Sharwa, Anupama Parameswaran, Sampath Nandi, KK Radhamohan, Sri Sathya Sai Arts’ Prestigious Project Bhogi Musical Journey Begins With Pure and Authentic Telangana Rural Song- Egilivaranga
శర్వా, అనుపమ పరమేశ్వరన్, సంపత్ నంది, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘భోగి’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం.. తెలంగాణ పల్లె పరిమళాలతో ఆకట్టుకున్న ‘ఏగిలివారంగ’ సాంగ్ రిలీజ్
Charming Star Sharwa is gearing up to transport audiences to a bygone era with Bhogi, an ambitious period action-drama helmed by Sampath Nandi. Mounted on a grand scale, the film is produced by KK Radhamohan under Sri Sathya Sai Arts banner, with Lakshmi Radhamohan presenting it. The film’s promotions began recently with the release of the teaser which received overwhelming response.
Meanwhile, the musical promotions of Bhogi have begun with the release of Egilivaranga, a captivating folk number that sets the tone for the film’s rustic world. Renowned for his expertise in composing earthy folk songs, Bheems Ceciroleo delivers a beautiful composition packed with several musical variations. The song gradually builds momentum, with its energy and intensity rising as it progresses.
Set in the 1960s in Boggula Gutta, a village on the Maharashtra–Adilabad border, the song offers an authentic glimpse into the rural life of that era. It captures the region’s culture, traditions, caste-based occupations, and the influence of local feudal lords who held authority over the lives of the villagers. Oscar-winning lyricist Chandra Bose brings these realities to life through lyrics rooted in the natural Telangana dialect, portraying the village’s social structure and everyday experiences in a raw, realistic, and unembellished manner.
Nalgonda Gaddar Narsanna breathes life into the song with his powerful and energetic vocals, adding a distinct rustic flavour to the composition. He is joined by Narsireddy, Kandukuri Shankar Babu, and Relare Gopal, whose contributions further enhance its earthy appeal.
The visuals complement the song’s musical and lyrical richness, authentically recreating the rural landscape and the atmosphere of the period. Sharwa and Anupama Parameswaran look remarkably convincing in their rustic avatars, seamlessly blending into the film’s rural setting. The attention to detail in portraying the village and its people adds further depth to the song.
Director Sampath Nandi once again demonstrates his storytelling prowess, bringing the region’s traditions, social realities, and distinctive way of life to the screen with remarkable authenticity. With its spirited folk composition, evocative lyrics, and visually rich presentation, the song makes a promising start to Bhogi’s musical journey.
Dimple Hayathi plays the other female lead in the movie that features talented technicians handling different crafts. Kishor Kumar takes care of the cinematography, while Bheems Ceciroleo is responsible for the film’s music.
With the remaining production and post-production work underway, the makers will announce the film’s release date soon.
Cast: Charming Star Sharwa, Anupama Parameswaran, Dimple Hayathi
Technical Crew:
Writer, Director: Sampath Nandi
Producer: KK Radhamohan
Banner: Sri Sathya Sai Arts
Presents: Lakshmi Radhamohan
Music: Bheems Ceciroleo
DOP: Kishore Kumar Arokia
Art Director: Kiran Kumar Manne
Stunts: Dilip Subbarayan
శర్వా, అనుపమ పరమేశ్వరన్, సంపత్ నంది, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘భోగి’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం.. తెలంగాణ పల్లె పరిమళాలతో ఆకట్టుకున్న ‘ఏగిలివారంగ’ సాంగ్ రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా ‘భోగి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇటీవల విడుదలైన టీజర్‌తో ప్రారంభమయ్యాయి. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
‘భోగి’ మ్యూజికల్ ప్రమోషన్స్ తాజాగా ‘ఏగిలివారంగ’ పాట విడుదలతో ప్రారంభమయ్యాయి. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ జానపద గీతం సినిమా నేపథ్యాన్ని అద్భుతంగా పరిచయం చేస్తోంది. మట్టి వాసనతో కూడిన జానపద పాటలను రూపొందించడంలో తన ప్రత్యేకతను చాటుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు అందమైన బాణీని అందించారు. విభిన్నమైన సంగీత ప్రయోగాలతో సాగిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది.
1960ల కాలంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దులోని బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. అప్పటి పల్లె జీవనాన్ని సహజంగా ఆవిష్కరిస్తూ, ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, కులవృత్తులు, గ్రామస్థుల జీవితాలపై పెత్తనం చెలాయించిన స్థానిక భూస్వాముల ప్రభావాన్ని ఈ పాటలో చూపించారు. ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ తెలంగాణ సహజమైన మాండలికంలో రాసిన సాహిత్యం ఈ వాస్తవాలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది. గ్రామంలోని సామాజిక వ్యవస్థ, ప్రజల నిత్యజీవిత అనుభవాలను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సహజంగా, వాస్తవికంగా తన సాహిత్యంలో ప్రతిబింబించారు.
నల్గొండ గద్దర్ నర్సన్న తన వాయిస్ తో పాటకు ప్రాణం పోశారు. తన ప్రత్యేకమైన పల్లె గొంతుతో పాటకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చారు. ఆయనతో పాటు నర్సిరెడ్డి, కందుకూరి శంకర్ బాబు, రిలారే గోపాల్ పాటకు మరింత పల్లె పరిమళాన్ని అద్దారు.
పాటలోని సంగీతం, సాహిత్యంలోని గొప్పదనానికి విజువల్స్ కూడా చక్కగా తోడయ్యాయి. అప్పటి గ్రామీణ వాతావరణాన్ని, పల్లె జీవనశైలిని సహజంగా రీ క్రియేట్ చేశారు.
శర్వా, అనుపమ పరమేశ్వరన్ తమ పల్లెటూరి పాత్రల్లో ఎంతో సహజంగా కనిపిస్తూ, సినిమా నేపథ్యానికి చక్కగా సరిపోయారు. గ్రామాన్ని, అక్కడి ప్రజల జీవన విధానాన్ని చూపించడంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ పాటకు మరింత లోతును తీసుకొచ్చింది.
దర్శకుడు సంపత్ నంది తన స్టోరీ టెల్లింగ్ తో అద్భుతంగాఆకట్టుకున్నారు. ఆ ప్రాంత సంప్రదాయాలు, సామాజిక వాస్తవాలు, ప్రత్యేకమైన జీవనశైలిని ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించారు. ఉత్సాహభరితమైన జానపద సంగీతం, మనసుకు హత్తుకునే సాహిత్యం, కళ్లు కట్టే విజువల్స్‌తో ‘భోగి’ మ్యూజికల్ జర్నీకి ఈ పాట మంచి ఆరంభాన్ని ఇచ్చింది.
ఈ సినిమాలో మరో కథానాయికగా డింపుల్ హయతి నటిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా నిర్మాణానికి సంబంధించిన మిగిలిన పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి.
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్ అరోకియా
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్