pizza

‘Carmeni Selvam’ Telugu and Tamil Bilingual Set for Grand Release on April 3, 2026; PVR INOX Pictures Comes On Board as Theatrical Distribution Partner
ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న తెలుగు–తమిళ ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్.

You are at idlebrain.com > news today >

5 March 2026
Hyderabad

The upcoming film Carmeni Selvam is set for a grand bilingual release in both Tamil and Telugu on April 3, 2026. The film features an ensemble of critically acclaimed performers who command a strong presence in both the Tamil and Telugu markets, Samuthirakani is ready to deliver a path-breaking performance that is a clear departure from his usual repertoire.

The film also stars Gautham Vasudev Menon known for terrific performances playing a pivotal role. Accomplished actresses Abinaya and Lakshmi Priya are roped in to bring depth and intensity to the film’s emotional core. The film is bankrolled by Pathway Productions. Today makers announced that PVR INOX pictures associated with Pathway Productions as the official theatrical distribution partner.

Strengthening its nationwide footprint, Carmeni Selvam is all set to have a grand release. This Relatable tale for the modern Era has already sparked significant curiosity with its first look poster. Makers are planning to raise curiosity with the teaser coming soon. The film follows the journey of Selvam, a principled car driver, as he navigates a complex world of modern pressures. What begins as an emotional monologue of a common man unfolds into a high-stakes drama that explores the fragile balance between honesty and survival.

Sharing his vision, Writer-Director Ram Chakri said, “Carmeni Selvam is a story that belongs to the common man, and we are thrilled that it is now ready for both our Tamil and Telugu audiences. Partnering with PVR INOX Pictures ensures that this story of heart and grit reaches the grand stage”.

Release Date: April 3, 2026

Cast: P. Samuthirakani, Gautham Vasudev Menon, Lakshmi Priya, Abhinaya, Karthik Kumar, Badava Gopi, Kothandam, Karan Chakravarthi, Sankara Narayan V, Haritha Parakod.

Banner: Pathway Productions
Produced by: Arun Rangarajulu
Writer – Director: Ram Chakri
Creative Producer: Shree Saravanan
Music as a Service (MAAS)
Musicloud Studio & Technology
DOP: Yuvaraj Dakshan
Edit: Jagan RV & Dinesh S
Production Designer: Shankar
Lyrics: Mani Amuthavan & Uma Devi
Audiography: Raghav Ramesh
Sound Design: Raghav Ramesh - Hari Prasad MA
Executive Manager: Mani Dhamotharan
Production Manager: VR Rambarath

ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న తెలుగు–తమిళ ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్.

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రానికి అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా చేరింది. దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థ తమ విస్తరణను మరింత బలపరుచుకుంటున్న నేపథ్యంలో ‘కార్మేని సెల్వం’ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. త్వరలో విడుదల కాబోయే టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని భావోద్వేగభరితంగా చూపించనున్నారు. ఒక సాధారణ మనిషి మనసులోని మాటగా ప్రారంభమయ్యే ఈ కథ, నిజాయితీ మరియు జీవన పోరాటం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబించే హై స్టేక్స్ డ్రామాగా మారుతుంది.

ఈ చిత్రంపై దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ .. “కార్మేని సెల్వం’ ఒక సాధారణ మనిషి కథ. ఈ కథను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రానికి థియేట్రికల్ పార్ట్‌నర్‌గా ఉండటం వల్ల ఈ కథ మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నాం’ అని తెలిపారు.

విడుదల తేది: ఏప్రిల్ 3, 2026
నటీనటులు:
సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు.

సాంకేతిక బృందం:
బ్యానర్: పాత్‌వే ప్రొడక్షన్స్
నిర్మాత: అరుణ్ రంగరాజులు
కథ – దర్శకత్వం: రామ్ చక్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీ శరవణన్
మ్యూజిక్: MAAS (Music as a Service), Musicloud Studio & Technology
డీఓపీ: యువరాజ్ దక్షన్
ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్
ప్రొడక్షన్ డిజైనర్: శంకర్
లిరిక్స్: మణి అముతవన్, ఉమా దేవి
ఆడియోగ్రఫీ: రాఘవ్ రమేష్
సౌండ్ డిజైన్: రాఘవ్ రమేష్ – హరి ప్రసాద్ MA
ఎగ్జిక్యూటివ్ మేనేజర్: మణి దామోతథరన్
ప్రొడక్షన్ మేనేజర్: వీఆర్ రాంభరత్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved