Global Star Ram Charan as Chief Guest at Champion Trailer Launch Event
ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- డిసెంబర్ 18న గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ఛాంపియన్ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన గిరిగిర, సల్లంగుండాలే పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.
తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 18న ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా విచ్చేసి ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన 'చిరుత ఫర్ ఛాంపియన్' స్పెషల్ వీడియోలో చిరుతోస్తే చిందే వేయ్యాలా సాంగ్ అభిమానులని అలరించింది.
ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ అద్భుతమైన అల్బమ్ కంపోజ్ చేశారు. తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతమైన డీటెయిల్స్‌తో రిక్రియేట్ చేశారు, ఆర్. మధీ కెమెరా వర్క్ ఆ ప్రపంచంలోకి మనల్ని లీనం చేస్తుంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తారాగణం: రోషన్, అనస్వర రాజన్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి
సాంకేతిక బృందం:
బ్యానర్లు: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్
సమర్పణ: జీ స్టూడియోస్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
డిఓపి: ఆర్ మధీ
సంగీతం: మిక్కీ జె మేయర్
ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు