
25 November 2017
Hyderabad
సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం `జవాన్`. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ ``సినిమాలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాననే విషయాన్ని ట్రైలర్‌లో చూపించాం. అయితే సినిమాలో మెయిన్ ఎలిమెంట్‌ను మేం బయటపెట్టలేదు. డ్రమటిక్, థ్రిల్లింగ్ సీక్వెన్స్‌లు సెకండాఫ్‌లో వస్తాయి. ఇది డి.ఆర్.డి.ఒ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన సినిమా. దేశ రక్షణలో డి.ఆర్.డి.ఒ పాత్ర చాలా కీలకం. ఈ సంస్థ గొప్పతనం చాలా మందికి తెలియకపోవచ్చు. దాన్ని చెప్పే ప్రయత్నం చేశాం. అక్కడ అక్టోపస్ అనే మిసైల్ ఉంటుంది. దాన్ని విలన్ దొంగిలించాలనుకుంటాడు. కానీ హీరో దాన్నెలా ఆపాడనేదే కథ. ఇందులో హీరో సాయిధరమ్ తేజ్ ఆర్.ఎస్.ఎస్. జవాన్. నేను ఈ విషయాన్ని పోస్టర్స్‌లో చూపించాను. ఎవరినీ విమర్శించకుండా చేసిన సినిమా ఇది. కొత్త బ్యాక్‌డ్రాప్ సినిమా చేయాలనే ఉద్దేశంతో హీరో క్యారెక్టర్‌ను డిజైన్‌చేశాను. మధ్య తరగతి అయిన హీరో దేశానికి, కుటుంబానికి కష్టం వస్తే హీరో ఎటు నిలబడతాడనేదే కథ. హీరో సాయిధరమ్ కథ వినగానే కథ తగ్గట్టుగా లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు సాయిధరమ్ తేజ్ జోవియల్ క్యారెక్టర్స్‌లోనే ఎక్కువగా కనపడ్డాడు. కానీ తొలిసారి జవాన్‌లో ఓ బాధ్యతతో కూడిన క్యారెక్టర్‌లో కనపడ్డాడు. కష్టం ఎక్కడున్నా తనకు తెలిస్తే, ఆ కష్టాన్ని తీర్చడానికి ముందుకెళ్లే వ్యక్తి హీరో. పెద్ద స్టార్ డమ్ ఉండే హీరోలు మోయాలనుకున్న క్యారెక్టర్‌ను సాయిధరమ్ చేయడం తన గొప్పతనం. ఇలాంటి క్యారెక్టర్‌ను చేయడానికి ధైర్యం కావాలి. అలాగే ప్రసన్నగారి గురించి కోనవెంకట్‌గారు, గోపీ మోహన్‌గారు చెప్పడంతో ఆయన్ను కలిశాను కథ వినగానే తన క్యారెక్టర్ ఎంతో బావుందని, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు డేట్స్ ఇస్తానని అన్నారు. అలాంటి నటుడు మనకు దొరకడం మన అదృష్టం. మంచి నటుడే కాదు. మంచి డేడికేషన్, టైమ్ పంక్చువాలిటీ ఉన్న నటుడు కూడా. మంచి నటీనటులు, టెక్నిషియన్స్ ఈ సినిమాకు కుదిరారు. అందరూ నేచురల్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. ఈ సినిమాకు ఇన్‌స్పిరేషన్ అంటూ ప్రత్యేకంగా లేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడ్డ నా మిత్రుడిని చూసే ఈ కథను రాసుకున్నాను. అలాగని తనేం జవాన్ కాదు. తన నిజ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. జీవితంలో రాజీ పడిపోదాం. నమ్ముకున్న ఆశయాలను పక్కన పెడదానుకునేవారే ఎక్కువగా ఉంటారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మనకు క్యారెక్టర్ ముఖ్యమని నిలబడేవారే హీరోలవుతారు.
ఇందులో హీరోను పర్టికులర్‌గా ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని చూపడానికి కారణం..మనకు స్వాతంత్ర్యం రాక మునుపు కులాలు, మతాలు అంటూ చాలా తారతమ్యాలుండేవి. అటువంటి సమయంలో కూడా ఆర్.ఎస్.ఎస్ సహపంక్తి భోజనాలు పెట్టేవారు. ఈ విషయం గురించి నాకు చెప్పిన పెద్దాయన `మనం అందరం కలిస్తేనే ఇండియా, కులాలు, మతాలతో విడిపోతే దేశం ఎలా అవుతుంది?` అన్నారు. ఈ ఇన్‌స్పిరేషన్‌తోనే నేను సినిమాలో `ప్రతివాడికి ఓ గోల్ ఉంటుంది. కానీ ప్రతివాడి కామన్ గోల్ దేశం అవ్వాలి. ఆ దేశానికి అవసరం వచ్చినప్పుడు నీది, నాది..అనే దాన్ని పక్కన పెట్టి రంగంలోకి దూకేయాలి. అప్పుడే మనం అని ఉంటాం` అనే డైలాగ్ రాశాను. అలాంటి సంఘటనలను బేస్ చేసుకుని డైలాగ్స్ కూడా రాసుకున్నాను. అంతేకానీ సినిమాలో ఏ మెసేజ్ ఇవ్వలేదు. సినిమాలో మెహరీన్ పెయింటర్ భార్గవి అనే క్యారెక్టర్‌లో కనపడుతుంది. హీరోను డామినేట్ చేసే బబ్లీ క్యారెక్టర్‌లో కనపడుతుంది. ఇప్పటి వరకు మెహరీన్ చేసిన సినిమాలంటే గ్లామరస్‌గా జవాన్‌లో కనపడుతుంది. దర్శకుడిగా ఈ సినిమా విజయం కోసం ఎదురుచూస్తున్నాను. రచయితగా, దర్శకుడిగా నెక్ట్స్ సినిమా ఏదీ చేయడం లేదు`` అన్నారు.