pizza

Chennai Love Story team celebrates Mani Sharma’s birthday
మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించిన "చెన్నై లవ్ స్టోరీ" టీమ్

You are at idlebrain.com > news today >

11 July 2026
Hyderabad

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా "చెన్నై లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు "చెన్నై లవ్ స్టోరీ" మూవీ రెడీ అవుతోంది.

ఈ రోజు మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు వేడుకల్ని "చెన్నై లవ్ స్టోరీ" టీమ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, నిర్మాతలు ఎస్ కేఎన్, సాయి రాజేష్, సహ నిర్మాత ధీరజ్ మొగిలినేని, డైరెక్టర్ రవి నంబూరి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మణిశర్మకు బర్త్ డే విశెస్ తెలిపారు. ఈ సినిమాకు మణిశర్మ కంపోజ్ చేసిన 'తొలి ప్రేమేం తోపు కాదే..', 'వదలనే..','జిగితార..', 'హొయిలా హొయిలా' పాటలన్నీ ఛాట్ బస్టర్స్ గా మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తున్నాయి.

నటీనటులు - కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ - దేవి పర్చూరి
ఆర్ట్ - భాస్కర్ ముదావత్
ఎడిటర్ - సంతోష్ నాయుడు
డీవోపీ - విశ్వాస్ డేనియల్
లిరిక్స్ - అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ - మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ - సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా
మార్కెటింగ్ - హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
స్టోరీ - సాయి రాజేశ్
నిర్మాతలు - ఎస్ కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - రవి నంబూరి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved