మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, మొదటి మూడు పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ జోష్ ని కొనసాగిస్తూ, చిత్ర బృందం ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది.
ట్రైలర్ రవితేజ యాక్షన్ సినిమాలు చాలు అనే ఆకట్టుకునే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఇది ప్రేక్షకులు చాలా కాలంగా మిస్ అవుతున్న ఫ్యామిలీ జోన్‌కు అతను తిరిగి వస్తున్నాడనే ఫన్ ఇండికేషన్. ఫారిన్ టూర్ లో ఆషిక రంగనాథ్‌పై ప్రేమ కలగడంతో, డింపుల్ హయతితో అతని వైవాహిక జీవితం ఊహించని విధంగా మారడంతో కథ మొదలవుతుంది. ఇద్దరు మహిళల, రెండు విభిన్న ప్రశ్నల మధ్య నలిగిపోతున్న అతని ప్రయాణం హిలేరియస్ గా, అదే సమయంలో ఎమోషనల్ సాగుతుంది.
కుటుంబ కథలను అద్భుతంగా హ్యాండిల్ చేసే డైరెక్టర్ కిశోర్ తిరుమల, ఈసారి తన ట్రేడ్‌మార్క్ ఫ్రెష్ నెస్ తో, హ్యుమర్ ని మరింతగా పెంచాడు. కథను ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా కామెడీ, సినిమాకు లైవ్లీగా ఫీల్-గుడ్ వైబ్‌ను అందిస్తుంది. చివరి సీక్వెన్స్‌లో రవితేజ ఆత్మే తన క్లిష్ట పరిస్థితిని చూపించే తీరు సినిమాను పర్ఫెక్ట్‌గా హ్యుమర్ టోన్ సెట్ చేసింది.
మాస్, యాక్షన్ పాత్రల తర్వాత రవితేజను క్లీన్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ అవతార్‌లో చూడటం ఫ్రెష్ నెస్ కలిగిస్తుంది. స్వాగ్‌కు క్లాస్‌ను కలిపి, అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేశారు. అతని యాక్టింగ్ చార్మ్‌తో, నేచురల్ గా అదిరిపోయింది.
పాజెసివ్ వైఫ్ పాత్రలో డింపుల్ బలమైన ఇంటెన్సిటీని చూపిస్తే, మోడ్రన్ ఎడ్జ్‌తో వచ్చిన ఆషిక పాత్ర కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. విరుద్ధ స్వభావాలున్న ఈ రెండు పాత్రల్లోనూ హీరోయిన్స్ మెప్పించారు. కామెడీ ఫ్రంట్‌లో సత్య లాఫ్-రయట్ మోమెంట్స్‌తో అలరించారు. సునీల్, వెన్నెల కిశోర్ ఫన్ మరింత ఎలివేట్ చేశారు,
టెక్నికల్‌గా సినిమా వైబ్రెంట్‌గా, రిచ్‌గా వుంది. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ గ్లాసీ, కలర్‌ఫుల్ టెక్స్చర్‌ను అందించగా, భీమ్స్ సంగీతం హ్యుమర్ ఎమోషన్ ని ఎలివేట్ చేసింది. SLV Cinemas ప్రొడక్షన్ విలువలు టాప్-నాచ్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు మరింత బలం చేకూర్చాయి.
మొత్తంగా ట్రైలర్ కామెడీ, డ్రామా, ఎమోషన్స్, రిలేటబుల్ రిలేషన్‌షిప్ కన్ఫ్యూజన్స్‌తో, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌లో తప్పకుండా చూడాల్సిన చక్కని ఎంటర్‌టైనర్‌గా హామీ ఇస్తోంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రవితేజ మాట్లాడుతూ.. 'అందరికీ హాయ్. ఈసారి పండక్కి సరదా సరదాగా గోల చేద్దాం. ఇదొక్కటే కాదు.. వస్తున్న అన్ని సినిమాలు ఫుల్ ఎంటర్టైమెంట్. ఈసారి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంక్రాంతి అవుతుందని నా ప్రగాఢ నమ్మకం.
ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ.. ఇది అద్భుతమైన జర్నీ. పాటలు టీజర్ కి సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉంటుంది. జనవరి 13న సినిమా రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చూడాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫన్ ఫిల్మ్. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
డింపుల్ హయాతి మాట్లాడుతూ.. రవితేజ గారితో ఇది నాకు రెండో సినిమా. ఇది నా మొదటి సంక్రాంతి సినిమా. అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. జనవరి 13న సినిమా రిలీజ్ అవుతుంది. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను.
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: ప్రసాద్ మురెళ్ల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: AS ప్రకాష్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ కుమార్ చాగంటి