Epic Journey Comes Alive- Powerful, Yet Soul-Stirring First Single Veera Jayadheera From T Gopichand, Sankalp, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bharata Varsha Released
టి. గోపీచంద్, సంకల్ప్, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ 'భరతవర్ష' నుంచి పవర్ ఫుల్ ఎపిక్ జర్నీ ఫస్ట్ సింగిల్ 'వీర జయధీర' రిలీజ్
T Gopichand’s ambitious historical action epic Bharata Varsha continues to raise expectations with every promotional asset. Directed by Sankalp and produced by Srinivasaa Chitturi under Srinivasaa Silver Screen, with Pavan Kumar as presenter, the film had already captured attention through its visually stunning glimpse and title teaser set in 642 AD. Now, the makers have taken audiences deeper into the film’s world with the release of its first single, Veera Jayadheera.
Veera Jayadheera functions as a powerful narrative piece that reveals the emotional and spiritual journey of the protagonist. The track explores the making of a warrior, highlighting his struggles, resilience, and unwavering pursuit of destiny. It offers a meaningful glimpse into the character’s inner transformation while hinting at the larger adventure that drives the story.
Composer Anudeep Dev creates an expansive musical landscape filled with wonderful orchestration and epic energy. Chandrabose’s evocative lyrics celebrate courage, perseverance, and self-belief. The passionate vocals of Deepak Blue and Lakshmi Meghana elevate the composition, making it both inspiring and memorable.
The visuals accompanying the song are equally captivating. Gopichand is seen traversing vast snow-covered mountains and harsh terrains, portraying a lone warrior undertaking a demanding quest. The breathtaking locations not only enhance the scale of the film but also emphasize the isolation, determination, and strength of the protagonist’s journey.
Gopichand undergoes a remarkable transformation for the role, embodying the spirit of a fearless warrior with conviction and intensity. Actress Ritu Varma plays the female lead, adding further intrigue to the narrative.
With its powerful first single, Bharata Varsha shifts the spotlight from war and conquest to the personal evolution of its central character. If Veera Jayadheera is any indication, the film promises not just epic action and visual grandeur, but also an emotionally resonant tale of courage, destiny, and a journey of enlightenment.
Bharata Varsha brings together a talented crew committed to recreating a bygone era with authenticity and grandeur. Soundar Rajan’s lens captures the film’s expansive landscapes and intense action with visual richness, while Chinna’s production design meticulously reconstructs the world of 7th-century India. Complementing the scale of the narrative is Anudeep Dev’s powerful musical score.
As the project advances steadily through its final stages of production, the excitement surrounding the film continues to grow.
Cast: T Gopichand, Ritu Varma
Technical Crew:
Director: Sankalp
Producer: Srinivasaa Chitturi
Banner: Srinivasaa Silver Screen
Presents: Pavan Kumar
Music: Anudeep Dev
DoP: Soundar Rajan
Editor: Chota K Prasad
Production Designer: Chinna
Fight Masters: Venkat, Pruthvi, Real Satish
Dance Masters: Shankar, Vijay Polanki
టి. గోపీచంద్, సంకల్ప్, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ 'భరతవర్ష' నుంచి పవర్ ఫుల్ ఎపిక్ జర్నీ ఫస్ట్ సింగిల్ 'వీర జయధీర' రిలీజ్
టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం 'భరతవర్ష' ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలను పెంచుతూనే ఉంది. సంకల్ప్ దర్శకత్వంలో, శ్రీనివాస చిట్టూరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి పవన్ కుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ చిత్రం, విజువల్ గా అద్భుతమైన గ్లింప్స్, టైటిల్ టీజర్‌తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు, చిత్ర నిర్మాతలు ఫస్ట్ సింగిల్ 'వీర జయధీర' విడుదల చేశారు.
‘వీర జయధీర’ కథానాయకుడి ప్రయాణాన్ని, అతని పరివర్తనను ఆవిష్కరించే పవర్ ఫుల్ పాట గా నిలిచింది. ఒక సాధారణ వ్యక్తి నుంచి పరాక్రమవంతమైన యోధుడిగా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న కష్టాలు, పట్టుదల, లక్ష్యసాధన కోసం చేసిన పోరాటాన్ని ఈ పాట భావోద్వేగంగా చూపిస్తుంది. కథలోని ప్రధాన పాత్ర అంతర్మథనాన్ని, అతని జీవిత గమ్యాన్ని ఈ పాట అద్భుతంగా ప్రజెంట్ చేసింది
సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ ఈ పాటకు అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో కూడిన సంగీతాన్ని అందించారు. చంద్రబోస్ రచించిన సాహిత్యం ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల వంటి విలువలను గొప్పగా చూపించాయి. దీపక్ బ్లూ, లక్ష్మీ మేఘన తమ వొకల్స్ తో పాటకు మరింత ప్రాణం పోశారు.
ఈ పాటలోని విజువల్స్ కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు, క్లిష్టమైన భూభాగాల మధ్య ఒంటరి యోధుడిగా గోపీచంద్ చేసే ప్రయాణం అద్భుతంగా కనిపిస్తుంది. ఆ విశాలమైన లొకేషన్స్ కథానాయకుడి ఒంటరితనం, సంకల్పం, ధైర్యాన్ని మరింత బలంగా చూపిస్తున్నాయి.
ఈ పాత్ర కోసం గోపీచంద్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపిస్తున్నారు. ఓ యోధుడి ఆత్మను తన నటనలో ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తుండగా, ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండనుంది.
‘వీర జయధీర’ పాటతో ‘భరత వర్ష’ యుద్ధాలు, విజయాలతో పాటు హీరో వ్యక్తిగత ప్రయాణం, ఆత్మవికాసం వైపు ప్రేక్షకుల దృష్టిని మళ్లించింది. ఈ పాటను బట్టి చూస్తే, ఈ చిత్రం కేవలం భారీ యాక్షన్, విజువల్ గ్రాండియర్ మాత్రమే కాకుండా ధైర్యం, విధి, ఆత్మజ్ఞానంతో కూడిన భావోద్వేగ ప్రయాణాన్ని కూడా అందించబోతోందని స్పష్టమవుతోంది.
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీతో 7వ శతాబ్దపు భారతదేశాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుండగా, చిన్నా ప్రొడక్షన్ డిజైన్ ఆ కాలం వైభవాన్ని అత్యంత సహజంగా రీక్రియేట్ చేస్తోంది. అనుదీప్ దేవ్ సంగీతం కథని మరింతగా ఎలివేట్ చేస్తోంది.
చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ ‘భరత వర్ష’పై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
తారాగణం: టి. గోపీచంద్, రితు వర్మ
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం సంకల్ప్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సంగీతం: అనుదీప్ దేవ్
సినిమాటోగ్రాఫర్: సౌందర్ రాజన్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఫైట్ మాస్టర్స్: వెంకట్, పృథ్వీ, రియల్ సతీష్
డ్యాన్స్ మాస్టర్స్: శంకర్, విజయ్ పోలంకి