pizza

Niharika Konidela: Committee Kurrollu is a festival of friendship
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.. నిర్మాత నిహారిక కొణిదెల

You are at idlebrain.com > news today >

08 August 2024
Hyderabad

Niharika Konidela's Committee Kurrollu is all set for a spectacular release on 9 August 2024. The film directed by Yadhu Vamsi marks the entry of talented and aspiring newcomers to Tollywood. Ahead of the film release, Niharika who is bankrolling the project under Pink Elephant Banner, interacted with the scribes and shared her experience.

Why did you name your banner as Pink Elephant?
When I started working on the short film Muddapappu Avakaya for a YouTube channel, I named the channel "Elephant" with the hope of eventually working on big projects. That same name carried over to my production house. As for why I added "Pink," honestly, there wasn't a specific reason at the time—I just liked how it sounded.

What did you feel when you first heard the story of "Committee Kurrollu"?
From the moment I heard the story, I knew I had to be a part of this project. I never initially planned to become a producer, but when Anudeep, who works in my office and is also an actor, approached me with the script from his friend, I was intrigued. The story was narrated with music that was already composed for the film, and Yadhu Vamsi's storytelling drew me in completely. By the end, I knew I couldn't let this opportunity slip by.

How does the village festival in "Committee Kurrollu" spread across the timeline?
The film spans across three different years: 1998, 2011, and 2023, marking the village festival that occurs every 12 years. While the film primarily focuses on friendship, the festival serves as a key timeline marker. Yadhu Vamsi drew inspiration from real events to craft this narrative.

Were the references to Pawan Kalyan's political journey in the climax included from the beginning, or were they added later?
Yadhu Vamsi, who is a huge fan of Pawan Kalyan, believed that an incident from 2019 played a crucial role in shaping the 2024 political outcome. He depicted this in a sarcastic manner. Typically, political subjects are serious, but we decided to approach this one with a touch of sarcasm and humor.

Why did you decide to become a producer after being an actor?
There's no specific reason, really. While working on Muddapappu Avakaya, I took on the role of actor-producer. My first love is acting, and I'm still acting, especially in Tamil films.
Some feel your projects are realistic and emotional, and that they might have had a better reach if made in Malayalam.

What are your thoughts?
Language isn't a barrier when it comes to good content. Even though Mani Ratnam and Shankar's films were dubbed in Telugu, many Telugu viewers still watched the originals and appreciated them. This proves that content is king, regardless of language.

Your family has over 11 heroes. Why did you choose 11 newcomers instead of casting your family members?
Committee Kurrollu is also a mass entertainer, and I was surprised by how many mass masala scenes it contained. Despite not being well-versed in Godavari traditions, language, or culture, I saw myself in those 11 newcomers. It was a gut feeling, something I can't quite put into words. I believe the film will connect with viewers because Vamsi wrote the script in a realistic and disciplined manner. My father, Naga Babu, was also impressed after Yadhu Vamsi narrated the story to him for five hours.

Did you show the film to Pawan Kalyan?
After the elections, I couldn't even meet my dad, so I haven't had the chance to show the film to Pawan Kalyan yet. He’s been extremely busy. However, he did like the subject when he heard it through another producer, which was one of the reasons I decided to listen to the story myself.

Do you have any particular genre in mind when selecting projects like "Committee Kurrollu"?
No, I don’t stick to a specific genre. I’ve worked on different genres, like Ok Chinna Family, Hello World, and now Bench Life. Committee Kurrollu felt like a fun project. When I visited Amalapuram during the shoot, the locals advised me not to come because crowds were gathering. I didn’t attend the Jathara shoot but was present for the climax scenes.

Did you ask anyone from your family to watch the film?
I asked Varun Tej and Lavanya to watch the film because their feedback is important to me. Apart from them, I also have a close group of friends whose opinions I value. Varun Tej gave me positive feedback, and I take my brother and dad's feedback seriously as well.

What feedback did you receive from the Censor Board?
The Censor Board's feedback was very positive—they liked the film.

What was your experience working with newcomers?
Initially, I was concerned that working with an all-new cast might be challenging for the film's business. But Vamsi convinced me to listen to the story first. After hearing it, I was confident. Prasad is the only well-known face among the cast, and everyone else has been with the film for three years. They were so committed that no one even needed to hold a dialogue paper on set. It felt like they chose me rather than the other way around.

When was the title "Committee Kurrollu" finalized? Were any other titles considered?
The title "Committee Kurrollu" was fixed early on. I wasn’t familiar with what "Committee Kurrollu" meant initially, but Vamsi explained that they are the ones who take charge in festivals, pubs, and even fights.

Who got the most preference in "Committee Kurrollu"?
Every character in Committee Kurrollu has significant moments, and everyone shines in their own way. The music by Anudeep is the heart of this film—his songs and background score are phenomenal and a major strength of the movie.

What is your take on nepotism?
If someone enters the film industry simply because they have a legacy, they won't succeed. Cinema requires passion and a genuine love for the craft. Success comes only through hard work and dedication.

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.. నిర్మాత నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు నిర్మాత నిహారిక కొణిదెల మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..

* కథ విన్నాక ఈ చిత్రంలో నా పేరు మాత్రం కనిపించాలని అనుకున్నాను. ఫీచర్ ఫిల్మ్ చేయాలని అనుకున్న టైంలో అంకిత్ ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. మ్యూజిక్‌తో పాటుగా ఈ కథను నాకు వినిపించారు. అనుదీప్ గారు అప్పటికే మ్యూజిక్ చేసేశారు. సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర ఎక్స్‌పీరియెన్స్ చేయలేదు. కానీ నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. నెరేషన్ అద్భుతంగా ఇచ్చాడు. ఓటీటీలో అయినా థియేటర్లో అయినా సినిమా మేకింగ్ ప్రాసెస్ ఒకటే. అందుకే ఈ కథను ఎలాగైనా నిర్మించాలని ఫిక్స్ అయ్యా.

* పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాసుకున్నాడు. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. వంశీ గారి పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు కూడా ఇందులో ఉన్నాయి. వంశీ గారు పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. 2019 ఎన్నికల ప్రచార టైంలో జరిగిన విషయాలను కూడా ఇందులో తన స్టైల్లో, కాస్త సెటైరికల్‌గా చూపించారు.

* ముద్దపప్పు ఆవకాయ్ టైంలో నేను నటించాను. ఆ టైంలో నేను అందులో డబ్బులు కూడా పెట్టాను. అదే ప్రొడక్షన్ హౌస్ అయింది. కావాలని నిర్మాత అవ్వలేదు. అలా అయిపోయానంతే. నాకు నటించడమే ఇష్టం.

* పదకొండు మంది అబ్బాయిల కారెక్టర్లో నన్ను నేను ఊహించుకొన్నాను. సినిమాను చూసే ప్రతీ ఆడియెన్ ఏదో ఒక కారెక్టర్‌తో ట్రావెల్ చేస్తారు. ప్రతీ ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు.

* టాలెంట్ మాత్రమే కాదు.. క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతారని చిరంజీవి గారు చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ నేను వంశీలో చూశాను. ఆయన సినిమా కోసం చాలా కష్టపడ్డారు.

* మా నాన్నకి కూడా వంశీ నెరేషన్ ఇచ్చారు. మామూలుగానే మా నాన్నకి నచ్చక పోతే వెంటనే లేచి వెళ్లిపోతారు. కానీ వంశీ చెప్పిన కథ మా నాన్నకి కూడా చాలా నచ్చింది.

* మా అన్నా, వదినలు సినిమాను చూశారు. వాళ్లకి సినిమా చాలా నచ్చింది. బయటి వాళ్ల పొగడ్తలు, క్రిటిసిజం పట్టించుకోను. మా అన్న ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పేస్తుంటారు. ఈ మూవీ చూసి వెంటనే నన్ను పిలిచి అభినందించారు. సెన్సార్ వాళ్లకి కూడా సినిమా బాగా నచ్చింది.

* అంతా కొత్త వాళ్లుంటే.. బిజినెస్‌కు ఇబ్బంది అవుతుందని అన్నాను. కథ వినండి.. విన్న తరువాత చెప్పండని వంశీ అన్నారు. ప్రసాద్ ఒక్కడే అందరికీ తెలిసిన వ్యక్తి. వాళ్లంతా కూడా సినిమాతో మూడేళ్లుగా ప్రయాణం చేశారు. ఎవ్వరూ కూడా సెట్స్ మీద డైలాగ్ పేపర్ పట్టుకోలేదు. నేను వాళ్లని ఎంచుకోలేదు.. వాళ్లే నన్ను ఎంచుకున్నారు.

* కమిటీ కుర్రోళ్లు టైటిల్‌ను ముందే ఫిక్స్ చేశారు. నాకు కమిటీ కుర్రోళ్లు అంటే ఏంటో తెలియదు. పండుగలు, పబ్బాలు, గొడవలు ఇలా ఏది ఉన్నా కమిటీ కుర్రాళ్లే ముందుంటారని వంశీ చెప్పారు (నవ్వుతూ)

* ప్రతీ ఒక్క పాత్రకు మంచి సీన్స్ ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సీన్‌లో షైన్ అవుతారు. ఇక అనుదీప్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ఆయన ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఈ మూవీకి ఆయనే ప్రధాన బలం.

* మంచి కథలు, కాన్సెప్ట్‌లు, స్క్రిప్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తా. పాత్ర బాగుంటే మిగతా అంశాల గురించి అంతగా పట్టించుకోను. చిన్న పాత్ర అని, చిన్న హీరో అని కూడా ఆలోచించను. కథ బాగుండి.. పాత్ర నచ్చితే సినిమాల్లో నటిస్తాను.

* వారసత్వం ఉంది కదా అని సినిమాల్లోకి వస్తే సక్సెస్ అవ్వలేరు. సినిమా అంటే ప్యాషన్, ఇష్టం ఉండాలి. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడాలి. అప్పుడే విజయం సాధించగలరు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved