pizza

Charming Star Sharwa, Abhilash Reddy Kankara, UV Creations’ Biker Rugged & Sporty First Look Released
చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి, UV క్రియేషన్స్ 'బైకర్' రగ్డ్ & స్పోర్టీ ఫస్ట్ లుక్ రిలీజ్

You are at idlebrain.com > news today >

20 October 2025
Hyderabad

Charming star Sharwa plays a skilled motorcycle racer in his 36th film #Sharwa36, directed by Abhilash Kankara and produced under the prestigious banner of UV Creations. The shoot of the movie is nearing completion. The makers, on the auspicious occasion of Diwali, unleashed the film’s title and first look.

The movie locked a perfect title Biker which indicates the backdrop of the movie. Sharwa stuns in a rugged biker outfit, confidently seated on a sleek sports bike, radiating intensity. With a serious, intense gaze and a fiery presence, his look captures the pulse of the film’s action-packed narrative. The bold red title logo, stamped with attitude, sets the tone for the movie.

Set across the vibrant decades of the 1990s and 2000s, the film weaves a compelling multi-generational family drama, where racing dreams and emotional bonds collide.

Malvika Nair plays the female lead opposite Sharwa, while seasoned actors Brahmaji and Atul Kulkarni appear in pivotal roles. The technical crew brings strong firepower to the film, with J Yuvraj handling cinematography, Ghibran composing music, Anil Kumar P editing, and Rajeevan leading production design. N Sundeep is the executive producer, while A Panner Selvam oversees the art direction.

Biker is going to be a gripping ride packed with action, emotion, and nostalgia, promising an electrifying experience.

Cast: Charming Star Sharwa, Malvika Nair, Brahmaji, Atul Kulkarni, etc.

Technical Crew:
Writer, Director: Abhilash Reddy Kankara
Producers: Vamsi-Pramod
Presents: Vikram
Banner: UV Creations
Music: Ghibran
DOP: J Yuvraj
Production Designer: Rajeevan
Editor: Anil Kumar P
Art Director: A Paneer Selvam

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి, UV క్రియేషన్స్ 'బైకర్' రగ్డ్ & స్పోర్టీ ఫస్ట్ లుక్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ చిత్రం #శర్వా36లో మోటార్ సైకిల్ రేసర్ పాత్రను పోషిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో UV క్రియేషన్స్ ప్రతిష్టాత్మక బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. దీపావళి సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాకి 'బైకర్' అనే పర్ఫెక్ట్ టైటిల్‌ను లాక్ చేశారు, ఇది సినిమా నేపథ్యాన్ని సూచిస్తుంది. శర్వా ఇంటెన్స్ బైకర్ డ్రెస్ లో స్పోర్ట్స్ బైక్‌పై కనిపించడం అదిరిపోయింది. తన లుక్ సినిమా యాక్షన్-ప్యాక్డ్ పల్స్‌ ప్రజెంట్ చేస్తోంది. బోల్డ్ రెడ్ టైటిల్ లోగో ఆకట్టుకుంది.

1990, 2000ల బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం, రేసింగ్ డ్రీమ్స్, ఎమోషన్స్ , ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుంది.

శర్వా సరసన మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

జె యువరాజ్ సినిమాటోగ్రఫీని, జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు, అనిల్ కుమార్ పి ఎడిటింగ్, రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్.

బైకర్ యాక్షన్, ఎమోషన్, నోస్టాల్జియాతోకూడిన గ్రిప్పింగ్ రైడ్‌గా ఉంటుంది.

తారాగణం: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
సమర్పణ: విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
డిఓపి: జె యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఆర్ట్ డైరెక్టర్: ఎ పనీర్ సెల్వం


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved