“Chiranjeevi can even make an introvert like me do the Indra step” – Srikanth Odela
ఇంట్రావర్ట్ గాడితో కూడా 'ఇంద్ర' స్టెప్ వేయించగలడు చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల
Dasara director Srikanth Odela wished his favorite hero Chiranjeevi a heartfelt happy birthday on Twitter. His entire tweet read like a love letter filled with admiration for the Megastar.
“You are my demi-god!
When I once showed my mom a photo I took with Chiranjeevi, she said, ‘This is the first time I’ve seen you smiling in a photo.’ That is my definition of Chiranjeevi.”
“What can your Chiranjeevi do?
He can make an introvert like me dance the Indra step…
He can make a ticket-buying fan like me direct a film…
Your life, Chiranjeevi, is a film that runs forever. Now, making a film with Chiranjeevi means creating something that will be remembered for a lifetime—there’s no other option.”
“And finally… I miss Chiranjeevi on screen. I promise I will bring him back! This is a film I’m making for myself, and for every fan like me. #ChiruOdela. It’s a blood promise. Happy Birthday ‘T-REX’ Mega Star Chiranjeevi Sir.”
Along with this emotional tweet, Srikanth Odela shared a photo with Chiranjeevi, adding in his signature style: “When I clicked the photo at the end, my hand was shivering and the picture came out blurry… please don’t mind.”
ఇంట్రావర్ట్ గాడితో కూడా 'ఇంద్ర' స్టెప్ వేయించగలడు చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల
'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ట్విట్టర్ వేదికగా తన అభిమాన హీరో చిరంజీవికి సరికొత్తగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ట్వీట్ ఆసాంతం చిరంజీవిపై తన ప్రేమను రంగరించే రాసినట్టే అనిపించింది.
"నువ్వు నా డెమీ గాడ్!
చిరంజీవి తో ఒక ఫోటో దిగి ఇంట్లో అమ్మకు చూపెడితే, ఫస్ట్ టైం నువ్వు ఫోటోలో నవ్వడం చూస్తున్నారా అని చెప్పింది. దట్ ఈజ్ మై డెఫినిషన్ ఆఫ్ చిరంజీవి."
"ఏం చేస్తాడు నీ చిరంజీవి అంటే:
నాలాంటి ఇంట్రావర్ట్ గాడితో ఇంద్ర స్టెప్ చేయించగలడు, సినిమా టికెట్లు కొనుక్కునేవాడితో సినిమా తీయించగలడు...
నీ యమ్మ - జీవిత కాలం ఆడే సినిమా రా చిరంజీవి. ఇప్పుడు చిరంజీవితో సినిమా అంటే జీవితకాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు..."
"అండ్ ఫైనల్లీ... ఐ మిస్ చిరంజీవి ఆన్ స్క్రీన్. ఐ ప్రామిస్ ఐ విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్! నాకోసం నేనే తీస్తున్న సినిమా ఇది, నాలాంటి ప్రతి చిరంజీవి అభిమాని కోసం తీస్తున్న సినిమా #ChiruOdela. ఇట్స్ ఎ బ్లడ్ ప్రామిస్.. Happy Birthday 'T- REX' Mega Star Chiranjeevi Sir" అని ట్వీట్ పెట్టి తన అభిమానం మొత్తాన్నీ బయటపెట్టారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ట్వీట్ తో పాటూ చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోను కూడా జతపరుస్తూ, "చివర్లో ఫోటో తీస్తున్నప్పుడు హ్యాండ్ శివర్ అయ్యి ఫోటో బ్లర్ వచ్చింది.. ఏమీ అనుకోవద్దు" అంటూ తన మార్క్ రైటింగ్ తో ముగింపునిచ్చారు శ్రీకాంత్ ఓదెల.