pizza

“Cinema means Chiranjeevi” – Sujeeth
సినిమా అంటేనే చిరంజీవి - సుజీత్

You are at idlebrain.com > news today >

30 September 2025
Hyderabad

With the massive success of OG, director Sujeeth has become the talk of the town. Social media is flooded with praise, calling this success a well-deserved reward for all the hard work he has put in over the years. Sujeeth has managed to impress not only Pawan Kalyan’s fans but also the film industry with his talent.

OG, starring Pawan Kalyan and Priyanka Arul Mohan, featured popular Bollywood actor Emraan Hashmi as the antagonist. Thaman’s music added significant strength to the film.

Coming to the details, Megastar Chiranjeevi recently reacted to the success of his younger brother’s film OG, applauding Sujeeth and saying that the director has succeeded 100% in crafting the film brilliantly. Overwhelmed by Chiranjeevi’s praise, Sujeeth took to Twitter to express his emotions: “Cinema means Chiranjeevi… and now that very Chiranjeevi has made my dream come true. I don’t even know how to describe this joy. A small word like ‘Thank You’ doesn’t do justice to such a huge blessing. Love you so much, Chiranjeevi garu… your words gave me immense strength,”Sujeeth wrote, quoting Chiranjeevi’s tweet and sharing his heartfelt gratitude.

సినిమా అంటేనే చిరంజీవి - సుజీత్

'OG' భారీ విజయంతో ప్రతి నోటా దర్శకుడు సుజీత్ పేరే వినిపిస్తుంది. ఇన్నేళ్ల ఆయన పడ్డ కష్టానికి తగిన ఫలితం వచ్చిందంటూ ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. అటు పవన్ అభిమానులతో పాటూ సినీ వర్గాలను సైతం తన ప్రతిభతో ఆకర్షించారు సుజీత్. పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా కనిపించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ ప్రతినాయకుడు పాత్రలో కనిపించారు. సంగీత దర్శకుడు థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు బలమయిందనే చెప్పుకోవచ్చు.

వివరాల్లోకి వెళ్తే తాజాగా తమ్ముడి సినిమా 'OG' విజయంపై అన్నయ్య చిరంజీవి స్పందిస్తూ 'OG' సినిమాను అద్భుతంగా మలచడంలో సుజీత్ వంద శాతం విజయం సాధించాడంటూ ప్రశంశలు కురిపించారు. చిరంజీవి ప్రశంసలకు మురిసిపోయారు సుజీత్. ట్విట్టర్ వేదికగా "సినిమా అంటేనే చిరంజీవి... ఇప్పుడు ఆ చిరంజీవే.. నా కల నెరవేరింది. ఈ ఆనందాన్ని ఎలా పిలవాలో తెలియడం లేదు. అంత పెద్ద ఆశీర్వాదానికి ఇంత చిన్న 'Thank You' అన్న పదం సరిపోదు. లవ్ యూ సో మచ్ చిరంజీవి గారూ... మీ మాట నాకెంతో శక్తిని ఇచ్చింది " అంటూ చిరంజీవి ట్వీట్ ను కోట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు సుజీత్.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved