pizza

“Chaari 111” : Vennela Kishore As Hero In Spy Action Comedy Directed By TG Keerthi Kumar, of ‘Malli Modalaindi’ fame Under Barkat Studios Production Banner
'వెన్నెల' కిశోర్ హీరోగా యాక్షన్ కామెడీ సినిమా 'చారి 111'

You are at idlebrain.com > news today >
Follow Us

23 August 2023
Hyderabad

Vennela Kishore is a star comedian who is known for his mannerisms, comic timing, dialogue delivery and acting. He carved out a niche for himself and sets his unique style of comedy thus tickling the funny bones of the audiences. Not only as a comedian, but also as a protagonist, he does films when he gets suitable characters. Impressed by the story and director's conviction, Kishore is back in the lead with a perfect film.

‘Chaari 111’, a spy action comedy, is being produced by Aditi Soni under the banner of Barkat Studios with Vennela Kishore as the protagonist and directed by TG Keerthi Kumar. After his previous movie 'Malli Modalaindi' starring Sumanth, he is directing this spy action comedy film. Samyukta Viswanathan is playing the female lead opposite Vennela Kishore. Murali Sharma is playing a crucial role in this spy comedy.

First of its kind in Tollywood, Chaari 111 makers have announced the film with a special high-end ‘Animation Video’ tailor-made for the film’s announcement. This shows the sincerity, honesty and confidence of the makers to present the Spy Action Comedy in a very unique and intriguing way. This sets new benchmark in the marketing and the film’s promotion. The film is being shot lavishly on a grand scale without any compromises.

Talking about 'Chaari 111', director TG Keerthi Kumar said, "It is an spy action comedy film. Vennela Kishore will be seen in the role of a spy. His look is stylish in the role of a secret spy who investigates suspicious incidents in a city. Also, there is confusion in that role. What is that? What did the spy do? To find out the answers, watch the film on the screen. Murali Sharma plays a pivotal role in the story as the head of a spy agency. Our film entertains the audience with stylish action scenes and offer entertainment throughout”.

Aditi Soni, producer of the film added, "'Chaari 111' will be new in spy genre movies. Vennela Kishore's performance and TG Keerthi Kumar's direction are highlights of the film. There are many surprises in the story. Villain role is one of them. The identity of the villain is currently in suspense. The scenes shot so far have given us a lot of satisfaction. The shooting is going on at a fast pace.”

Vennela Kishore, Samyukta Viswanathan, Murali Sharma, Brahmaji, Satya, Rahul Ravindran, Pavani Reddy, 'Tagubothu' Ramesh are playing key roles in this movie Editing : Richard Kevin A, Stunts : Karunakar, Production Design : Akshata B Hosuru, PRO: Pulagam Chinnarayana, Executive Producer: Balu Komiri, Lyrics: Saraswati Putra Ramajogaiah Shastri, Cinematography: Kashish Grover, Music: Simon K King, Production Company: Barkat Studios, Producer: Aditi Soni, Written & Directed: TG Keerthi Kumar.

'వెన్నెల' కిశోర్ హీరోగా యాక్షన్ కామెడీ సినిమా 'చారి 111'

వినోదానికి కేరాఫ్ అడ్రస్ 'వెన్నెల' కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు... వినోదంలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నారు. హాస్య నటుడిగా మాత్రమే కాదు, కథానాయకుడిగానూ తనకు సూటయ్యే క్యారెక్టర్లు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంటారు. 'వెన్నెల' కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'చారి 111'.

'వెన్నెల' కిశోర్ కథానాయకుడిగా బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న సినిమా 'చారి 111'. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో 'వెన్నెల' కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు.

ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం వచ్చి పడుతుంది. దానిని ఎదిరించడం కోసం మాజీ ఆర్మీ అధికారి ప్రసాద్ రావు (మురళీ శర్మ) వస్తారు. అసలు, ఆ సమస్య ఏమిటి? విలన్ ఎవరు? అనేది వెల్లడించలేదు. కానీ, హీరో క్యారెక్టర్ ఏమిటనేది చాలా క్లారిటీగా చూపించారు. కన్‌ఫ్యూజ్డ్ స్పై పాత్రలో వెన్నెల కిశోర్ వినోదం అందించనున్నారు. ఈషా పాత్రలో హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్, మహి పాత్రలో ప్రియా మాలిక్ నటిస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ ఫైట్స్ చేయనున్నట్లు చూపించారు.

'చారి 111' గురించి చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ''ఇదొక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో 'వెన్నెల' కిశోర్ గూఢచారి (స్పై) పాత్రలో కనిపిస్తారు. ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ఆయన లుక్ స్టైలిష్‌గా ఉంటుంది. అలాగే, ఆ పాత్రలో ఓ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అది ఏమిటి? గూఢచారి ఏం చేశాడు? అనేది స్క్రీన్ మీద చూడాలి. గూఢచారి సంస్థ హెడ్‌గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ ప్రేక్షకుడిని మా సినిమా అలరిస్తుంది'' అని చెప్పారు.

చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ''స్పై జానర్ సినిమాల్లో 'చారి 111' కొత్తగా ఉంటుంది. 'వెన్నెల' కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. కథలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. అందులో విలన్ రోల్ ఒకటి. విలన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పటి వరకు చిత్రీకరణ చేసిన సన్నివేశాలు మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది'' అని చెప్పారు.

'వెన్నెల' కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, 'తాగుబోతు' రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్ ఎ, స్టంట్స్ : కరుణాకర్, ప్రొడక్షన్ డిజైన్ : అక్షత బి హొసూరు, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలు కొమిరి, సాహిత్యం : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ : కషిష్ గ్రోవర్, సంగీతం : సైమన్ కె కింగ్, నిర్మాణ సంస్థ : బర్కత్ స్టూడియోస్, నిర్మాత : అదితి సోనీ, రచన, దర్శకత్వం : టీజీ కీర్తీ కుమార్.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved