pizza

Lyca Productions' Bharateeyudu2 (Indian2) with Universal Star Kamal Haasan finish shoot, post-production in full swing
పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘భార‌తీయుడు 2’.. జూన్‌లో వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌

You are at idlebrain.com > news today >

14 April 2024
Hyderabad

Universal Star Kamal Haasan is celebrated for his multifaceted and impactful performances, while esteemed director Shankar is renowned for his grandiose and visually stunning commercial spectacles infused with profound societal messages. Together, they form a formidable duo known for delivering compelling entertainment, and their much-anticipated collaboration, "Bharateeyudu 2 (Indian2), has sent excitement levels soaring.

The film's production is proceeding at a rapid pace, fueling anticipation among cinephiles eager to witness Kamal Haasan's iconic portrayal of Senapathy once again grace the silver screen and potentially rewrite box office history. Serving as a sequel to the blockbuster Bharateeyudu ( "Indian,") where Haasan's Senapathy waged a lone battle against corruption, Bharateeyudu 2 ("Indian 2") promises to further captivate audiences with its gripping narrative.

The buzz surrounding the film's promotional activities is palpable, heightening curiosity to unprecedented levels. Recent updates indicate that Shankar has wrapped up principal photography, with the focus now shifting to the intensive post-production phase. The film's team aims to unveil a power-packed trailer by the end of May, setting the stage for a breathtaking global release in June.

Kamal Haasan's Senapathy persona has sparked imaginations, while the tagline "Zero Tolerance" only amplifies anticipation for what's in store. Joining the ensemble cast are the talented actresses Kajal Agarwal, Rakul Preet Singh, and Priya Bhavani Shankar, each adding depth to the narrative. The film also features a stellar lineup of supporting actors, including SJ Suryah, Siddharth, and Gulshan Grover, among others, all contributing to the film's ensemble brilliance.

With Anirudh Ravichander's musical prowess, Ravi Varman's captivating cinematography, and Sreekar Prasad's deft editing, "Indian 2" promises a cinematic experience like no other. Shankar's collaboration with esteemed writers such as B. Jeyamohan, Kabilan Vairamuthu, and Lakshmi Saravana Kumar ensures a screenplay that resonates with both heart and intellect.

Produced jointly by Subaskaran Allirajah's Lyca Productions and Red Giant Movies, Bharateeyudu 2 ( "Indian 2") stands poised to reaffirm the creative brilliance of its creators while setting new benchmarks in cinematic excellence.Subaskaran Allirajah is renowned for his passion for films and treated people with thought-provoking and riveting entertainers on the big screen. Indian 2, the original tamil version is releasing as Bharateeyudu 2 in Telugu, Hindustani 2 in Hindi across the world.

Movie: Bharateeyudu2 (Indian 2)

Cast: Kamal Haasan,. S. J. Suryah, Priya Bhavani Shankar, Kajal Aggarwal, Siddharth, Rakul Preet Singh, Nedumudi Venu, Vivek, Kalidas Jayaram, Gulshan Grover, Samuthirakani, Bobby Simha, Brahmanandam, Zakir Hussain, Piyush Mishra, Guru Somasundaram, Delhi Ganesh, Jayaprakash, Manobala, and Ashwini Thangaraj

Director: S.Shankar
Story: Shankar
Screenplay: Shankar, B.Jeyamohan, Kabilan Vairamuthu, Lakshmi Saravana Kumar
Music: Anirudh
Director of Photography: Ravi Varman
Production Designer: T. Muthuraj
Editor: Sreekar Prasad
Action: Anbariv - Ramazan Bulut - Anl Arasu - Peter Hein - Stunt Silva
Dialogue Writer: Hanumaan Chowdary
VFX Supervisor: V Srinivas Mohan
Choreographer: Bosco Caeser - Baba Baskar
Lyrics: Shreemani
Sound Designer: Kunal Rajan
Makeup: Legecy Effects - Vance Hartwell - Pattanam Rasheed
Costume Design: Rocky - Gavin Miguel - Amirtha Ram - SB Satheesan - Pallavi Singh - V Sai
Publicity Designer: Kabilan Chelliah
Excutive Producer: Sundar Raj
Head of Lyca productions:
GKM Tamil Kumaran
Red Giant Movies: M ShenbagaMoorthy
Produced by Subaskaran Allirajah

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘భార‌తీయుడు 2’.. జూన్‌లో వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌

ఇండియ‌న్ సినీ రంగంలో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి చెప్పాలంటే క‌మర్షియ‌ల్‌గా భారీ చిత్రాల‌ను అద్భుతం అని అంద‌రూ మెచ్చుకునేలా తెర‌కెక్కించ‌టంలో సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్ద‌రూ చేతులు క‌లిపారంటే అద్భుత‌మైన సినిమా మ‌న ముందుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. భార‌తీయుడు (ఇండియ‌న్‌) సినిమాతో అది నిరూపిత‌మైంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి ‘భార‌తీయుడు 2’తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాయ చేయ‌బోతున్నారు. భార‌తీయుడు బ్లాక్ బస్ట‌ర్ త‌ర్వాత వీరిద్ద‌రూ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ తిరుగులేని విజ‌యాన్ని సాధించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భార‌తీయుడు 2’ రానుండ‌టంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. గ్రిప్పింగ్ క‌థ‌నంతో ఈ మూవీ మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు స‌హా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

‘భార‌తీయుడు 2’ సినిమాపై ముందు నుంచి భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. దానికి అనుగుణంగానే ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన శంక‌ర్ ఇప్పుడు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌టంపై దృష్టి సారించారు. మే నెలాఖ‌రున ప‌వ‌ర్‌ప్యాక్డ్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూన్‌లో భారీ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

‘భార‌తీయుడు 2’ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి, మూవీ ఎలా ఉండ‌బోతుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో ‘జీరో టాల‌రెన్స్‌’ లైన్ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ క‌ల‌యిక ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్‌తో ‘భార‌తీయుడు 2’లో క్రియేటివ్ బ్రిలియ‌న్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది సినిమా ప్ర‌పంచంలో ఓ స‌రికొత్త మైలురాయిని క్రియేట్ చేయ‌టానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్ష‌కుల్లో గొప్ప ఆలోచ‌న రేకెత్తించేలా సినిమాలు చేస్తూ త‌న అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ జూన్‌లో ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:

క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌: ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌: హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు: శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌: కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ : లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌: రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌: సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved