‘Beauty’ is a Must-Watch Film for Today’s Generation in This Era of Social Media Where Relationships Are Fading – Team Beauty
బంధాలకు దూరమవుతున్న ఈ సోషల్ మీడియా యుగంలో నేటి జనరేషన్ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా 'బ్యూటీ' - 'బ్యూటీ' చిత్ర యూనిట్
As part of the promotions for Beauty, the film’s cast and crew gave an interview to Idlebrain Jeevi. Featuring senior actor Naresh and actress Vasuki Anand in key roles, the film stars Ankit Koyya and Neelakhi as the lead pair. Beauty is set to hit the screens on the 19th of this month.
Lead actor Ankit Koyya shared:
"In today’s world, social media and mobile phones have taken over. In the past, our desires were limited by where we lived. But now, family bonds are fading. People are constantly immersed in thoughts about what others are buying. A ‘family’ should be like a nest—providing protection to daughters and women. But sometimes, due to stubborn decisions, that protection is lost." He added that he enjoys cinema for what it is, and that while anyone can act in stories as a lead, becoming a true hero is something only the audience can grant you.
Actor VK Naresh said:
"It’s true that one needs luck to get opportunities in life, but knowing how to make the most of those opportunities is another skill altogether. I feel fortunate to receive roles specially written for me by young filmmakers—that recognition itself is my reward. My role in Beauty is a gem in my career. We are all living in some version of a false reality, and this film captures that beautifully. Personally, I always do what I love—I don’t look at others’ lives. That’s why I’m never afraid of anyone." He also revealed that he began acting at the age of 9 and has now completed 52 years in the industry, and will continue acting as long as he lives.
Actress Vasuki Anand said:
"In my personal life, I love education. That’s why I pursued an MBA and an MSc, and I’m now doing my Ph.D. Professionally, I only take up roles that resonate with me emotionally. I don’t prefer roles that don’t leave an impact on screen. Beauty is a film every parent—every mother and father—will connect with. And it’s a must-watch for this generation’s youth." She also added that she has turned down more films in her career than she has accepted.
బంధాలకు దూరమవుతున్న ఈ సోషల్ మీడియా యుగంలో నేటి జనరేషన్ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా 'బ్యూటీ' - 'బ్యూటీ' చిత్ర యూనిట్
బ్యూటీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఐడిల్ బ్రెయిన్ జీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ చిత్ర యూనిట్. సీనియర్ నటుడు నరేష్ మరియు నటి వాసుకి ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించగా హీరోహీరోయిన్లుగా అంకిత్ కొయ్య మరియు నీలాఖీ నటించిన ఈ సినిమా ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ..."ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా, ఫోన్ ప్రభావం పెరిగిపోయింది. ఒకప్పుడు మనిషి ఉండే ప్రాంతం బట్టే కోరికలు ఉండేవి. కుటుంబ బంధాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. ఎవరేం కొనుక్కున్నారన్న ఆలోచనల్లోనే మునిగిపోతున్నాం. 'కుటుంబం' అన్నది కూతుళ్లను, స్త్రీలను రక్షణగా కాపాడే గూడు లాంటిది. కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మొండి నిర్ణయాల వలన ఆ రక్షణను కోల్పోవడం జరుగుతుంది " అన్నారు. సినిమాను సినిమాగానే ఎంజాయ్ చేస్తానన్నారు అంకిత్ కొయ్య. కథా నాయకుడిగా ఎన్ని కథలైనా చేయొచ్చని, కానీ హీరో అవ్వాలంటే అది జనం మాత్రమే ఇవ్వాలన్నారు.
నటుడు నరేష్ మాట్లాడుతూ... "జీవితంలో అవకాశాలు రావడానికి అదృష్టం ఉండాలన్న మాట నిజమే అయినా, ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం అన్నది ఇంకొకెత్తు. యువ దర్శకులు నాకోసం ప్రత్యేకంగా రాస్తున్న పాత్రల ద్వారా కూడా ఎప్పటికప్పుడు నా నటనతో నిరూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి. అలా రచయితలు కథలు రాస్తున్నప్పుడు నాపేరు వాళ్లకు గుర్తుకు రావడం అన్నది నేను చేసుకున్న అదృష్టం. నా కెరీర్లో 'బ్యూటీ' సినిమాలో నా పాత్ర ఒక ఆణిముత్యంగా నేను చెప్పుకోవచ్చు. మనం అందరం ఒకరకమైన అబద్ధపు ప్రపంచంలో బ్రతుకుతున్నాం. వాటన్నిటి గురించి చాలా చక్కగా 'బ్యూటీ' లో చక్కగా చూపించడం జరిగింది. నేను నా జీవితంలో కూడా నాకు నచ్చిందే చేస్తాను. ఎవరి లైఫ్ వైపూ చూడను. అందుకే ఎవరికీ భయపడను" అన్నారు. తనకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు బాల నటుడిగా ప్రారంభించిన తన సినీ జీవితంలో నటుడిగా 52 సంవత్సరాలను పూర్తి చేసుకున్నానని, బ్రతికున్నంతవరకూ నటిస్తూనే ఉంటానన్నారు.
నటి వాసుకి ఆనంద్ మాట్లాడుతూ...." నా వ్యక్తిగత జీవితంలో నాకు చదువంటే ఇష్టం. అందుకే ఎంబీఏ, ఎమ్మెస్సీ చేసిన తరువాత కూడా ఇప్పుడు Ph.D చేస్తున్నాను. వృత్తిపరంగా చూసుకుంటే నేను చేసిన పాత్రలు నా మనసుకు నచ్చితేనే చేస్తాను. తెరపై ప్రభావం లేని పాత్రలను చేయడానికి ఇష్టపడను. ఈ సినిమాకు ప్రతి తల్లీ ప్రతి తండ్రీ కనెక్ట్ అవుతారు. ఈ జనరేషన్ పిల్లలు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది" అన్నారు. తన జీవితంలో ఒప్పుకున్న సినిమాల కన్నా కాదనుకున్న సినిమాలే ఎక్కువన్నారు.