pizza

Sushanth In A Very Special Role In Megastar Chiranjeevi's Bholaa Shankar
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర మెగా మాసివ్ మూవీ 'భోళా శంకర్' ప్రత్యేక పాత్రలో సుశాంత్

You are at idlebrain.com > news today >
Follow Us

18 March 2023
Hyderabad

The upcoming crazy project “Bholaa Shankar” marks the first-time collaboration of Megastar Chiranjeevi and Meher Ramesh. The Mega Massive Action Entertainer is produced on a lavish manner by Ramabrahmam Sunkara.

The movie features a stellar cast in important roles. Tamannaah is playing the leading lady, while Keerthy Suresh will be seen as Chiranjeevi’s sister. The makers today announced that talented actor Sushanth is essaying a very special and lover boy kind of role in the movie. The announcement has been made, on the occasion of Sushanth’s birthday.

Besides playing lead roles, Sushanth is choosing to do vital roles in other hero movies. Seems like, his character in Bholaa Shankar is very significant. He looks charming in a suit with a light beard in the poster.

The makers released a motion poster on Maha Shivaratri and it presented Chiranjeevi in a fierce avatar. The other promotional material too got a terrific response.

This commercial entertainer produced by Anil Sunkara’s AK Entertainments, in association with Creative Commercials, will have emotions and other elements in the right proportions.

Dudley cranks the camera, wherein Marthand K Venkatesh takes care of editing and AS Prakash is the production designer. Story supervision is by Satyanand and dialogues are by Thirupathi MamidalaKishore Garikipati is the executive producer.

Cast: Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Sushanth, Raghu Babu, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Sri Mukhi, Bithiri Sathi, Satya, Getup Srinu, Rashmi Gautam, Uttej, etc.

Technical Crew:
Screenplay, Direction: Meher Ramesh
Producer: Ramabrahmam Sunkara
Banner: AK Entertainments
Ex-Producer: Kishore Garikipati
Music: Mahati Swara Sagar
DOP: Dudley
Editor: Marthand K Venkatesh
Production Designer: AS Prakash
Story Supervision: Satyanand
Dialogues: Thirupathi Mamidala
Fight Masters: Ram-Laxman, Dileep Subbarayan, Kaeche Kampakdee
Choreography: Sekhar Master
Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam, Srimani, Sirasri

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర మెగా మాసివ్ మూవీ 'భోళా శంకర్' ప్రత్యేక పాత్రలో సుశాంత్

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ల క్రేజీ ప్రాజెక్ట్ “భోళా శంకర్”. ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన , లవర్ బాయ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. సుశాంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు.

సుశాంత్ లీడ్ రోల్స్ తో పాటు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలని ఎంపిక చేసుకుంటున్నారు. భోలా శంకర్‌లో అతని పాత్ర చాలా కీలకంగా వుంటుంది. పోస్టర్‌లో సూట్‌లో లైట్ గడ్డంతో ఛార్మింగా కనిపిస్తున్నాడు.

మహా శివరాత్రి సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన మోషన్ పోస్టర్‌ చిరంజీవిని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. మిగతా ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ , రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.

సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved