని విడుదల చేస్తాం. ఆడియెన్స్ పర్‌ఫెక్ట్ జాబ్ చేశారు. అందుకే సినిమా హిట్ అయింది. అందుకే ఆడియెన్స్‌కి థాంక్స్ చెప్పాలని ఈవెంట్ పెట్టాం. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. నేను నిర్మాతగా చేసిన అన్ని చిత్రాల్లోకెల్లా టాప్ 3లో ‘బ్యాండ్ మేళం’ ఉంటుంది’ అని అన్నారు.
బీవీఎస్ రవి మాట్లాడుతూ .. ‘కోన వెంకట్ గారు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ‘బ్యాండ్ మేళం’ బాగుంది కాబట్టే విజయం సాధించింది. సినిమా బాగోలేకపోతే జనాలు చూడరు. సతీష్ జవ్వాజి ‘బ్యాండ్ మేళం’ మూవీని చక్కగా తీశారు. ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోదభరితంగా తీశారు. క్లైమాక్స్ ట్విస్ట్ అద్భుతంగా ఉంది. రోషన్ గొప్ప నటుడు అవుతాడు. శ్రీదేవీ బాపు గారి బొమ్మలా ఉంది. చాలా సీన్లలో ఆమె కళ్లతోనే నటించింది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ బాగా నటించింది. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సతీష్ ముత్యాల గారు గొప్ప కెమెరామెన్. ఎడిటర్ శివ త్వరలోనే డైరెక్టర్ కానున్నాడు. కోన వెంకట్ గారు లేకపోతే మాకు పూట గడవదు. ఆయనతో మేం ప్రతీ రోజూ సినిమాల గురించి, కథా చర్చల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ‘బ్యాండ్ మేళం’ చిత్రం ఇంత పెద్ద హిట్టైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.
హర్ష్ రోషన్ మాట్లాడుతూ .. ‘కోన వెంకట్ గారు ‘బ్యాండ్ మేళం’ కోసం చాలా కష్టపడ్డారు. మా వెన్నంటే ఉండి నడిపించారు. మా సినిమాని ఆడియెన్స్ వద్దకు తీసుకు వెళ్లిన సురేష్ బాబు గారికి థాంక్స్. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. విజయ్ బుల్గానిన్ అన్న మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సతీష్ ముత్యాల గారు ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చూపించారు. ప్రేక్షకుల వల్లే మేం ఈ స్థాయిలో ఉన్నాం. మా సినిమాని చూసి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్’ అని అన్నారు.
శ్రీదేవీ మాట్లాడుతూ .. ‘కోన వెంకట్ గారు ‘బ్యాండ్ మేళం’ కోసం ప్రతీ క్షణం తపన పడ్డారు. ప్రతీ చోటా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
డైరెక్టర్ సతీష్ జవ్వాజి మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన నా డైరెక్షన్ టీంకి థాంక్స్. మా ఎడిటర్ శివ ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. నార్మల్ ఆడియెన్స్ కోసం ఈ మూవీని తీశాను. వంద మంది మూవీని చూస్తే పది మందికి మాత్రం నచ్చలేదు. ఆడియెన్స్‌తో పాటుగా సినిమా చూసి రివ్యూలు రాయాలని కోరుకుంటున్నాను. బెక్కెం వేణుగోపాల్ గారి వల్లే కోన వెంకట్ గారి వద్దకు కథను తీసుకెళ్లగలిగాను. రోషన్ గొప్ప యాక్టర్. క్లైమాక్స్‌కి చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయితే కచ్చితంగా రిగ్రేట్ ఫీల్ అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కోన వెంకట్ గారికి ఎప్పుడూ రుణ పడి ఉంటాను’ అని అన్నారు.
బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ థాంక్యూ మీట్‌కి రావడం ఆనందంగా ఉంది. కోన గారికి ఎన్నో విజయాలు వచ్చాయి. ‘బ్యాండ్ మేళం’తో ఆయనకు మరింత మంచి సక్సెస్ రావడం సంతోషంగా ఉంది. రోషన్, శ్రీదేవీలకు మళ్లీ మరొక విజయం దక్కింది.సతీష్ చెప్పిన ఈ కథ నాకెంతో నచ్చింది. ఆ తరువాత కోన గారి వద్దకు తీసుకు వెళ్లాం. అక్కడి నుంచి ఇక్కడి వరకు సినిమా వచ్చింది. ఆడియెన్స్ ఈ మూవీని ఎంకరేజ్ చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో మంచి సక్సెస్ లభించింది’ అని అన్నారు.
కో ప్రొడ్యూసర్ శివరాజు ప్రణవ్ మాట్లాడుతూ .. ‘కోన వెంకట్‌తో కలిసి ‘బ్యాండ్ మేళం’ లాంటి సినిమాని తీయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని వెంకట్‌కి థాంక్స్. మా డీఓపీ సతీష్ ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతంగా తీశారు. డైరెక్టర్ సతీష్ గారు కథను ఎలా చెప్పారో.. అంతే అద్భుతంగా సినిమాని తీశారు. రోషన్, శ్రీదేవీ ఎంతో సహజంగా నటించారు. మాకు ఈ సక్సెస్‌ను ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉంది. రోషన్, శ్రీదేవీకి మళ్లీ హిట్టు వచ్చింది. విజయ్ బుల్గానిన్ మాకు మంచి పాటల్ని ఇచ్చారు. ఈ మూవీ సక్సెస్ మీట్‌కు పిలిచినందుకు థాంక్స్’ అని అన్నారు.
ఎడిటర్ శివ మాట్లాడుతూ ..‘‘బ్యాండ్ మేళం’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సతీష్ నాకు 13 ఏళ్లుగా తెలుసు. గత మూడేళ్ల నుంచి ఈ మూవీ కోసం అతను కష్టపడ్డాడు. మా సినిమాకి మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
కొరియోగ్రాఫర్ వెంకటేష్ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’లో నాకు అవకాశం ఇచ్చిన కోన వెంకట్ గారికి థాంక్స్. కోన గారి ప్రొడక్షన్‌లో మళ్లీ ఓ సినిమాకి పని చేస్తున్నాను. ‘బ్యాండ్ మేళం’కి మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.