Charming Star Sharwa Looks Massy & Intense In Birthday Special Poster From Blockbuster Maker Sampath Nandi, KK Radhamohan, Sri Sathya Sai Arts’ Prestigious Pan India Project Bhogi
చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'భోగి' నుంచి శర్వా మాస్సీ & ఇంటెన్స్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
Charming Star Sharwa is stepping into a completely new zone as he teams up with blockbuster maker Sampath Nandi for the first time for the pan-India period action drama Bhogi. Produced on a grand canvas by KK Radhamohan under Sri Sathya Sai Arts and presented by Lakshmi Radhamohan, the film is poised to be one of the most ambitious projects in Sharwa’s career. The makers revealed the film’s powerful first-look poster recently, and it received tremendous response.
Extending birthday wishes to Sharwa, the makers unveiled a special poster today. It presents him in a strikingly massy and intense avatar. With thick, messy hair and a dense beard, Sharwa sports a raw and rebellious look. A beedi hangs from his lips as smoke slowly drifts out, adding to the attitude. His face appears slightly sweaty and textured, enhancing the gritty realism of the character. With a stern expression and a sharp gaze, he hints at a fierce and uncompromising personality.
The move that comes with the tagline “A Blood Fest” is progressing with its shoot. Like never before, Sharwa plays a rustic and most intense character in the movie. His makeover has already become a talking point.
Director Sampath Nandi is shaping the film against a rugged period setting, unfolding along the North Telangana–Maharashtra border during the late 1960s. The story is rooted in that era, promising a raw and intense backdrop that adds depth to the narrative.
The film’s shoot is presently happening in a massive set in Hyderabad, where the team is canning a high-octane action sequence.
Anupama Parameswaran and Dimple Hayathi play the female leads, while several noted actors appear in important supporting roles.
On the technical front, the project boasts an accomplished crew. Production design is handled by Kiran Kumar Manne, cinematography is by Kishore Kumar Arokia, and music is composed by Bheems Ceciroleo.
Planned as a pan-India release, the movie will hit the big screens in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi on August 28th, coinciding with the festive occasion of Raksha Bandhan.
Cast: Charming Star Sharwa, Anupama Parameswaran, Dimple Hayathi
Technical Crew:
Writer, Director: Sampath Nandi
Producer: KK Radhamohan
Banner: Sri Sathya Sai Arts
Presents: Lakshmi Radhamohan
Music: Bheems Ceciroleo
DOP: Kishore Kumar Arokia
Art Director: Kiran Kumar Manne
Stunts: Dilip Subbarayan
చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'భోగి' నుంచి శర్వా మాస్సీ & ఇంటెన్స్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నందితో కలిసి భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' సినిమా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం శర్వా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్‌లలో ఒకటిగా రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈరోజు ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో శర్వా పూర్తిగా మాసీ, ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. రగ్గడ్ జుట్టు , గడ్డంతో శర్వా రా, రెబెలియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. పెదవుల మధ్య బీడి పెట్టుకుని, దాని నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్న పొగ ఆయన పాత్రలోని అటిట్యూడ్‌ను మరింత హైలైట్ చేస్తోంది. చెమటతో తడిసిన ముఖం, రఫ్ టెక్స్చర్ పాత్రలోని గ్రిటీ రియలిజాన్ని చూపిస్తోంది. ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్ ఫియర్స్, రాజీ పడని వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది.
“ఎ బ్లడ్ ఫెస్ట్” అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె, సినిమాటోగ్రఫీ కిషోర్ కుమార్ అరోకియా నిర్వహిస్తుండగా, బ్లాక్‌బస్టర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి గ్రాండ్ పాన్-ఇండియా రిలీజ్ కానుంది.
తారాగణం: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కెకె రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పకులు: లక్ష్మీ రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డిఓపీ: కిషోర్ కుమార్ అరోకియా
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్