Champion success meet
ఛాంపియన్ మా అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్. సినిమాకి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ: పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ లో హీరో రోషన్
స్వప్న సినిమాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఛాంపియన్'. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ.. మీడియా అందరికీ థాంక్యు సో మచ్. ఛాంపియన్ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ ప్రాజెక్టుకి నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను. స్వప్న అక్క నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. తనకి సినిమా అంటే చాలా పాషన్ సినిమా కోసం ఏమైనా చేస్తుంది. కిరణ్ గారికి థాంక్యూ, అలాగే జీకే గారికి, మా నిర్మాతలు అందరికీ థాంక్యూ సో మచ్. కళ్యాణ్ చక్రవర్తి గారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పటినుంచి ఆయన నటన కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన మాకు ఒక ఇన్స్పిరేషన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను, మిక్కీ గారు బ్లాక్బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. ఆయన పాటలే చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్లాయి. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అనస్వర చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. తనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఉంది. ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఛాంపియన్ ఎప్పటికీ నాకు స్పెషల్ ఫిలిం. నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్యూ. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మా అందరికీ స్పెషల్. ఇది ఫ్యామిలీ మూవీ. అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ.. సినిమాకి అద్భుతమైన విజయాన్ని ఇచ్చి మమ్మల్ని ఛాంపియన్స్ చేసిన ఆడియన్స్ కి థాంక్యూ. ఛాంపియన్ నా మొదటి తెలుగు సినిమా. థియేటర్స్ లో కూర్చుని ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని నేను గతంలో ఎప్పుడూ చూడలేదు. గిరగిరా నా ఫేవరెట్ సాంగ్. మిక్కీ గారు అద్భుతమైన ఆల్బమ్ క్రియేట్ చేశారు. చంద్రకళ పాత్ర ఇచ్చిన ప్రదీప్ అన్నకి థాంక్యూ. సప్న గారి సపోర్ట్ కి థాంక్యూ. సినిమాకి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ.
డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమాని బ్లాక్ బాస్టర్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ. రివ్యూలతో సినిమాని ముందుకు తీసుకెళుతున్న మీడియా అందరికీ థాంక్యూ సో మచ్. ఛాంపియన్ సినిమా మీ ముందుకు రావడానికి కారణం స్వప్న గారు కిరణ్ గారు జి కే గారు జి స్టూడియోస్,. మా నిర్మాతలు అందరికీ థాంక్స్. నాలుగేళ్ల క్రితం ఈ కథని స్వప్న గారికి చెప్పాను. అప్పుడే ఈ సినిమా చేస్తున్నామని సైన్ చేశారు. ఈ సినిమా విషయంలో 100 శాతం స్వేచ్ఛని ఇచ్చారు. సినిమాకి అన్ని వైపుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే కొన్నిచోట్ల స్లోగా ఉందనే కామెంట్స్ కూడా వినిపించాయి. అది మాకు తెలుసు. చాలా పెద్ద కాన్వాస్ ఉన్నావు సినిమా. బైరాన్ పల్లి, అక్కడ మనుషులు, మైఖేల్, తన ప్రపంచం.. ఇవన్నీ చెప్పినప్పుడు కచ్చితంగా టైం తీసుకుంటుంది. అలా తీసుకునే ప్రయత్నంలో కొంచెం లెంత్ అయిన ఫీలింగు రావచ్చు. అదంతా మేమందరం కాన్షియస్ గా తీసుకున్న నిర్ణయమే. ఈ సినిమా క్లైమాక్స్ ని 18 రోజులు షూట్ చేశాం. అది మామూలు యాక్షన్ సీక్వెన్స్ కాదు. అది ఒక ఊరి మీద జరిగిన దారుణమైన దాడి. ఒక యుద్ధం. మేము సినిమాలో చూపించిన దానికంటే దారుణమైన హింస ఆ ఊరిపై జరిగింది. అలాంటి సన్నివేశం తీస్తున్నప్పుడు ఖచ్చితంగా డీటెయిల్ కావాలి. అద్భుతమెన కథ, బ్రహ్మాండమైన లీడ్ పెయిర్, మ్యూజిక్, యాక్షన్, సపోర్టింగ్ కాస్ట్.. ఇలా అన్ని అంశాలు అద్భుతంగా కుదిరిన సినిమా ఇది. అందరూ ఈ సినిమాకి ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. కచ్చితంగా ఇది పిల్లలతో పాటు చూడాల్సిన సినిమా. ఇది మన నేల చరిత్ర. స్వప్న గారు ఎప్పుడు కూడా బడ్జెట్ గురించి ఆలోచించలేదు. మిక్కీ జే మేయర్, మది గారు, తోట గారు, పీటర్ మాస్టర్ ఇలా అద్భుతమైన టెక్నీషియన్స్ని ఇచ్చా.రు వారి సపోర్ట్ తోనే ఈ సినిమా ఇంత అద్భుతంగా బయటికి వచ్చింది. రోషన్ కి మూడేళ్ల క్రితం కథ చెప్పాను. తనకి ఇంకో సినిమా చేసుకొని రమ్మని మేము చెప్పాం. కానీ తను ఈ సినిమా అయ్యాకనే మరో సినిమా చేస్తానని చెప్పాడు. నిజానికి ఇది చాలా పెద్ద త్యాగం. అంత ప్రామిసింగ్ యాక్టర్ మూడేళ్లు ఎదురు చూడటం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో తనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అనస్వర చంద్రకళ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. సినిమాలో నటించిన ప్రతి క్యారెక్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కళ్యాణ్ చక్రవర్తి గారు రాజిరెడ్డి పాత్రలో అద్భుతమైన రాజసంతో చేశారు. ఆయనకి ధన్యవాదాలు. ఈ సినిమాకి ఆడియన్స్ రిపీట్ గా వెళ్తున్నారు. సినిమాకి లాంగ్ రన్ వుంటుంది. సినిమాని ఎంత అద్భుతంగా చేయడానికి కారణం స్వప్న గారి సపోర్టు. నేను స్వప్న సినిమాస్ లో వైజయంతిలో మళ్లీ మళ్లీ సినిమాలో చేయాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. వైజయంతి మూవీస్ కి 50 ఇయర్స్. స్వప్న సినిమాస్ మొదలై కూడా 25 ఏళ్లు అవుతుంది. ఈ రెండు బ్యానర్స్ లో ఎప్పుడు కూడా మేము ఈజీ సినిమాలు చేయలేదు. ప్రతిసారి ఒక ఛాలెంజింగ్ గా ఉన్న కథలు ఎంచుకుని సినిమాలు చేస్తున్నాం. ఈ కష్టమైనా సినిమాల్లోనే ఒక తృప్తి ఉంది. డబ్బు అనేది అవసరమే కానీ సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా ముఖ్యం. అందుకే సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమాలు చేస్తున్నాం. కిరణ్ గారికి, జీకే, జి స్టూడియోస్ కి థాంక్యూ. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఇందులో నటించిన అందరూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ప్రదీప్ నాలుగేళ్ల క్రితం ఈ కథ చెప్పాడు. కథ చెప్పిన వెంటనే చాలా నచ్చింది. ఈ కథకి హీరో ఎవరు అని చూస్తున్నప్పుడు అప్పుడు రోషన్ ఫోటో చూడడం జరిగింది. అప్పటికి ఇంకా యంగ్ గా ఉన్నాడు. ఈ సినిమా కోసం మూడేళ్లు వెయిట్ చేశాడు. మేము అప్పుడు కల్కి చేస్తున్నాం. తనకి ఇంకో సినిమా చేసి రమ్మని చెప్పాం. కానీ తను ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తానని చెప్పాడు. అనస్వర చాలా చక్కగా నటించింది. ఈ సినిమాకి మరో హీరో మిక్కీ జే మేయర్. సినిమా రిలీజ్ కి ముందే పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈరోజు ఈ ఓపెనింగ్స్ రావడంలో తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచే కళ్యాణ్ చక్రవర్తి గారిని మేము సంప్రదించాం. అప్పటికి ఇంకా ఆయన చెన్నైలోనే ఉన్నారు. ఫైనల్ గా ఈ సినిమాలో ఆయన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా సినిమాలో చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. మది గారు, చంటి గారు, పీటర్ మాస్టర్, తోట గారు.. టెక్నీషియన్స్. యాక్టర్స్ వీళ్లంతా కూడా ఈ సినిమాకి రియల్ ఛాంపియన్స్. రాత్రి పగలు కష్టపడి వర్క్ చేశారు. మా ప్రొడక్షన్ టీం కి థాంక్యూ. మేము ఎప్పుడు డిఫరెంట్ సినిమా చేసిన ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇంత ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం.
మిక్కీ జే మేయర్ మాట్లాడుతూ.. రోషన్ అనస్వర అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడే చాలా థ్రిల్లయ్యాను. ఈ సినిమాలో అందరూ కూడా అద్భుతంగా పెర్ఫాం చేశారు. నన్ను బిలీవ్ చేసినందుకు స్వప్న గారికి ప్రదీప్ గారికి థాంక్యూ. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యు. ఇది అద్భుతమైన సినిమా. చాలా అరుదుగా ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.