pizza

Producer Benny Muppaneni about Bedurulanka 2012
Global Star Ram Charan was keen in knowing the whole story: 'Bedurulanka 2012' producer Benny Muppaneni’s interview
రామ్ చరణ్ గారు కథ ఏంటని అడిగి మరీ తెలుసుకున్నారు : 'బెదురులంక 2012' నిర్మాత బెన్నీ ముప్పానేని ఇంటర్వ్యూ

You are at idlebrain.com > news today >
Follow Us

21 August 2023
Hyderabad

Global Star Ram Charan was keen in knowing the whole story: 'Bedurulanka 2012' producer Benny Muppaneni’s interview

After the National award winning films ‘Colour Photo’ and ‘Tellavarithe Guruvaram’ producer Ravindra Banerjee (Benny) Muppaneni is coming up with 'Bedurulanka 2012' under Laukya Entertainments banner with Hero Karthikeya Gummakonda and 'DJ Tillu' fame Neha Shetty in Lead roles. Mr. Clax is making his debut as a director for this film. This movie is presented by Yuvraj and getting released this Friday. At this context as a part of promotions, Benny interacted with the media on this occasion. The details are as follows...

Tell us a little about yourself and your background.
I was born and brought up in Hyderabad! Worked in software for six years With the interest and love Later entered the industry as a producer.

The reason for naming 'BeduruLanka 2012'?
“Fear also plays a role in the story. Therefore, we put it as 'Bedurulanka 2012'. In an assumed imaginary village What has for 21 days in 2012 is the Plot. The story we wanted to tell needed a 2012 backdrop. The story is offcourse different and focus will not be on ‘2012’.”

While Clax narrated the story, he told the core point of it, it seems. What elements do you see while listening to a story?
“I strongly believe that there should be an 'X' factor in a story. When watching a movie as an audience, you really want something new. Once the story is set, rest everything else will be Set automatically. After watching the promo, the audience needs something that’s new and make them think to go to this movie. I put it as a 'check list'. I Loved the point when Clax told the story. And thought that No matter how interesting the point is we really can't present it seriously and should be told in the best possible Entertaining way. This story was locked before two months of release of 'Color Photo'.

How About Hero Karthikeya... How was your experience with him?
Very happy! Karthikeya has no problem even one percent. I wanted to work with him again for one more movie. Karthikeya is very professional.

What is the character of the hero?
Karthikeya will be seen in the role of a person living as per his will and wish. Society questions him. Neha Shetty will be seen in the role of hero's girlfriend. They both will be in love since childhood. All the characters in the film have a character arc.We wont lead life 100% as our heart pleases, however if we know we are about to die, how will we fare in the final moments? This is the core point of the film. Drama and comedy will be highlights in the movie. Even though there are many characters in the film, there is not even a single character you feel that it is forcibly incorporated.

You said that Neha Shetty as the heroine would be better!
There is a craze for that girl in the audience. Her screen presence is good in 'DJ Tillu'. Modern and urban roles were played in it. I thought it would be good to do a rural backdrop role with that girl. Clax said that she might not be suitable for this role based on the character played in 'DJ Tillu'. After doing the screen test, we felt happy. Neha Shetty will be set for any role and will get fame with 'Bedurulanka 2012'. She acted so well in the character of a village girl.

For the film with a new director, many senior technicians have been hired. What is the reason?
Experienced technicians seemed to be needed to get Clax’s Vision on the screen. Mani Sharma as the music director, Sai Prakash as the cinematographer... there was no compromise anywhere. There was no compromise in the matter of artists either.

Did you get a song written by 'Sirivennela'? please tell about that.
Unfortunate thing, sirivennela garu passed away while writing this song. Mani Sharma brought us that notes. Chaitanya Prasad penned the rest of the song. I thought that we should not use his name for publicity claiming his last lyrics were penned to our movie.

The trailer of this movie was released by Ram Charan. What did he say?
Before releasing the trailer, Ram Charan asked what the story was about. After watching the trailer, they talked about the concept and talked about Ajay Ghosh character after his entry and He really praised Mani Sharma's music. Well Before watching the trailer, Karthikeya and Neha Shetty pair was admired by Ram charan.

'Colour Photo', 'Tellavarithe Guruvaram', now 'Bedurulanka 2012' - how was your journey as a producer been?
It's good because I like doing it. I can answer this question after doing five films. I think story is important for any film.

Your next projects?
We have finalized three projects. We will announce them after the release of 'Bedurulanka 2012'. Two of them are concept driven films. The other One is planned as a very huge one.

 

జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫోటో', 'తెల్లవారితే గురువారం' చిత్రాల తర్వాత లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన సినిమా 'బెదురులంక 2012'. కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకులు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... 

మీ నేపథ్యం ఏమిటి? మీ గురించి కొంచెం చెప్పండి!
నేను పుట్టిందీ, పెరిగిందీ హైదరాబాద్‌లోనే! సినిమాలు అంటే ఆసక్తి, ప్రేమ! ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశా. తర్వాత నిర్మాతగా పరిశ్రమలో ప్రవేశించా. 

'బెదురులంక 2012' టైటిల్ పెట్టడానికి గల కారణం?
కథలో 'ఫియర్' (భయం) కూడా ఓ పాత్ర పోషిస్తుంది. అందుకని, 'బెదురులంక 2012' అని పెట్టాం. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది కథ. మేం చెప్పాలనుకున్న కథను 2012 నేపథ్యం అవసరం. కథ వేరుగా ఉంటుంది. 100 పర్సెంట్ ఫోకస్ అంతా 2012 మీద ఉండదు. 

క్లాక్స్ కథ చెప్పిన తర్వాత అందులో కోర్ పాయింట్ ఏంటనేది చెప్పేశారట! కథ వినేటప్పుడు మీరు ఏయే అంశాలు చూస్తారు?
కథలో 'ఎక్స్' ఫ్యాక్టర్ ఉండాలని నేను బలంగా నమ్ముతాను. ప్రేక్షకుడిగా సినిమా చూసినప్పుడు... కొత్తదనం ఉండాలని కోరుకుంటా. కథ కుదిరిన తర్వాత మిగతా అంశాలు అన్నీ కుదురుతాయి. ప్రోమో చూసిన తర్వాత 'ఎందుకు ఈ సినిమాకు వెళ్ళాలి' అని ప్రేక్షకులు అనుకోవడానికి ఓ కొత్తదనం కావాలి. నేను అది 'చెక్ లిస్ట్'గా పెట్టుకున్నా. క్లాక్స్ కథ చెప్పినప్పుడు అందులో పాయింట్ నచ్చింది. ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్ అయినా సరే... మనం సీరియస్ గా చెప్పలేం. వినోదాత్మకంగా చెప్పాలి. 'కలర్ ఫోటో' జరుగుతున్న సమయంలో ఈ కథ ఓకే చేశా. ఆ సినిమా విడుదలకు రెండు నెలల ముందు సినిమా లాక్ చేశాం.

హీరో కార్తికేయ గురించి... ఆయనతో ఎక్‌పీరియన్స్ ఎలా ఉంది?
చాలా హ్యాపీ! కార్తికేయతో ఒక్క శాతం కూడా ఇబ్బంది లేదు. ఆయనతో మళ్ళీ పని చేయాలని అనుకుంటున్నా. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామని అనుకుంటున్నాం. 

హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
తనకు నచ్చినట్టు జీవించే పాత్రలో కార్తికేయ కనిపిస్తారు. అతడ్ని సమాజం ప్రశ్నిస్తూ ఉంటుంది. హీరో ప్రేయసి పాత్రలో నేహా శెట్టి కనిపిస్తారు. హీరో హీరోయిన్లు చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉంటారు. సినిమాలో అన్ని పాత్రలకు క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. మన మనసుకు నచ్చినట్లు 100 పర్సెంట్ బయటకు బతకం, చనిపోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. డ్రామా, కామెడీ సినిమాలో హైలెట్ అవుతాయి. సినిమాలో బోలెడు క్యారెక్టర్లు ఉన్నా సరే... కావాలని పెట్టినట్లు ఒక్క క్యారెక్టర్ కూడా ఉండదు. 

కథానాయికగా నేహా శెట్టి అయితే బావుంటుందని మీరే చెప్పారట!
ప్రేక్షకుల్లో ఆ అమ్మాయికి క్రేజ్ ఉంది. 'డీజే టిల్లు'లో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. అందులో మోడ్రన్, అర్బన్ రోల్ చేశారు. ఆ అమ్మాయితో రూరల్ బ్యాక్‌డ్రాప్ రోల్ చేయిస్తే బావుంటుందని అనిపించింది. 'డీజే టిల్లు'లో క్యారెక్టర్ చూసి సెట్ అవ్వదేమో అని క్లాక్స్ అన్నారు. లుక్ టెస్ట్ చేసిన తర్వాత హ్యాపీగా అనిపించింది. ఎటువంటి పాత్రలకు అయినా సరే నేహా శెట్టి సెట్ అవుతారని 'బెదురులంక 2012'తో పేరు తెచ్చుకుంటారు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో అంత బాగా నటించారు.    

కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమాకు టెక్నీషియన్ల పరంగా చాలా పెద్దవాళ్ళను తీసుకున్నారు. కారణం ఏమిటి?
క్లాక్స్ విజన్ స్క్రీన్ మీదకు రావడానికి ఎక్‌పీరియన్స్డ్ టెక్నీషియన్లు అవసరం అనిపించింది. సంగీత దర్శకుడిగా మణిశర్మ గారు, ఛాయాగ్రాహకుడిగా సాయి ప్రకాష్ గారు... ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆర్టిస్టుల విషయంలో కూడా రాజీ పడలేదు. 

'సిరివెన్నెల' గారితో ఓ పాట రాయించారు కదా! ఆ ప్రయాణం గురించి...
ఆయన పాట రాస్తున్న సమయంలోనే శివైక్యం చెందారు. మాకు ఆ నోట్స్ కూడా మణిశర్మ గారు తెప్పించారు. మిగతా పాటను చైతన్య ప్రసాద్ రాశారు. సిరివెన్నెల గారు తిరిగిరాని లోకాలకు వెళ్లిన తర్వాత 'ఆయన లాస్ట్ సాంగ్ మా సినిమాలో ఉంది' అని కొందరు చెప్పారు. నిజానికి ఆయన చివరి పాట మా సినిమాలో ఉన్నా సరే ఆ విషయం బయటకు చెప్పలేదు. దాన్ని పబ్లిసిటీకి వాడుకోకూడదని భావించాను. 

ఈ సినిమా ట్రైలర్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఆయన ఏమన్నారు?
ట్రైలర్ విడుదల చేయడానికి ముందు రామ్ చరణ్ గారు కథ ఏంటని అడిగి తెలుసుకున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఎంటరైన తర్వాత సీన్స్ గురించి చెప్పారు. మణిశర్మ గారి మ్యూజిక్ చాలా బావుందన్నారు. ట్రైలర్ చూడటానికి ముందు కార్తికేయ, నేహా శెట్టి పెయిర్ బావుందని చెప్పారు. 

'కలర్ ఫోటో', 'తెల్లవారితే గురువారం', ఇప్పుడీ 'బెదురులంక 2012' - నిర్మాతగా మీ ప్రయాణం ఎలా ఉంది?
ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి బావుంది. ఐదారు సినిమాలు చేసిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలను. ఏ సినిమాకు అయినా సరే కథ ముఖ్యమని నేను భావిస్తా.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
మూడు ప్రాజెక్ట్స్ ఓకే చేశాం. 'బెదురులంక 2012' విడుదల తర్వాత అనౌన్స్ చేస్తాం. అందులో రెండు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్. ఒకటి భారీ సినిమా.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved