pizza

The film ‘Beauty’ beautifully blends love, emotions, and family values: VK Naresh at the Success Meet
‘బ్యూటీ’ అందరి మనసులకు హత్తుకునే చిత్రం.. సక్సెస్ మీట్‌లో సీనియర్ నటుడు వీకే నరేష్

You are at idlebrain.com > news today >

21 September 2025
Hyderabad

Produced by Vijaypal Reddy Adidhala and Umesh Kumar Bansal under the banners of A Maruthi Team Product, Vanara Celluloid, and Zee Studios, Beauty features Ankith Koyya, Nilakhi, VK Naresh, and Vasuki in lead roles. The story and screenplay were provided by RV Subrahmanyam, while JSS Vardhan directed the film. Released on September 19, the movie has turned out to be a blockbuster. To celebrate this success, the makers organized a grand success meet on Saturday.

While speaking at the event, VK Naresh said: "The soul of Beauty made us all speak from our hearts even during promotions, and today that very soul is connecting with audiences. Even before the release, I honored the director and producer, because I knew this film would be a blockbuster. I must have acted in over 350 movies, but never have I seen such outstanding reviews as this one has received. I’m even taking printouts of these reviews to keep with me. My heartfelt thanks to the media for embracing the film with such admiration. I have witnessed many highs and lows in my career, but this film is truly special to me. This story connects with everyone, across all walks of life. I feel proud seeing how Vardhan has crafted such a touching film. Subbu gave us a wonderful story. Sai Kumar’s cinematography is beautiful, and producer Vijaypal Reddy never compromised at any stage. He has withstood both success and failure in the same month, proving his resilience. Nilakhi delivered a stunning performance, and Ankith Koyya is sure to establish his mark in the industry. Vijay Bulganin gave us soulful music that elevated the film. My thanks to every single member of the audience who is supporting a film that beautifully blends love, emotions, and family values."

Ankith Koyya stated: "‘Beauty’ has reached everyone’s hearts. Watching people wipe their tears after the climax itself is our victory. From the very beginning, the media strongly supported us, taking our film to the audiences. Even my friends and celebrities who attended the private shows loved it so much that they began promoting it further. It’s not just enough to work; one must also speak and spread good words about the film. None of the films I’ve acted in have ever disappointed audiences, and the same stands true here — Ankith Koyya means minimum guarantee. If you make a film with honesty, success is certain. Even if stones are hurled at us, let’s build our house with them. Thank you to the audience for embracing us so warmly."

Director Vardhan expressed: "I thank the media wholeheartedly for supporting Beauty. The film is entertaining audiences everywhere. I have personally visited 15 theaters, and everywhere the response has been overwhelming. For those who haven’t watched yet, please go. At least one scene, somewhere, will connect deeply with you. The visuals crafted by Sai are stunning, and Vijay Bulganin’s music brought immense strength to the narration. Thanks to the audience for this immense support."

Producer Vijaypal Reddy said: "‘Beauty’ has already achieved commercial success. Every day I’m receiving calls filled with appreciation, people telling me this is a wonderful film that left them deeply moved. Both the media and the audience are showering immense love. This is more than just a film — this is life itself, a mirror to our own lives."

Actress Nilakhi said: "I sincerely thank the media and the audience for showing so much love towards Beauty. The appreciation I’m receiving for my role has been overwhelming, and I am grateful to everyone for their kind words."

Senior journalist Prabhu commented: "When good films like Beauty are released, media will always extend its support. The response has been overwhelmingly positive, and media will continue to encourage meaningful cinema like this."

Writer RV Subrahmanyam said: "Thanks to audiences and media for making Beauty a big success. During our theater visits, the response we witnessed was incredible. Demand for the show is continuously growing. Each character in the film is connecting with audiences, and especially women — they’re walking out of theaters with tears in their eyes."

Cinematographer Sai Kumar Dhara shared: "The entire team supported me greatly while making Beauty. Ankith acted brilliantly, and despite the language barrier, Nilakhi delivered a remarkable performance. Senior actors like Naresh and Vasuki were the strong pillars of our film. I am thankful to the director and producer for giving me this opportunity, and to the audience for showering their immense love."

‘బ్యూటీ’ అందరి మనసులకు హత్తుకునే చిత్రం.. సక్సెస్ మీట్‌లో సీనియర్ నటుడు వీకే నరేష్

అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

వీకే నరేష్ మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ మూవీలోని సోల్ మా అందరినీ ప్రమోషన్స్‌లో ఎక్కువ మాట్లాడించేసింది. ఆ సోల్ ఇప్పుడు ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతోంది. దర్శక, నిర్మాతలకు సినిమా రిలీజ్‌కంటే ముందే శాలువా కప్పేశాను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు ముందే తెలుసు. నా కెరీర్‌లో 350 మూవీలు చేసి ఉంటాను.. ఈ చిత్రానికి వచ్చిన రివ్యూలన్నీ కూడా ప్రింట్ అవుట్ తీసుకుంటున్నాను. ఇలాంటి రివ్యూలు నా జీవితంలో ఇంత వరకు రాలేదు. మా మూవీని ఇంత ఆదరించినా మీడియాకు థాంక్స్. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఈ మూవీ నాకు మాత్రం ఎంతో స్పెషల్. ప్రతీ ఒక్కరికీ, అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యే చిత్రమిది. అందరి మనసులకు హత్తుకునే మూవీని తీసిన వర్దన్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. సుబ్బు మంచి కథను ఇచ్చారు. సాయి కుమార్ కెమెరావర్క్ ఎంతో అందంగా అనిపించింది. విజయ్ పాల్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఒకే నెలలో సక్సెస్, ఫెయిల్యూర్ చూశాడు. నిండు కుండ తొకణదు అన్నట్టుగా నిర్మాత ఉన్నారు. నీలఖి అద్భుతంగా నటించారు. అంకిత్ కొయ్య ఇండస్ట్రీలో నిలిచిపోతాడు. విజయ్ బుల్గానిన్ మంచి సంగీతాన్ని అందించారు. లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అంశాలను జోడించిన ఈ మూవీని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

అంకిత్ కొయ్య మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ అందరికీ రీచ్ అయింది. క్లైమాక్స్ తరువాత అందరూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. అదే మా విజయం. ప్రీమియర్ల నుంచే మీడియా మాకు చాలా సపోర్ట్ చేసింది. మీడియానే భుజాన వేసుకుని ఆడియెన్స్ వరకు రీచ్ చేసింది. నా ఫ్రెండ్స్, సెలెబ్రిటీలకు షో వేస్తే.. వాళ్లకి నచ్చడంతో మరింతగా ప్రమోట్ చేశారు. మనం చేసే పని మాత్రమే కాదు.. మనం కూడా మాట్లాడాలి. నేను నటించిన ఏ మూవీ కూడా ఏ ఒక్కరినీ నిరాశపర్చలేదు. అంకిత్ కొయ్య అంటే మినిమం గ్యారెంటీ అనేది పక్కా. సినిమాను నిజాయితీగా తీస్తే సక్సెస్ అదే వస్తుంది. మన మీద ఎంత మంది రాళ్లు విసిరినా సరే వాటితోనే ఇల్లు కట్టుకుందాం. ఇంతలా మా మూవీని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

డైరెక్టర్ జె.ఎస్.ఎస్ వర్ధన్ మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ మూవీని సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. ‘బ్యూటీ’ ప్రతీ ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పటి వరకు 15 థియేటర్లను విజిట్ చేశాను. ప్రతీ ఒక్కరూ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చూడని వాళ్లంతా వెళ్లి చూడండి. ఏదో ఒక చోట.. ఎక్కడో ఓ సీన్‌కు ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారు. సాయి ఇచ్చిన విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ప్రధాన బలాన్ని ఇచ్చింది. ఇంతలా సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ ఆల్రెడీ కమర్షియల్‌గా సక్సెస్ అయింది. ప్రతీ ఒక్కరూ ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. అద్భుతమైన మూవీ అని, గుండె బరువెక్కిందని మాట్లాడుతున్నారు. మీడియా, ఆడియెన్స్ ఇలా అందరూ గొప్పగా ఆదరిస్తున్నారు. మన జీవితాల్ని చూపించే, ప్రతీకగా నిలిచే చిత్రమిది. ఇది కేవలం సినిమా కాదు.. జీవితం’ అని అన్నారు.

హీరోయిన్ నీలఖి మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ మూవీని ఇంతలా ఆదరిస్తున్న మీడియాకి, ప్రేక్షకులకు థాంక్స్. నా పాత్రపై ప్రశంసలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’లాంటి మంచి చిత్రాలు వచ్చినప్పుడు మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. మీడియా నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. మంచి చిత్రాల్ని ఎప్పుడూ మీడియా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది’ అని అన్నారు.

రైటర్ ఆర్.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ .. ‘మా ‘బ్యూటీ’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకు థాంక్స్. మేం థియేటర్ విజిట్‌కు వెళ్తుంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ రోజూ షోలకు డిమాండ్ పెరుగుతోంది. అందరూ అన్ని పాత్రలకు కనెక్ట్ అవుతున్నారు. మహిళలు అయితే సినిమా చూసిన తరువాత కంటతడి పెట్టుకుంటున్నారు’ అని అన్నారు.

కెమెరామెన్ సాయి కుమార్ ధారా మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ విషయంలో నాకు టీం చాలా సహకరించింది. అంకిత్ బాగా నటించాడు. భాష రాకపోయినా నీలఖి అద్భుతంగా నటించింది. నరేష్ గారు, వాసుకి గారు ఈ సినిమాకు ప్రధాన బలం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా మూవీని ఇంతగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved